ఆత్మహత్య
వికీపీడియా నుండి
The English romantic poet Thomas Chatterton, believed to have killed himself with arsenic in 1770
ఆత్మహత్య (Suicide) మహాపాతకం అంటారు. ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం మన లా కమీషన్ సిఫారసు చేసింది. మనదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం 45వ స్థానంలో ఉండగా, మన పొరుగు దేశమైన శ్రీలంక 12వ స్థానంలో ఉంది.
విషయ సూచిక |
[మార్చు] ఆత్మహత్యలకు కారణాలు
- ప్రేమ అనుబందాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం
- వరకట్నవేదింపులు,
- నయంకాని జబ్బులు,
- తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు
- రాజకీయ అస్థిరత
- మతపరమైన విద్వేషాలు
- ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం
- పురుగు మందులున్న ఇళ్ళలో ఆత్మహత్యకు ప్రేరణ కలుగుతుందట
[మార్చు] పద్ధతులు
- పురుగు మందును తాగడం (37 శాతం)
- ఉరి వేసుకోవడం (26 శాతం),
- ఒంటికి నిప్పంటించుకోవడం (11 శాతం),
- నీళ్లలో మునిగిపోవడం (9 శాతం),
- తుపాకీతో కాల్చుకోవడం (1 శాతం)
- ఎత్తైన చోట్లనుండి దూకటం
[మార్చు] హిందూ శాస్త్రాల దృష్టిలో ఆత్మహత్య
- ఆత్మహత్య మహా పాతకం
[మార్చు] ఇస్లాం దృస్టిలో ఆత్మహత్య
- ఒకడు ఇనుప కమ్మీతో ఆత్మహత్య చేసుకుంటే అదే ఇనుప కమ్మీతో నరకాగ్నిలో శిక్షించబడతాడు. ఒక వ్యక్తి గాయపడి వాటి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. "నా దాసుడు తొందరపడి తనను తాను చంపుకున్నాడు, ఇతనికి పరలోక ప్రవేశం ఉండదు" అంటాడు అల్లాహ్. (బుఖారీ 2:445)
- "ఊపిరాడకుండా చేసుకొని చనిపోయినవాడు నరకంలో కూడా ఊపిరాడని శిక్షలోనే ఉంటాడు. కత్తితో పొడుచుకొని చనిపోయినవాడు నరకాగ్నిలో సదా తనను తాను పొడుచుకుంటూనే ఉంటాడు. " (బుఖారీ 2:446)
- ఒకడు ఏవస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో పునరుత్థాన దినాన అదే వస్తువుతో హింసించబడతాడు.(బుఖారీ 8:73)
[మార్చు] క్రైస్తవం దృస్టిలో ఆత్మహత్య
- ఏసుక్రీస్తును పట్టించిన శిష్యుడు ఇస్కరియోతు యూదా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. (మత్తయి27:5)
- సౌలు తన కత్తిమీదే పడి ఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:4)
- సౌలు ఆయుధాలు మోసేవాడు తన యజమాని చనిపోయాడు కాబట్టి తాను కూడా (విశ్వాసంగలకుక్క) లాగాఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:6)
- సంసోను ( మానవ బాంబు ) లాగా ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 16:26-31)
- అబీమెలెకు ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 9:54),
- అహితోపెలు ఆత్మహత్య చేసుకున్నాడు. (2సమూయేలు 17:23),
- జిమ్రీ ఆత్మహత్య చేసుకున్నాడు. (1 రాజులు 16:18),
ఒక్క సంసోను తప్ప మిగతావారంతా నరకానికి వెళతారని క్రైస్తవుల అభిప్రాయం.
- ఏసుక్రీస్తు పాపిష్టి ప్రజలకి బదులు చనిపోవటానికే ఈ లోకంలోకి తెలిసే వచ్చాడంటారు.
[మార్చు] చనిపోవాలని కోరుకోవటం
- పౌలు ఈ లోకంనుంచి వెళ్ళిపోవలనుకుంటాడు(ఫిలిప్పీ1:20)
- అంత్యదినాల్లో ప్రజలు చనిపోవాలని కోరుకుంటారు గాని వాళ్లకు చావు దొరకదు.మరణం వాళ్ళదగ్గరనుండి పారిపోతుంది.(ప్రకటన 9:10)
[మార్చు] ఆపడం ఎలా
- ఎక్కువ మంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడక్కడ వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు.
- పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు... చిన్న విషయానికే ఆవేశం, మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి.
- బిడ్డల భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తుతెచ్చుకోవాలి.
- సమశ్యలను తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.
- పోషించే శక్తిలేనివారు పిల్లల్ని కనకపోవటం మంచిది.
[మార్చు] ఆత్మహత్యను ఆపే కొన్ని సామెతలు
- పరుగెత్తి పాలుతాగేకన్న నిలబడి నీళ్ళుతాగటం మంచిది
- బతికియున్న శుభములు బడయవచ్చు
- బతికుంటే బలుసాకుతిని బతకొచ్చు
- చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు
- చచ్చి ఏం సాధిస్తావు?