ఆత్మబంధువు
| ఆత్మబంధువు (1962) | |
| దర్శకత్వం | పి.ఎస్. రామకృష్ణారావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి , యస్వీ రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ, పద్మనాభం, సూర్యకాంతం, హరనాధ్, రీటా |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ సారధీ స్టూడియోస్ |
| విడుదల తేదీ | 14 డిసెంబర్ 1962 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి ననుకొలువ తపమేమి చేసానో క్రిష్ణయ్యా | సముద్రాల | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| చదువురానివాడవని దిగులు
చెందకు మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు? మంచువంటి మల్లెవంటి మంచిమనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకూ [చదువు] ఏమిచదివి పక్షులు పైగెగురగలిగెను? ఏ చదువువల్ల చేపపిల్లలీదగలిగెను? అడవిలోని నెమలికెవడు ఆటనేర్పెను? కొమ్మపైనికోకిలమ్మకెవడు పాటనేర్పెను? [చదువు] తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని ఏమెరుగని చంటిపాపఏడ్చును అమ్మా అని చదువులతో పనియేమి హృదయమున్నచాలు కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు [చదువు] |
సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
| చీరగట్టి సింగారించి చింపి తలకు చిక్కు తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదానా | కొసరాజు | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
| మారదూ మారదూ మనుషులతత్వం మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు భ్రమపడకూడదు [మారదు] సూర్య చంద్రులూ మారలేదులే చుక్కలు మొలవకా మానలేదులే మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం మారటమంటే సుళువుకాదులే [మారదు] పైసా ఉంటే అందరుమాకు బంధువులంటారు పైసాపోతే కన్నబిడ్డలే చీపో అంటారు చెవులకు చేటలు కడతారు [మారదు] కాసుపడనిదే తాళి కట్టరు పెళ్ళిపీటపై వారు కాలు పెట్టరు కట్నములేనిదే ఘనతే లేదనీ చదువుకున్నవారే కలలుకందురూ [మారదు] ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో కాపాడేవాడే బంధువూ అతడే బంధువూ ఆత్మబంధువూ |
కె.వి.మహదేవన్ | పి.సుశీల, బృందం | |
| దక్కెనులే నాకు నీ సొగసు | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి |
| తీయని ఊహల ఊయలలూగె ప్రాయం | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | సుశీల, కె. జమునా రాణి బృందం |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.