ఆపిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆపిల్ కాశ్మీర ఫలం
కాశ్మీర ఫలం
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
M. domestica
Binomial name
Malus domestica

ఆపిల్ (ఆంగ్లం Apple) రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన పండు. దీనిని తెలుగులో "kasmira phalam (కాశ్మీర ఫలం)" అని కూడా పిలుస్తారు. ఇది పోమ్ (pome) రకానికి చెందినది. ఆపిల్ (Malus domestica) జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా, యూరప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది. అక్కడ నుండి దక్షిణ అమెరికాకు విస్తరించింది.

ఆపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. కొన్ని తినడానికి రుచి కోసం అయితే మరికొన్ని వంట కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటు కట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంద్రాలు, బాక్టీరియా చీడలను లోనై ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా 2005 సంవత్సరంలో సుమారు 55 మిలియన్ టన్నుల ఆపిల్ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చైనా మొత్తం ఉత్పత్తిలో సుమారు 35% భాగం ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండవ స్థానంలో ఉండగా ఇరాన్ మూడవ స్థానం ఆక్రమించింది.

వృక్షశాస్త్ర లక్షణాలు[మార్చు]

అడ్డంగా కోసిన ఆపిల్ పండు-మధ్యలోనివి విత్తనాలు.
Blossoms, fruits, and leaves of the apple tree (Malus domestica)

ఆపిల్ చెట్లు చిన్నగా ఉండి ఆకులు రాల్చే రకానికి చెందినదిగా సుమారు 3 to 12 metres (9.8 to 39.4 ft) పొడవు పెరిగి, గుబురుగా ఉంటుంది.[2] దీని ఆకులు ఆల్టర్నేట్ గా అమర్చబడి పొడవుగా 5 to 12 cm పొడవు, 3–6 centimetres (1.2–2.4 in) వెడల్పు ఉండి పత్రపుచ్ఛాన్ని (Petiole) కలిగివుంటాయి. వసంతకాలం (spring) లో ఆకు మొగ్గలతో పాటు పూస్తాయి. ఆపిల్ పుష్పాలు తెల్లగా లేత గులాబీ రంగులో ఉండి ఐదు ఆకర్షక పతాల్ని కలిగి 2.5 to 3.5 centimetres (0.98 to 1.38 in) వ్యాసాన్ని కలిగివుంటాయి. ఆపిల్ పండు చలికాలంలో పరిణితి చెంది సుమారు 5 to 9 centimetres (2.0 to 3.5 in) మధ్యన ఉంటుంది. పండు మధ్యలో ఐదు గింజలు నక్షత్ర ఆకారంలో అమర్చబడి, ఒక్కొక్క గింజలో 1-3 విత్తనాలు ఉంటాయి.[2]

పేగుల ఆరోగ్యానికి యాపిల్‌[మార్చు]

రోజుకి ఒక యాపిల్‌ తింటే డాక్టర్లకి దూరంగా ఉన్నట్టే అనేది నానుడి. పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినటం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య బాగా వృద్ధి చెందుతున్నట్టు వెల్లడైంది. వీటిని క్రమం తప్పకుండా, చాలాకాలం తినటం వల్ల వృద్ధి చెందిన బ్యాక్టీరియా కొన్నిరకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సాయం చేస్తుంది. ఇది పేగుల్లో సూక్ష్మక్రిముల నియంత్రణకు తోడ్పడుతుంది, పేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటీరేట్‌ రసాయనాన్నీ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. (ఈనాడు22.1.2010) పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము . ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

  • యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.
  • యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
  • ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం.
  • గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది. యాపిల్స్‌లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్‌ని బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.
  • యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సయనైడ్‌ని పోలిన విష పదార్థం ఉంటుంది. పిల్లలు కావాలని గాని లేదా అనుకోకుండా గాని యాపిల్ గింజలను అధిక మొత్తాల్లో తింటే ప్రాణప్రమాదం జరుగుతుంది.
  • యాపిల్‌ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు. యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా నిర్వీర్యమవుతుంది.
  • యాంటీ ప్లాట్యులెంట్ డైట్, లోఫైబర్ డైట్ తీసుకునేవారు యాపిల్స్‌ని వాడకూడదు.

యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.

ప్రతీరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్‌ (వ్యాధినిరోధక కారకం) గా పనిచేస్తుంది. 100 గ్రాముల ఆపిల్ తింటే దాదాపు 1,500 మిల్లీగ్రాముల "విటమిన్ సి" ద్వారా పొందే యాంటీఆక్సిడెంట్‌ ప్రభావంతో సమానం.

ఆపిల్‌లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్ఠం చేస్తాయి.

ఆపిల్‌లో మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి లివర్ (కాలేయం), జీర్ణక్రియలలో తలెత్తే సమస్యలను నివారిస్తాయి. పానీయాలలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కిడ్నీ (మూత్ర పిండాలు) లలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.

ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:

  • విటమిన్ ఏ: 900 I.U.
  • విటమిన్ బి: 0.07ఎంజి
  • విటమిన్ సి: 5ఎంజి
  • కాల్షియం: 6ఎంజి
  • ఐరన్: 3ఎంజి
  • ఫాస్పరస: 10ఎంజి
  • పొటాషియం: 130ఎంజి
  • కార్బోహైడ్రేట్స్: 14.9 ఎంజి
  • క్యాలరీలు: 58 క్యాలరీలు

యాపిల్‌ -దంతాలకు ముప్పు[మార్చు]

లండన్‌: రోజుకో యాపిల్‌ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పంటున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు. అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ యాపిల్‌ తినేవారి పళ్లకు.. కర్బన పానీయాలు (కార్బొనేటడ్‌ డ్రింక్స్‌) తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని కింగ్స్‌ కళాశాల దంతవైద్యశాల శాస్త్రవేత్తలు తెలిపారు. ద్రాక్ష సారాయి (వైన్‌), బీర్లతోనూ దంతక్షయం తప్పదని హెచ్చరించారు. మనం ఏం తిన్నామన్నదానికంటే ఎలా తిన్నామనేదే ముఖ్యం. యాపిల్స్‌ తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కానీ, వాటిని తరచూ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయి అని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్‌ బాట్లెట్‌ తెలిపారు. తీసుకునే ఆహారానికి, దంతాల ఆరోగ్యానికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సుగల వెయ్యిమందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలు కనుగొన్నట్లు చెప్పారు. అయితే, కొన్ని రకాల పండ్లు ఆమ్లత్వాన్ని కలిగిఉన్నా.. వాటిని తినే విషయంలో నిరుత్సాహానికి గురిచేయొద్దని మెడికల్‌ రీసెర్చి కౌన్సిల్‌కు చెందిన డా.గ్లెనిస్‌ జోన్స్‌ తెలిపారు. యాపిల్‌తోపాటు పాలు, జున్ను తీసుకోవడం, ఆ తర్వాత బాగా నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని సూచించారు.

ఔషదోపయోగాలు[మార్చు]

విరేచనాలు, అతిసారం: యాపిల్ గుజ్జులో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ పదార్థం ద్రవ రూప మలాన్ని గట్టిపడేలా చేస్తుంది. అందుకే దీనిని అతిసారం వంటి సమస్యల్లో వాడవచ్చు. పచ్చి యాపిల్‌పైన తోలు తొలగించి కండ భాగాన్ని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

  • కొలెస్టరాల్ ఆధిక్యత: ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను, కొలెస్టరాల్ వంటివి ఇతర కొవ్వు సంబంధిత పదార్థాలను శరీరం గ్రహిస్తుంటుంది. అయితే, యాపిల్స్‌ని తీసుకుంటే, దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థాల గ్రహింపును అడ్డుకుంటుంది. పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై అమాశయం గోడల మీద, చిన్న పేగు గోడలమీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.
  • క్యాన్సర్లు: రోజువారీగా యాపిల్స్‌ని వాడే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనే జీవి రసాయనం విడుదలవుతుంది. ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్‌నుంచి మన శరీరాలను కాపాడుతుంది. యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.
  • రక్తహీనత: యాపిల్స్‌లో ఇనుము, ఆర్శినిక్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతలో బాగా పనిచేస్తుంది. తాజాగా జ్యూస్ తీసి వాడితే ఫలితాలు బాగుంటాయి. రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.
  • మలబద్ధకం, విరేచనాలు: యాపిల్స్ మలబద్ధకంలోను, విరేచనాలు రెంటిలోను ఉపయోగపడతాయి. దోరగా ఉన్న యాపిల్స్ మలబద్ధకంలో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం రెండు యాపిల్స్‌ను తీసుకుంటేగాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు. విరేచనాలవుతున్నప్పుడు ఉడికించిన యాపిల్స్ గాని బేక్ చేసిన యాపిల్స్ గాని ఉపయోగపడతాయి. ఉడికించే ప్రక్రియవల్ల యాపిల్స్‌లో ఉండే సెల్యూరోజ్ మెత్తబడి మలం హెచ్చుమొత్తాల్లో తయారవుతుంది.

జిగట విరేచనాలు: పిల్లల్లో తరచుగా జిగట విరేచనాలవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. బాగా మిగల పండి, తియ్యని రుచి కలిగిన యాపిల్స్‌ని మెత్తగా చిదిమి వయసునుబట్టి ఒకటినుంచి నాలుగుపెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఉదర సంబంధ సమస్యలు: అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు యాపిల్ ఆహారౌషధంగా ఉపయోగపడుతుంది. యాపిల్‌ని ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జుగా చేసి, దాల్చిన పొడిని, తేనెను చేర్చి తీసుకోవాలి. గింజలు, తొడిమ తప్ప యాపిల్‌ని మొత్తంగా ఉపయోగించవచ్చు. తిన బోయేముందు బాగా నమలాలి. ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి. యాపిల్‌లో ఉండే పెక్టిన్ అనే పదార్థం అమాశయపు లోపలి పొర మీద సంరక్షణగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది. ముక్కలుగా తరిగిన యాపిల్స్‌కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్‌గా పనిచేస్తుంది.

