ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము
|
ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము |
|
|---|---|
| స్థాపన | 1964 |
| తరహా | ప్రభుత్వ |
| ఉప కులపతి | పి రాఘవ రెడ్డి |
| ప్రదేశం | హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ |
| క్యాంపస్ | పట్టణ |
| ఇతర పేర్లు | ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము |
| అనుబంధాలు | యు.జి.సి |
| వెబ్‌సైటు | www.angrau.net |
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము 1964 హైదరాబాదులో స్థాపించబడింది. 1996 నవంబర్ 7న దీని పేరుని ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జీ.రంగా పేరు మీద ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము గా మార్చటం జరిగింది. ఈ విశ్వవిద్యాలయము కింద 9 బోధనా కేంద్రాలు, 14 కాలేజిలు, 67 పరిశోధనాశాలలు, 6 కృషి విజ్ఞాన కేంద్రాలు, 7 పాలిటెక్నిక్ కాలేజిలు, 22 జిల్లా వ్యవసాయ సలహా మరియు విజ్ఞాన బదిలీ కేంద్రాలు ఉన్నాయి. డిగ్రీ కోర్సులలో ప్రవేశం EMCET ఆధారంగా జరుగుతుంది.
1964, జూన్ 12న హైదరాబాదులో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒ.పుల్లారెడ్డి ప్రథమ ఉపసంచాలకునిగా పనిచేశాడు. విశ్వవిద్యాలయానికి అధికారముగా 1965, మార్చి 20న అప్పటి భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1966, జూన్ 23న ఇందిరా గాంధీ విశ్వవిద్యాలయ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసింది.
విషయ సూచిక |
[మార్చు] విశ్వవిద్యాలయము అందిస్తున్న కోర్సులు
- డిగ్రీ కోర్సులు
బి.ఎస్.సి.(వ్యవసాయం), బి.ఎస్.సి.(ఉద్యానవనం), బి.టెక్(వ్యవసాయ ఇంజినీరింగ్), బి.వి.ఎస్.సి (పశువైద్యం), బి.ఎస్.సి.(సి.ఎ & బి.ఎమ్), బి.ఎచ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), బి.టెక్ (పుడ్ సైన్సు).
- పి.జి. కోర్సులు
ఎమ్.ఎస్.సి(వ్యవసాయం), ఎమ్.వి.ఎస్.సి (పశువైద్యం), ఎమ్.ఎ.బి.ఎమ్, ఎమ్.ఎస్.సి (అగ్రికల్చరల్ బయోటెక్నాలజి), ఎమ్.ఎస్.సి (ఎన్విరాన్ మెంటల్ సైన్సు అండ్ టెక్నాలజి), ఎమ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), ఎమ్.ఎస్.సి (పుడ్ సైన్సు అండ్ టెక్నాలజి).
- రీసెర్చ్ కోర్సులు
వ్యవసాయం, పశువైద్యం, గృహవిజ్ఞాన శాస్త్రాలలో పి.ఎచ్.డి.
- పాలిటెక్నిక్ కోర్సులు
వ్యవసాయంలో డిప్లొమా, ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా, గృహవిజ్ఞాన శాస్త్రంలో డిప్లొమా.
[మార్చు] అవార్డులు
- ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా 2007 సంవత్సరానికి సర్దార్ పటేల్ ఔట్ స్టాండింగ్ ఐ.సి.ఎ.ఆర్. ఇనిస్టిట్యూట్ అవార్డు లభించింది.[1]
[మార్చు] పత్రిక
వ్యవసాయం [2] అనబడే తెలుగు మాస పత్రిక ని ప్రచురిస్తున్నది.