ఆదిపూడి సోమనాథరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిపూడి సోమనాథరావు
జననం
ఆదిపూడి సోమనాథరావు

1867
మరణం1941
వృత్తిబహుభాషా పండితుడు, రచయిత, సంఘసంస్కర్త
గుర్తించదగిన సేవలు
కంబరామాయణము,
కిన్నరీ విజయము

ఆదిపూడి సోమనాథరావు (1867 - 1941) బహుభాషా పండితులు, రచయిత, సంఘసంస్కర్త.

వీరు ఆరువేలనియోగి శాఖకు చెందిన బ్రాహ్మణులు, శాండిల్య గోత్రులు. వీరు పిఠాపురం సంస్థానంలో చాలాకాలం ఉద్యోగం నిర్వహించారు. వీరికి సంస్కృతం, కన్నడం, హిందీ, తమిళం, బెంగాలీ భాలలో మంచి పరిచయం ఉన్నది. వీరు మొట్టమొదట తెలుగువారికి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనా ప్రతిభను పరిచయం చేశారు. తమిళభాషలోని కంబ రామాయణం మొదట తెలుగు భాషలోకి అనువదించింది వీరే. ఆదిపూడి సోమనాథరావు, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులతో కలిసి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనలో ఎంతో కృషి చేశాడు[1]

రచనలు[మార్చు]

  • జపానుదేశ చరిత్ర
  • దయానంద సరస్వతి చరిత్ర
  • సత్యార్థ ప్రకాశిక
  • ఆంధ్ర రఘువంశము
  • ఆంధ్ర కుమార సంభవము
  • విజయేంద్ర విజయము
  • శ్రీకృష్ణదేవరాయ చరిత్ర
  • కేనోపనిషత్తు
  • కంబ రామాయణము
  • గీతాంజలి (1913)
  • గీతామృతసారము
  • కిన్నరీ విజయము (1920)
  • బుధ భూషణము
  • సర్వమాన్య శతకము
  • లోకపావన శతకము
  • రామమోహన నాటకం.

కిన్నరీ విజయము[మార్చు]

కిన్నరీ విజయము వీరు రచించిన పద్యకావ్యం. ఇది మొదటిసారి 1920 సంవత్సరం కాకినాడలో ముద్రించబడినది.[2]

ఆంగ్లభాషలో థామస్ మూర్ (Thomas Moore) (1779-1852) రచించిన పారడైజ్ అండ్ ది పెరి (Paradise and the Peri) అన్న గ్రంథాన్ని కవి ఈ కావ్యంగా అనువదించారు. దీనిని పెనుగొండలో ప్రముఖ రచయిత టి. శివశంకరం ఇంటివద్ద పండితమిత్రులు రచయితకు ఇచ్చి అనువదించాలని సూచించగా వారు ఈ గ్రంథరూపంలో అనువదించారు. ఈ పుస్తకం 69 పేజీలను కలిగియుండగా అందులోని చివరి 17 పేజీలు ఆంగ్రంలోని Paradise and the Peri పద్యాలను ముద్రించారు. కవి వీటిని గీతమాలికగా అనువదించారు.

మూలాలు[మార్చు]

  • సోమనాథరావు, ఆదిపూడి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 1023.
  1. ఎస్‌.కె., సలీమ్ (30 Aug 2013). "తెలంగాణ సాంస్కృతిక దీప్తి‌". తెలంగాణ ప్రజాశక్తి. Archived from the original on 10 సెప్టెంబరు 2017. Retrieved 5 November 2014.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో కిన్నరీ విజయము పుస్తకం ప్రతి.