  • తల నొప్పి: యాపిల్స్ అన్నిరకాల తల నొప్పుల్లోను చక్కగా ఉపయోగపడతాయి. బాగా పండిన యాపిల్‌ని పైనా కిందా చెక్కు తొలగించి, మధ్యభాగంలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పుచేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తల నొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం రెండుమూడు వారాలు తీసుకోవాలి.
  • గుండె జబ్బులు: గుండె సమస్యలున్నవారు యాపిల్ తీసుకోవటం మంచిది. యాపిల్‌లో పొటాషియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు. యాపిల్‌కు తేనెను చేర్చి తీసుకుంటే ఫలితాలు మరింత బావుంటాయి. యాపిల్‌లోని పొటాషియంవల్ల గుండె కండరాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి.
  • అధిక రక్తపోటు: రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.
  • వాపులతో కూడిన కీళ్ల నొప్పులు: గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్లనొప్పుల్లో యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్, గౌట్‌వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్‌ని తటస్థపరిచి నొప్పులను దూరంచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. యాపిల్స్‌ను ఉడికించి జెల్లిలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • పొడి దగ్గు: పొడి దగ్గులో తియ్యని యాపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రోజుకు పావు కిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
  • మూత్రపిండాల్లో రాళ్లు: కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు యాపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది. కంటి సమస్యలు: కళ్ల కలకలు, కంటి ఎరుపులూ ఉన్నప్పుడు యాపిల్‌ను లోపలకూ బయటకూ వాడవచ్చు. పానీయంగా వాడటానికి కొంత తయారీ అవసరం. ముందుగా యాపిల్ చెక్కులను ఒక ప్యాన్‌లో ఉంచి నీళ్లుపోసి నీళ్లు మరిగేటంతవరకూ స్టవ్‌మీద ఉంచాలి. తరువాత దించి దానంతట అదే చల్లబడేలా చేయాలి. తరువాత వడపోసుకొని తేనె కలిపి తీసుకోవాలి. బాగా మిగల పండిన యాపిల్స్‌ను కళ్లమీద పట్టువేయటానికి ఉపయోగించవచ్చు. కంటి మంటల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
  • దంత సమస్యలు: యాపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. పైగా యాపిల్‌లో ఉండే యాసిడ్స్‌వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది. ఏ ఇతర పండులోనూ లేని అద్భుతగుణమిది.

ఇటీవల అధ్యయనాల ప్రకారం రెడ్ ఆపిల్లోని క్వర్సెటిన్ రోగనిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది.

ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక ఆపిల్ తినే మహిళలలో 28 శాతం తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుంది

ఆయుర్వేదము: మూలం: డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

ఐదు పాయింట్లు: యాపిల్[మార్చు]

1.పందొమ్మిదో శతాబ్దం వచ్చే వరకూ ప్రపంచవ్యాప్తంగా 17 వేల రకాల యాపిల్స్ ఉండేవట! కానీ ఇప్పుడు 7,500 రకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 2.యాపిల్ తోటల పెంపకం గురించి తెలిపే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. 3.ఏ పండుకూ లేని విశిష్టత ఒకటి యాపిల్‌కి ఉంది. అదేంటంటే, ఒక జాతికి చెందిన యాపిల్ విత్తనాన్ని నాటితే, అదే జాతికి చెందిన చెట్టు మొలుస్తుందనే గ్యారంటీ లేదట! 4.పూర్వం చాలా ప్రాంతాల్లో యాపిల్‌ని ‘వింటర్ బనానా’ అని పిలిచేవారట! 5.విదేశాల్లో జరిగే హాలోవీన్ వేడుకల్లో ‘బాబింగ్ ఫర్ యాపిల్స్’ ముఖ్యమైనది. చేతుల్ని ఉపయోగించకుండా కేవలం నోటితో యాపిల్‌ని తీసే ఈ పోటీలో గెలిచిన వారికి అతి త్వరలో పెళ్లవుతుందని నమ్మకం.

ఉత్పత్తి[మార్చు]

మొదటి పది మంది అత్యధిక ఆపిల్ ఉత్పత్తిదారులు — 11 June 2008
దేశం ఉత్పత్తి (టన్నులు) పాదపీఠిక
 People's Republic of China 27 507 000 F
 United States 4 237 730
 ఇరాన్ 2 660 000 F
 Turkey 2 266 437
 Russia 2 211 000 F
 Italy 2 072 500
 భారతదేశం 2 001 400
 France 1 800 000 F
మూస:CHI 1 390 000 F
 Argentina 1 300 000 F
 {{{1}}}World 64 255 520 A
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official, or estimates) ;

Source: FAO

మూలాలు[మార్చు]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Potter అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; app అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆపిల్&oldid=4004096" నుండి వెలికితీశారు