ఆర్కిమెడిస్ మర పంపు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆర్కిమెడిస్ మరచుట్టు చేతితో నడుపబడుతుంది మరియు సమర్ధంగా నీటిని పైకి తెస్తుంది
ఆర్కిమెడిస్ స్క్రూ
Archimedes' screw as a form of art by Tony Cragg at 's-Hertogenbosch in the Netherlands

మర పంపు దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా గాలి మరతో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా సాగునీటి కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.