ఆతుకూరి మొల్ల

వికీపీడియా నుండి
మొల్ల

ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.

విషయ సూచిక

[మార్చు] స్వస్థలము

మొల్ల వైఎస్ఆర్ జిల్లా గోపవరం ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.

గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రమము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప

వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్తులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరం లో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన కూడా గోపవరం వచ్చినట్లుగా కొందరు వృద్ధుల కథనం.

వాంగ్మయ మూలాల అధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్లి చేసుకోలేదని అనుకోవచ్చు.

[మార్చు] మొల్ల రామాయణము

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో[1] కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము ఐదు రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక బాషకు దగ్గరగా ఉన్నది.

[మార్చు] మొల్ల శైలికి ఉదాహరణలు

మొల్ల రామాయణం తాటాకు ప్రతి

తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ

జడలు దాలిచి తపసుల త్సందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలములు

  • వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 94-97 (ఆంగ్లములో)
  1. Women writing in India: vol.1 & 2 By Susie J Tharu, Ke Lalita పేజీ.95 [1]

[మార్చు] బయటి లింకులు

[మార్చు] యూనికోడ్ లో మొల్ల రామాయణము

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు