ఆర్సేన్ వెంగెర్

వికీపీడియా నుండి

మూస:Pp-semi-blp మూస:Infobox Football biography 2

ఆర్సేన్ వెంగెర్ , OBE[1] (మూస:IPA-fr; 22 అక్టోబర్ 1949న స్ట్రాస్బర్గ్ లో జన్మించాడు) ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ఫుట్బాల్ నిర్వాహకుడు. ఈయిన 1996 నుంచి ఆర్సెనల్ అనే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ జట్టుకు నిర్వాహకుడుగా వ్యవహరిస్తున్నారు.[2] గెలిచిన పధకాల సంఖ్యను బట్టి, ఆర్సెనల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నిర్వాహకుడు ఈయనే. అంతే కాక, ఈ క్లబ్ లో అతి ఎక్కువ కాలం నిర్వాహకుడుగా బాధ్యత చేపట్టిన వ్యక్తి కూడా ఈయనే.[2][3] 1998 మరియు 2002 సంవత్సరాలలో గెలవడంతో, ఇంగ్లాండ్ లో డబుల్ ను సాధించిన మొదటి బ్రిటిష్-కాని నిర్వాహకుడిగా వెంగెర్ పేరొందాడు. 2004లో, FA ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఒక పూర్తీ సీజన్ లో ఒక ఓటమి కూడా లేకుండా చూసిన ఏకైక నిర్వాహకుడు అతనే. AS మొనాకో మరియు ఆర్సెనల్ లలో సాధించిన విజయాల అనంతరం, ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్వాహకులలో ఒకరిగా వెంగెర్ భావించబడుతున్నాడు. అతనికి ఉన్న అధ్బుతమైన నిర్వాహణా నైపుణ్యత మరియు ఫుట్బాల్ లో అతను సాధించిన అధ్బుత ఫలితాలను బట్టి, అతనిని ఒక "మిరాకిల్ వర్కర్" అని ఆర్సెనల్ యొక్క పూర్వ ఉపాధ్యక్షుడు డేవిడ్ డీన్ వర్ణించాడు.[4] వెంగెర్ కు స్ట్రాస్బోర్గ్ యూనివర్సిటి నుండి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ మరియు ఎకనామిక్స్[5] లో మాస్టర్ డిగ్రీ లు ఉన్నాయి. అతను ఫ్రెంచ్, జర్మన్ మరియు ఇంగ్లీష్ బాషలను సరళంగా మాట్లాడగలడు; అంతే కాక, ఇటాలియన్, స్పానిష్ మరియు జపనీస్ భాషలను కొంత మేరకు మాట్లాడగలడు.[6]

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ జీవితం మరియు ప్రయత్నాలు

ఆల్ఫోన్స్, భార్య లూయిస్ ల కొడుకైన ఆర్సేన్ చార్లెస్ ఎర్నెస్ట్ వెంగెర్, స్ట్రాస్బోర్గ్ లో పుట్టి, సమీపములోని డట్లేన్హీం గ్రామములో అక్క, అన్నయ్యల వద్ద పెరిగాడు. అతని తల్లితండ్రులకు స్ట్రాస్బోర్గ్ లో ఒక ఆటోమొబైల్ విడి-భాగాల వ్యాపారం ఉండేది. అంతే కాక, వారు డట్లేన్హీం లో La Croix d'Or అనే ఒక చిన్న బిస్ట్రో (హోటల్) కూడా నడిపేవారు. La Croix d'Or పైన తాను పెరిగిన రోజులను గురించి లీగ్ మేనేజర్ల అసోసియేషన్ లో చేసిన ఒక ప్రసంగములో అయన ఈ విధంగా చెప్పారు:

"There is no better psychological education than growing up in a pub... I learned about tactics and selection from the people talking about football in the pub – who plays on the left wing and who should be in the team."
Wenger on his childhood.[7]

అన్నీ బ్రోస్టర్హౌస్ అనే ఒక పూర్వ బాస్కెట్ బాల్ క్రీడాకారిణిని వెంగెర్ వివాహం చేసుకున్నాడు. వారి ఇద్దరికీ ఒక కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం లండన్ లోని టోట్టెరిడ్జ్ లో ఉంటుంది.[8][9] FIFA ప్రపంచ కప్ ను స్పాన్సర్ చేస్తున్న కేస్ట్రాల్ కు అతనే బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు. దానిలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ శిక్షణా శిబిరాలను అతను నిర్వహించాడు. అంతే కాక, FIFA యొక్క అధికారిక రేటింగ్ వ్యవస్థ అయిన కేస్ట్రాల్ పర్ఫార్మన్స్ ఇండెక్స్ కు సలహాదారుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ రేటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుటినుండి, దీనినే FIFA పోటీలకు ఆటగాళ్ళ రేటింగును గణించడానికి వాడడం జరుగుతుంది.[10][11][12] ఫుట్ బాల్ నిర్వాహణ అనే అంశం పై కేవలం జపనీస్ మార్కెట్మూస:Nihongo ను ఉద్దేశించి అతను ఒక పుస్తకం రచించాడు. దీనిని జపాన్ బ్రాడ్కాస్ట్ పబ్లిషింగ్ (NHK యొక్క అనుబంధ సంస్థ) సెప్టంబర్ 1997లో ప్రచురించింది. ఆ పుస్తకములో, తన నిర్వాహణా సిద్ధాంతాన్ని, ఆదర్శాలు మరియు విలువలను మరియు జపనీస్ ఫుట్ బాల్ మరియు మొత్తం ఆట గురించి వ్రాశాడు.[8][13]

[మార్చు] ప్రారంభ వృత్తి జీవితం

తన యవ్వనంలో ఫుట్ బాల్ ఆడుతూ, FC డట్లేన్హీం అనే తమ గ్రామ జట్టుకు పోటీలను నిర్వహిస్తూ వెంగెర్ కాలం గడిపేవాడు. అప్పుడే తన 16వ వయస్సులో, తన మొదటి జట్టును ఏర్పరిచాడు. తరువాత, సమీపములోని మూడో డివిజన్ క్లబ్ అయిన AS ముట్జిగ్ యొక్క నిర్వాహుకుడు మాక్స్ హిల్ద్ అతన్ని పనిలో పెట్టుకున్నాడు. తరువాత కాలములో వెంగెర్ కు మాక్స్ హిల్ద్ ఒక గురువు లాగ వ్యవహరించి, అతని వృత్తిలో అవసరమైన సలహాలు ఇస్తూ ఉన్నాడు. మాక్స్ హిల్ద్ యొక్క జట్టు అల్సేస్ లో "అత్యుత్తమ అమెచూర్ ఫుట్ బాల్ జట్టుగా" పేరొందింది.[8] ఫుట్ బాల్ క్రీడాకారుడుగా వెంగెర్ కు గొప్ప పేరు లేదు. రాబర్ట్ షూమాన్ యునివర్సిటీ యొక్క Institut Européen d'Etudes Commerciales Supérieures de Strasbourg లో చదువుతున్నప్పుడు పలు అమెచూర్ క్లబ్బులకు డిఫెండర్ స్థానంలో ఆడేవాడు. అక్కడ 1971లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. 1978లో వెంగెర్ ప్రొఫెషనల్ గా మారి RC స్ట్రాస్బోర్గ్, మొనాకో కు మధ్య జరిగిన పోటీలో రంగప్రవేశం చేశాడు.[14]. ఆ జట్టుకు కేవకం పన్నెండు ఆటలలో మాత్రమే ఆడాడు. వాటిలో 1978-79లో గెలిచిన లిగ్యు 1 టైటిల్ కూడా ఉంది. అదే సీజన్ లో UEFA కప్ లో ఒక సారి ఆడాడు. 1981లో, అతను నిర్వాహణ డిప్లమాను సంపాదించాడు. తరువాత క్లబ్ యువకుల జట్టుకు కోచ్ గా నియమితుడయ్యాడు.[15] స్ట్రాస్బోర్గ్ లో పని చేసిన తరువాత, వెంగెర్ AS కానస్ జట్టుకు సహాయ నిర్వాహకుడుగా 1983లో నియమితుడయ్యాడు.[16][17]

[మార్చు] నిర్వాహకుడు వృత్తి

1 మే 2007 నాడు 2006–07 సీజన్ యొక్క ఫైనల్ ఆట తరువాత ప్రేక్షకులకు ధన్యవాదాలు చెపుతున్న వెంగెర్.

వెంగెర్ కు మొదటి సీనియర్ ఉద్యోగం 1984లో నాన్సీ లో దొరికింది. అయితే, అక్కడ అతనికి విజయం లభీంచలేదు: తన ఆద్వర్యంలో ఆఖరిదైన మూడవ సీజన్లో నాన్సీ 19వ స్థానంలో నిలిచి, ఫ్రెంచ్ ఫుట్ బాల్ లో రెండవ స్థాయి కి దిగజారింది. (ప్రస్తుతం లిగ్యూ 2). 1987లో AS మొనాకో కు నిర్వాహకుడుగా నియమితుడయినప్పుడు అతని విజయవంతమైన వృత్తి జీవితం మొదలయింది. 1988లో అతను లీగ్ ను గెలిచాడు (తన ఆద్వర్యంలో మొదటి సీజన్). 1991లో ఫ్రెంచ్ కప్ ను గెలిచాడు. గ్లెన్ హాడిల్, జార్జ్ వియా, జుర్గెన్ క్లిన్స్మన్ వంటి గొప్ప ఆటగాళ్లను తన జట్టులోకి తీసుకున్నాడు. అంతే కాక, స్ట్రాస్బోర్గ్ కు చెందిన 23 సంవత్సరాల వయస్సు గల యూరి డిజోర్కఫ్ఫ్ ను తన జట్టులో చేర్చుకున్నాడు; భవిష్యత్తులో ప్రపంచ కప్ గెలిచిన అతను ఫ్రాన్స్ లో వెంగెర్ యొక్క ఆఖరి సీజన్ లో లియూ 1 లో (20 గోల్ లతో) అత్యధికంగా గోల్ వేసిన వ్యక్తిగా ఉమ్మడి పురస్కారం గెలుచుకున్నాడు. బయేర్న్ మ్యూనిక్ లో నిర్వాహకుడు స్థానానికి వెంగెర్ కూడా పరిగణములోకి తీసుకోబడ్డాడు. కాని వారిని వెంగేర్ తో మాట్లాడడానికి మొనాకో పాలక మండలి అనుమతించకపోవడంతో, అతను ఆ స్థానములో చేరలేకపోయాడు. ఆ స్థానం భర్తీ అయి పలు వారాల తరువాతనే మండలి వెంగెర్ కు అనుమతి ఇచ్చింది.[18]

తరువాత, 18 నెలల పాటు విజయవంతంగా జపాన్ కు చెందిన జే. లీగ్ జట్టైన నగోయ గ్రాంపస్ ఎయ్ట్ లో పని చేశాడు. అప్పుడు ఆ జట్టు దేశీయ పోటి అయిన ఎంపరర్స్ కప్ ను గెలిచింది. లీగ్ లో ఆఖరి మూడు జట్టులలో ఒకటిగా ఉన్న ఆ క్లబ్బును రన్నర్-అప్ స్థానానికి తీసుకువెళ్ళాడు.[19] ఆ క్లబ్ తో అతను సాధించిన విజయానికి గుర్తింపుగా అతనికి 1995లో జే. లీగ్ మేనేజర్ అఫ్ ది ఇయర్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఆ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి విదేశీ నిర్వాహుకుడు ఇతనే.[20] గ్రాంపస్ లో ఉన్నప్పుడు, పూర్వ వలెన్సియన్నస్ నిర్వాహకుడు అయిన బోరో ప్రిమోరక్ ను తన సహాయకుడుగా తీసుకున్నాడు. వెంగెర్ అతన్ని 1993 Olympique de Marseille మ్యాచ్-ఫిక్సింగ్ ఆరోపణ సమయములో కలిశాడు. మర్సీల్ ప్రవర్తన సరిగ్గా లేదని గట్టిగా నమ్ముతూ వచ్చిన వెంగెర్, బోస్నియా కోచ్ తాను ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ప్రయతిన్చినప్పుడు (చివరిలో ఆ ప్రయత్నములో విజయం సాధించాడు) అతనికి పూర్తిగా మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత అనేక సంవత్సరాల పాటు ప్రిమోరక్ వెంగెర్ కు ఒక "కుడి భుజం" లాగా ఉన్నాడు. ఇప్పటికి ఆ స్థానాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు.[21]

ఈ మధ్య, 1988లో ఆర్సెనల్ ఉపాధ్యక్షుడు అయిన డేవిడ్ డీన్ ను ఆర్సెనల్, క్వీన్స్ పార్క్ రెంజర్స్ మధ్య జరిగిన ఒక పోటీ లో వెంగెర్ కలిసాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు.[22] ఆగష్టు 1996లో బ్రూస్ రియోచ్ ను తొలగించిన తరువాత, ఫ్రెంచ్ ఫుట్ బాల్ ఫెడెరేషన్ కు అప్పటి సాంకేతిక డైరెక్టర్ అయిన గేరార్డ్ హౌలియర్, వెంగెర్ పేరును డేవిడ్ డీన్ కు 1996 వేసవిలో సిఫార్సు చేశాడు.[23] 28 సెప్టెంబర్ 1996న ఆర్సెనల్ వెంగెర్ నియామకాన్ని ధృవీకరించింది. వెంగెర్ అధికారికంగా 1 అక్టోబర్ నాడు పదవి బాధ్యతలు స్వీకరించాడు. UK కు వెలుపరి నుండి ఆర్సెనల్ కు నిర్వాహకుడుగా నియమించబడ్డ తొలి వ్యక్తి, వెంగెర్. ఫుట్ బాల్ అసోసియేషన్ కు సాంకేతిక డైరెక్టర్ గా నియమించబడే అవకాశం ఉందని ముందు అనుకున్న, అతని గురించి ఇంగ్లాండ్ లో అంతగా తెలియదు. ది ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక అతని నియామకం గురించి 'ఆర్సెనల్ ఎవరు?' అని వ్యంగంగా వ్రాసింది.[24]

అధికారికంగా జట్టు నిర్వాహణ చేపట్టడానికి ఒక నెల ముందు ఫ్రాన్స్ కు చెందిన పాట్రిక్ వియరా మరియు రేమి గార్డె అనే ఇద్దరు మిడ్ ఫీల్డర్ లను తీసుకోవలసిందిగా వెంగెర్ క్లబ్ ను కోరాడు. 12 అక్టోబర్ 1996 నాడు బ్లాక్బర్న్ రోవర్స్ తో జరిగిన అతని తొలి పోటీలో ఆర్సెనల్ 2-0 స్కోరు తో విజయం సాధించింది. వెంగెర్ యొక్క మొదటి సీజన్ లో ఆర్సెనల్ మూడవ స్థానంలో నిలిచింది. రెండవ స్థానాన్ని (రెండవ స్థానాన్ని న్యూకేసిల్ యునైటెడ్ దగ్గించుకుంది) గోల్ వ్యత్యాసంతో త్రుటిలో పొగొట్టుకొని చాంపియన్స్ లీగ్ అర్హతను కూడా కోల్పోయింది.

ఆర్సెనల్ లో శిక్షణ ఇస్తున్న ఆర్సెనల్.

అతని రెండవ సీజన్ లో (1997–98) ప్రీమియర్ లీగ్ మరియు FA కప్ రెండిటిని ఆర్సెనల్ గెలిచుకొని, క్లబ్ చరిత్రలోనే రెండవ డబుల్ ను సొంతం చేసుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ పై పన్నెండు-పాయింట్ల ఆధిక్యం సాధించి, ఇంకా రెండు పోటీలు మిగిలి ఉండగానే ఆర్సెనల్ లీగ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషిచినవారు, డిఫెన్స్ ఆటగాళ్ళు టోనీ ఆడమ్స్, స్టీవ్ బౌల్డ్, నిగెల్ వింటర్బర్న్, లీ డిక్సన్ మరియు మార్టిన్ క్యాన్. వీరితో పాటు స్ట్రైకర్ డెన్నిస్ బెర్గ్కాంప్ మరియు వెంగెర్ క్రొత్తగా తీసుకున్న ఎమనువేల్ పెటిట్ (పాట్రిక్ వియర కు భాగస్వామిగా), వింగర్ మార్క్ ఓవర్మార్స్ మరియు యవ్వనంలో ఉన్న స్ట్రైకర్ నికోలస్ అనేల్క కూడా కీలక పాత్ర పోషించారు.

తరువాయి కొన్ని సీజన్లు పెద్ద విజయాలు ఏమి లేవు. అనేక పోటీలలో త్రుటిలో విజయం చేయి జారింది. 1998–99లో సీజన్ ఆఖరి రోజున ఒకే ఒక పాయింట్ తేడాలో ప్రీమియర్ లీగ్ టైటిల్ ను మాంచెస్టర్ యునైటెడ్ దగ్గర వారు ఓడిపోయారు. FA కప్ సెమి ఫైనల్ పోటీ లోనూ అదనపు సమయంలో ఆర్సెనల్ ను యునైటెడ్ ఓడించింది. 1999–2000లో UEFA కప్ ఫైనల్ లో పెనల్టీల ఆధారంగా గలటసరే దగ్గర ఆర్సెనల్ ఓడిపోయింది. అదే మాదిరిగా 2001 FA కప్ ఫైనల్ లోనూ లివేర్పూల్ దగ్గర 2–1 స్కోరు తేడాతో ఓడింది. క్రొత్త క్రీడాకారులను జట్టులోకి తీసుకురావాలని వెంగెర్ నిర్ణయించి, ఒప్పందములో లేని టోట్టేన్హాం డిఫెండర్ మరియు పూర్వ కేప్టన్ అయిన సోల్ కాంప్బెల్ ను వివాదాస్పత రీతిలో తీసుకున్నాడు. అలాగే, ఫ్రెడరిక్ ఎల్జుంగ్బెర్గ్, థియరీ హెన్రీ మరియు రాబర్ట్ పిరేస్ లను కూడా తీసుకున్నాడు.

ఈ క్రొత్త క్రీడాకారులతో వెంగెర్ యొక్క ఆర్సెనల్ జట్టు మరో మారు 2001–02 లో డబుల్ ను సాధించింది. మాంచెస్టర్ యునైటెడ్ తో జరిగిన సీజన్ లో ఆఖరి ఆటకు ముందు ఆట ఆర్సెనల్ కు గొప్ప ఆటగా నిలిచింది. మాంచెస్టర్ యునైటెడ్ పై అధ్బుతంగా ఆడి ఆ ఆటను 1–0 స్కోరు తేడాతో ఆర్సెనల్ గెలిచింది. సీజన్ మొత్తం ఒక ఆటలో కూడా ఊడిపోకుండా, ఆ సీజన్ లో ప్రతి ప్రీమియర్ లీగ్ ఆటలో గోల్ వేసి, చెల్సీ ని 2-0 స్కోరు తేడాత ఓడించి FA కప్ ఫైనల్ ను గెలవడంతో డబుల్ ను సాధించింది. ఆ ఆటలో రే పార్లర్ మరియు ఫ్రెడరిక్ ఎల్జుంగ్బెర్గ్ గోల్ చేశారు.

2002–03 సీజన్ లో పటిష్టంగా తమ ప్రదర్శనను ప్రారంభించిన ఆర్సెనల్ జట్టు, తమ చరిత్రలోనే తొలి సారిగా ప్రీమియర్ లీగ్ టైటిల్ ను అట్టిపెట్టుకొనే లాగ కనిపించింది. ఒక సందర్భములో మాంచెస్టర్ యునైటెడ్ పై ఎనిమిది పాయింట్ ల ఆధిక్యతలో ఆర్సెనల్ ఉంది. కాని సీజన్ ముగిసే సమయములో ఆర్సెనల్ ఆటతీరు కుప్పకూలింది. ఆఖరికి కప్ ను మాంచెస్టర్ యునైటెడ్ గెలిచుకుంది. సీజన్ లో తరువాత మాంచెస్టర్ యునైటెడ్ జట్టు గన్నేర్స్ జట్టును ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది. బోల్టన్ వాన్డేరేర్స్ పై ఆర్సెనల్ తనకు ఉన్న రెండు గోల్ ల ఆధిక్యతను సద్వినియోగం చేసుకోకుండా 2-2 స్కోరు తో సమం చేసింది. తరువాత లీడ్స్ యునైటెడ్ దగ్గర సొంత గడ్డ మీద ఓడింది.

2003లో FA కప్ ను ఆర్సెనల్ గెలుచుకుంది. మరుసటి సీజన్లో ఒక ఓటమి కూడా లేకుండా, 2003-2004 ప్రీమియర్ లీగ్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. 1888–89 లో ప్రేస్టన్ నార్త్ ఎండ్ తరువాత ఈ అరుదైన ప్రదర్శన చూపించిన మొదటి ఆర్సెనల్ జట్టు ఇదే. యూరోపియన్ ఫుట్బాల్ లో ఇంత వరకు ఈ సాధన చేసిన జట్టులు ఇవే: AC మిలన్, పెరుగియా, జేనోవ C.F.C., అథ్లెటిక్ బిల్బావు, రియల్ మాడ్రిడ్ మరియు అజాక్స్.[25] ఒక పూర్తి సీజన్ లో ఒక ఓటమి కూడా లేకుండా ఆర్సెనల్ విజయం సాధించగలదు అని ఒక ఏడాది ముందు వెంగెర్ చెప్పినప్పుడు అతన్ని పరిహసించారు.[26]

వెంగెర్ ఆద్వర్యంలో వరుసగా 49 లీగ్ ఆటలు ఓడకుండా వచ్చిన ఆర్సెనల్ యొక్క విజయ పరంపరకు అక్టోబర్ 2004లో మాంచెస్టర్ యునైటెడ్ దగ్గర 2-0 స్కోరు తో ఓడి పోవడంతో తెర పడింది. లీగ్ పోటీలలో ఆర్సెనల్ గట్టి ప్రదర్శన చూపించినా, టైటిల్ పోటీలో చెల్సీ దగ్గర ఓడి పోయింది. 2005లో FA కప్ గెలవడంతో మరల ఓదార్పు లబించింది. ఆ ఫైనల్ పోటీలో, మాంచెస్టర్ యునైటెడ్ పై విజయం సాధించింది. ఏ జట్టు గోల్ చేయకుండానే, పెనాల్టీ ల ఆధారంగా ఆర్సెనల్ గెలిచింది.

May 2009లో "మేము ఆర్సేన్ ను నమ్ముతున్నాము" అని వ్రాసి ఉన్న కార్డులను పట్టుకొని ఉన్న ఆర్సెనల్ అభిమానులు

2005–06 మరియు 2006–07 సీజన్లలో ఆర్సెనల్ ప్రదర్శన సుమారుగానే ఉంది. ఆ రెండు సార్లు ప్రీమియర్ లీగ్ లో నాల్గవ స్థానములో నిలిచింది. 2007–08 సీజన్ లో ప్రీమియర్ లీగ్ ను ఆర్సెనల్ ఒక ఊపు ఊపేలా కనిపించింది. సీజన్లో ఎక్కువ సమయం ఆధిక్యతలోనే ఉంది. కాని చెల్సీ మరియు విజయితగా నిలిచిన మాంచెస్టర్ యునైటెడ్ తో జరిగిన పోటీలలో ఓడి పోయింది. ఫార్వార్డ్ ఎడ్వర్డో కు జరిగిన కీలు ఫ్రాక్చర్ దర్ఘటన నుండి యువ ఆర్సెనల్ జట్టు కొన్ని వారాల పాటు కోలుకోలేదు.

మొత్తం మీద, వెంగెర్ ఆద్వర్యంలో ఆర్సెనల్ మూడు ప్రీమియర్ లీగ్ టైటిల్ లను, నాలుగు FA కప్ లను గెలిచింది. పధకాల సంఖ్యను బట్టి, ఆర్సెనల్ కు అత్యదిక విజయాలు సాధించిపెట్టిన నిర్వాహకుడు గా వెంగెర్ నిలిచాడు. అయితే, ఇప్పటి వరకు UEFA చాంపియన్స్ లీగ్ ను అతను గెలవలేకపోయాడు. 2005–06 లో ఫైనల్ కు చేరడంతో విజయానికి అతి సమీపంలో ఆర్సెనల్ వచ్చింది. క్లబ్ చరిత్రలోనే ఇది తొలి సారి. అయితే, ఫైనల్ లో 2-1 స్కోరు తేడా తో బార్సిలోన దగ్గర ఆర్సెనల్ ఓడింది.

అక్టోబర్ 2004లో 2007–08 సీజన్ పూర్తి అయ్యే వరకు ఆర్సెనల్ తోనే ఉండే విధంగా ఆతను తన ఒప్పందాన్ని పొడిగించుకున్నారు.[27] వెంగెర్ కు ఆర్సెనల్ లో "జీవిత కాలానికి ఉద్యోగం" ఉన్నట్లు అప్పటి ఆర్సెనల్ ఉపాధ్యక్షుడు డేవిడ్ డీన్ చెప్పారు. నిర్వాహకుడు గా పదవి విరమణ చేసిన అనంతరం, వెంగెర్ కు ఆర్సెనల్ పాలక మండలిలో ఒక పాత్ర ఇవ్వాలని అనుకున్నాడు.[28] అయితే, 18 ఏప్రిల్ 2007న డేవిడ్ డీన్ పాలక మండలిని వదిలి వెళ్ళినప్పుడు, ఆర్సెనల్ లో వెంగెర్ భవిష్యత్తు గురించిన ప్రశ్న తెర పైకి వచ్చింది. వెంగెర్ ఆర్సెనల్ ను వదిలి రియల్ మాడ్రిడ్ లో నిర్వాహకుడు గా చేరబోతున్నారనే పుకార్లు వచ్చాయి. అయితే, 6 సెప్టెంబర్ 2007న వెంగెర్ ఒక క్రొత్త మూడు-సంవత్సరాల ఒప్పందములో సంతకం పెట్టడానికి వెంగెర్ అంగీకరించాడు.[29]

[మార్చు] వైఖరి మరియు సిద్ధాంతం

2008లో వెంగెర్.

"వినోదం పంచడం మరియు దాడి చేయడం అనే రెండు అంశాలను కలిగి ఉన్న జట్టులను రూపొందించడంలోనే తన వృత్తిని పూర్తిగా అంకితం చేసుకున్న వ్యక్తి " అని వెంగెర్ గురించి ఒక కోచ్ చెప్పాడు.[30] అంతే కాక, అతను ఒక "ప్యూరిస్ట్ అని, వ్యక్తిగతంగాను ఉమ్మడిగాను సాంకేతిక నాణ్యతకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి" అని కూడా వర్ణించాడు.[31] 2003-04 నుంచి దాడి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వైఖరిని వెంగెర్ పాటిస్తున్నాడని ది టైమ్స్ వ్రాసింది.[32] అతని ఆట శైలి ప్రత్యర్ధుల క్రియాశీల వైఖరికి భిన్నంగా ఉంటుంది.[33] అయితే, అతని వైఖరిలో "కిల్లర్ టచ్" లేదని కూడా విమర్శల వచ్చాయి.[34] పలు సంవత్సరాలుగా వెంగెర్ 4–4–2 ఫార్మేషన్ ను వాడాడు. అయితే 2005 నుంచి 4–5–1 మీదే ఎక్కువ ఆధారపడి ఒకే ఒక స్ట్రైకర్ మరియు మధ్య మైదానంలో ఎక్కువ ఆటగాళ్లను నింపే వైఖరిని పాటిస్తూ వచ్చాడు. [35]ఎమిరేట్స్ స్టేడియంలో[36] వెడల్పైన పిచ్ కు మారడంతో ఈ పద్ధతిని అనుకరించాడు. చాంపియన్స్ లీగ్ ఆటలలో కూడా ఇదే వైఖరినే పాటించాడు.[37] 2009–10 సీజన్ మొదలుకొని వెంగెర్ ఆర్సెనల్ లో 4–3–3 ఫార్మేషన్ ను అనుసరించాడు. ముందు ఉన్న ఐదు అటాకర్లు ఆట జరిగే సమయములో స్వేచ్చగా వారి స్థానాన్ని మార్చుకోవచ్చు.[38]

ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించడములో అతనికి ప్రత్యేక సామర్ధ్యం ఉంది. మొనాకోలో లైబేరియా కు చెందిన జార్జ్ వియా, (తరువాత A.C. మిలన్ తో ఉన్నప్పుడు FIFA వరల్డ్ ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎన్నుకోబడ్డాడు), కామరూన్ జట్టునుండి టోన్నేరే యౌండే మరియు నైజీరియా కు చెందిన విక్టర్ ఇక్పెబ వంటి ఆటగాళ్ళను తీసుకువచ్చాడు. విక్టర్ ఇక్పెబ తరువాత R.F.C. de Liège నుండి ఆఫ్రికన్ ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎన్నుకోబడ్డాడు. పాట్రిక్ వియర, ఫ్రాన్సుస్క్ ఫబ్రేగాస్, రాబిన్ వాన్ పెర్సీ, కోలో టౌరే వంటి ఎక్కువ ప్రాబల్యం చెందని యువ ఆటగాళ్లను వెంగెర్ ఆర్సెనల్ లోకి తీసుకొని వాళ్ళను ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా మలిచాడు. ముఖ్యంగా, 2005-2006లో UEFA చాంపియన్స్ లీగ్ సమయములో బార్సిలోన తో ఫైనల్ పోటీ కు వెళ్ళే ముందు వరుసగా 10 ఆటలలో ఒక గోల్ గూడా ఇవ్వకుండా క్రొత్త రికార్డ్ సృష్టించిన డిఫెన్స్ ను ఖరీదు చేయడానికి మొత్తం £5m కంటే తక్కువే అయింది.

ఎక్కువ ఖరీదు గల ఆటగాళ్ళు కొందరిని కూడా వెంగెర్ ఆర్సెనల్ జట్టులోకి తీసుకున్నా, అతని నికర ఖర్చు ఇతర ప్రముఖ ప్రీమియర్ లీగ్ క్లబ్బులకంటే చాలా తక్కువ. 2007లో జరిపిన ఒక సర్వ్ ప్రకారం, బదిలీల లో లాభం గణించిన ఏకైక ప్రీమియర్ లీగ్ నిర్వాహకుడు వెంగెర్ మాత్రమే. 2004-2009 మధ్యలో బదిలీల ద్వారా సగటుగా సీజన్ కు £4.4 మిలియను లాభం గణించి, ఇతర ఏ క్లబ్ కంటేకూడా చాలా మెరుగుగా ఆర్సెనల్ నిలిచింది.[39] ఒక గొప్ప ఉదాహరణ: పరిస్ St జెర్మైన్ నుండి నికోలస్ అనేల్క ను కేవలం £500,000 కు కొని, రెండేళ్ళు తరువాత అతనిని రియల్ మాడ్రిడ్ కు £22.3m కు విక్రయించాడు. దీని వలన థియరీ హెన్రీ, రాబర్ట్ పిరేస్ మరియు సిల్విన్ విల్టోర్డ్ అనే ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేయగలిగాడు. ఈ ముగ్గురూ 2001-2002 డబుల్ లోను 2003-2004 లీగ్ టైటిల్ విజయంలోనూ ముఖ్య పాత్ర వహించారు.

ఇంగ్లీష్ ఫుట్ బాల్ లో ఎక్కువ నియంత్రణను వ్యతిరేకించి ఈ విధంగా చెప్పాడు: "ఎక్కువ కేంద్రీకరించబడిన కంప్యూటరీకరణ చేయబడిన సమాజానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువగా విశాల బావముగల వ్యక్తి. అయితే లోకజ్ఞానం మరియు మంచి నిర్వాహణకే నేను ఎక్కువ మొగ్గు చూపుతాను.″[40]

ఎక్కువగా ప్రాబల్యం చెందని యువ ఆటగాళ్లను క్లబ్ కు తీసుకురావడమే కాకుండా, కొందరు అనుబవజ్ఞలైన ఆటగాళ్ళ వృత్తిని ఆర్సెనల్ లో పుంజుకునేలా చేశాడు. వెంగెర్ ఆర్సెనల్ లో చేరడానికి ఒక ఏడాది ముందు జట్టులో వచ్చిన డెన్నిస్ బెర్గ్ కాంప్, వెంగెర్ ఆధ్వర్యంలో ఉచ్చ స్థాయికి ఎదిగాడు. మొనాకోలో తన పూర్వ శిష్యుడు అయిన థియరీ హెన్రీ ఒక ప్రపంచ స్థాయి ఆటాగాడు స్థితికి ఎదిగి, వెంగెర్ నేతృత్వంలో ఆర్సెనల్ చరిత్రలోనే అత్యధిక గోల్ స్కోర్ చేసిన ఆటగాడుగా తయారయి జట్టు సారధిగా ఎదిగాడు.

శిక్షణా మరియు ఆహార పద్ధతులలో సంస్కరణలు తెచ్చి క్లబ్ లో నెలకొన్న త్రాగుడు మరియు జంక్-ఫుడ్ సంస్కృతిని మానిపించాడు. జట్టు సారధి టోనీ ఆడమ్స్ 1996లో త్రాగుడును ఒప్పుకున్నప్పుడు వెంగెర్ అతనికి మద్దతుగా నిలిచాడు. ఆడమ్స్ పునరావాస సమయములో వెంగెర్ అతనిని సహాయంగా నిలిచాడు. అందువలన అతను తన ఆట జీవితాన్ని పలు సంవత్సరాలు పొడిగించగలిగాడు. శిక్షణా మరియు ఆహార పద్ధతులలో వెంగెర్ తీసుకువచ్చిన సంస్కరణల వలన ఆర్సెనల్ యొక్క నలుగురు బ్యాక్ ఆటగాళ్ళలో మిగిలిన ముగ్గురు సభ్యులైన డిఫెండర్ లు నిగెల్ వింటర్ బర్న్, లీ డిక్సన్ మరియు మార్టిన్ క్యోన్ యొక్క క్రీడా జీవితం పొడిగించబడింది. మొదట్లో వారిని మార్చాలని వెంగెర్ అనుకున్నా, తరువాత దానికి అవసరం లేదని నిర్ణయించాడు.

2006లో ప్రారంభించబడిన ఎమిరేట్స్ స్టేడియం రూపకల్పనలో వెంగెర్ ప్రత్యక్ష పాత్ర పోషించాడు. లండన్ కోల్నీ లో ఉన్న క్రొత్త శిక్షణా మైదానానికి మారడంలోను వెంగెర్ పాత్ర ఉంది.

[మార్చు] ప్రశంసలు మరియు పురస్కారాలు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

ఆర్సెనల్ అభిమానుల నుంచి వెంగెర్ కు మంచి ఆదరణ లభించింది. వారు వెంగెర్ మీద అతని దీర్ఘ కాల దూరదృష్టి మీద మంచి విశ్వాసం ప్రదర్శించారు. ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఆటల సమయములో అభిమానులు తరచూ "ఆర్సేన్ కు తెలుసు" మరియు "ఆర్సేన్ నే మేము నమ్ముతాము" అని బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉంటారు. 2005–06 లో హైబరిలో జరిగిన ఆర్సెనల్ యొక్క వీడ్కోలు కాంపైన్ లో అభిమానులు వివిధ "తీం మాచ్ దినాలను" అనుసరించేవారు. దానిలో బాగంగా "వెంగెర్ దినం" ను అనుసరించి తమ అభిమానాన్ని చూపారు. 22 అక్టోబర్ 2005న వెంగెర్ తన 56వ పుట్టిన రోజు నాడు మాంచెస్టర్ సిటీ తొ జరిగిన ఆట రోజున వెంగెర్ దినము అనుసరించబడింది.[41]

ఆర్సెనల్ FC యొక్క పూర్వ ఉపాధ్యక్షుడైన డేవిడ్ డీన్ కలాన్ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్వాహకుడు అని వెంగెర్ ను కొనియాడాడు: "అర్సేన్ ఒక అధ్బుత వ్యక్తి. అతను క్లబ్ లో విప్లవం తెచ్చాడు. అతను ఆటగాళ్లను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల లాగ మలిచాడు. అతను ఉన్నప్పటినుండి, మేము వేరొక గ్రహము నుంచి ఆడే ఫుట్ బాల్ ను చూశాము."[42] 18 అక్టోబర్ 2007న క్లబ్ యొక్క వార్షిక సాధారణ సమావేశ సమయములో ఆర్సెనల్ FC పాలక మండలి ఆర్సేన్ వెంగెర్ యొక్క కంచు ప్రతిమను స్థాపించింది. ఇది గతములో స్థాపించిన హెర్బర్ట్ చాప్మన్ ప్రతిమ వంటిది.[43]

2002లో ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ బిరుదైన Légion d'Honneur వెంగెర్ కు ఇవ్వబడింది. 2003లో బ్రిటిష్ ఫుట్ బాల్ కు వెంగెర్ చేసిన సేవకు గుర్తింపుగా, రాణి పుట్టిన రోజు పురస్కార జాబితా లో అతను చేర్చబడి, అతనికి గౌరవార్థ OBE బహుకరించబడింది. వెంగెర్ తొ పాటు తోటి ఫ్రాన్స్ దేశస్థుడైన లివర్పూల్ నిర్వాహకుడు గేరార్డ్ హౌలియర్ కు కూడా ఈ పురస్కారం లభించింది. ఇంగ్లీష్ ఫుట్ బాల్ క్రీడకు గుర్తింపు తెచ్చినందుకు 2006లో వెంగెర్ ఇంగ్లీష్ ఫుట్ బాల్ హాల్ అఫ్ ఫేం లో చోటు సంపాదించాడు. క్రేవే అలేక్సాన్డ్రియా కు చెందిన ఇటలీలో జన్మించిన డరియో గ్రాడి తరువాత ఇతనే హాల్ అఫ్ ఫేం లో చోటు సంపాదించిన రెండవ విదేశీ నిర్వాహకుడు.

2007లో ఆర్సేన్ వెంగెర్ పేరు 33179 ఆర్సేన్వెంగెర్ అనే ఒక ఆస్టేరాయిడ్ కు పెట్టబడింది. ఈ పేరును ఆస్ట్రానమర్ అయాన్ పి. గ్రిఫిన్ పెట్టాడు. అతను తన అభిమాన ఫుట్ బాల్ క్లబ్ ఆర్సెనల్ అని చెప్పాడు.[44]

[మార్చు] వివాదాలు

వెంగెర్ పలు వివాదాలలో చిక్కుకున్నారు

వెంగెర్ జట్టులకు క్రమశిక్షణ లేదని పలు మార్లు విమర్శకు గురయ్యాయి.[ఎవరు?] 1996-2008 మధ్యలో 73 ఎర్ర కార్డులు అందుకున్నాయి.[45] అయితే, 2004 మరియు 2005 లోనూ, వెంగెర్ ఆధ్వర్యంలోని ఆర్సెనల్ జట్టు క్రీడాపూరిత ప్రవర్తనకు గాను ప్రీమియర్ లీగ్ యొక్క ఫేర్ ప్లే లీగ్ ను గెలుచుకుంది.[46][47] 2006 లోను ఈ సాధనకు సమీపంలో వచ్చి, రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.[48] అత్యుత్తమ క్రీడాపూరిత క్లబ్బులలో ఒకటిగా వారి రికార్డ్ 2009 వరకు కొనసాగుతునే ఉంది. ఈ క్లబ్ ఫేర్ ప్లే టేబుల్ లో ఎప్పుడూ మొదటి నాలుగు స్థానాలలోనే ఉండేది.[49][50][51] 2010 సీజన్ లో కూడా వెంగెర్ జట్టు ఫేర్ ప్లే టేబిల్ లో అగ్ర స్థానములో ఉంది.[52]

1999లో FA కప్ 5వ రౌండ్ ఆట ముగియగానే షెఫీల్డ్ యునైటెడ్ కు మరల ఆటని ఆడే అవకాశం ఇచ్చాడు. ఆ ఆటను ఆర్సెనల్ వివాదాస్పత పరిస్థితిలో గెలుచుకున్నదే దీనికి కారణము. షెఫీల్డ్ యునైటెడ్ ఆటగాడు ఒకరికి ఏర్పడిన గాయానికి చికిత్స పొందడానికి వీలుగా బంతి టచ్ లోకి నెట్టబడింది. అయితే ఆ తరువాత కాను బంతిని ప్రత్యర్దికి తిరిగి ఇవ్వలేదు. తరువాత మార్క్ ఓవర్మార్స్ గోల్ వేసి, ఆర్సెనల్ గెలిచింది. ఆటలో ఈ వివాదం చోటు చేసుకుంది. మరల జరిగిన ఆటలో 2–1 గోల్ తేడా తో ఆర్సెనల్ గెలిచింది.

మాంచెస్టర్ యునైటెడ్ నిర్వాహకుడు అయిన సర్ అలెక్స్ ఫెర్గ్యూసన్ తో అతనికి ఉన్న పోటీ చాలా ప్రసిద్ధి. అక్టోబర్ 2004లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన "పిజ్జాగేట్"[53][54] సంఘటనతో ఈ పోటీ ఉచ్చ స్థాయికి చేరింది. ఈ ఆటలో వివాదాష్పధమైన 2-0 గోల్ తేడా తో ఆర్సెనల్ ఓడి పోవడంతో, వరుసగా 49 ఆటలు ఓటమి లేకుండా ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఆర్సెనల్ విజయ పరంపరకు తెర పడింది. అట తరువాత, ఆర్సెనల్ జట్టు సభ్యుడు ఒకడు ప్రత్యర్ధి మీద టనల్ లో ఆహారాన్ని విసిరాడని ఆరోపణ వచ్చింది.[55] ఆట అనంతరం జరిగిన టెలివిజన్ బేటీ లో యునైటెడ్ స్ట్రైకర్ అయిన రుడ్ వాన్ నిస్టేల్రూయ్ ను "ఒక మోసగాడు" అని చెప్పినదానికి గాను వెంగెర్ కు £15,000 జరిమానా విధించబడింది. అతను ఒక మోసగాడు అని వెంగెర్ గట్టిగా నమ్మడం వలన వాన్ నిస్టేల్రూయ్ ను వెంగెర్ మరల అలాగే చెప్పడంతో, వెంగెర్ కు మరల జరిమానా విధించబడింది.[56] తమ పోటీ యొక్క తీవ్రత ను తగ్గించుకోవడం కోసం, ఇద్దరు నిర్వాహకులు తమ మాటలలో పదును తగ్గించుకుంటామని చెప్పారు.[57]

అక్టోబర్ మరియు నవంబర్ 2005లో అప్పటి చెల్సీ నిర్వాహకుడు అయిన జోస్ మౌరింహో తో వెంగెర్ మాటల యుద్ధానికి దిగాడు. చెల్సీ తో వెంగెర్ కు "అన్ప్రొఫెషనల్ యావ" ఉందని మౌరింహో ఆరోపించి, అతన్ని ఒక "ఎలుక" అని మరియు "వోయర్" అని అబివర్ణించాడు.[58] "అతనికి ఎప్పుడు మా గురించే ఆలోచన, అతను ఎప్పుడు మా గురించే మాట్లాడుతూ ఉంటాడు- ఎప్పుడు చెల్సీ, చెల్సీ, చెల్సీ, చెల్సీ" అని మౌరింహో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాను చెల్సీ గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నాను అంతే అని చెప్పి మౌరింహో వైఖరి "అమర్యాదకరం" అని వెంగెర్ ప్రతిస్పందించాడు. ఆ తరువాత మౌరింహో, తాను చేసిన "వోయర్" విమర్శకు క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వెంగెర్ మౌరింహో క్షమాపణను స్వీకరించాడు.[59]

వెంగెర్ ఎక్కువ మంది ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆడించడం లేదని, ముఖ్యంగా చాంపియన్స్ లీగ్ లో అని వెంగెర్ మీద ఇతర ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు విమర్శలు చేశారు. ఆర్సెనల్ యొక్క చాంపియన్స్ లీగ్ విజయం, "బ్రిటిష్ ఫుట్ బాల్ యొక్క విజయమని భావించలేము" అని వెస్ట్ హం యునైటెడ్ యొక్క పూర్వ నిర్వాహకుడు అలాన్ పార్డ్యూ చెప్పాడు.[60] అయితే దేశీయత సంగతి అప్రస్తుతమని చెప్పి, "ఒక క్లబ్ కు ప్రాతినిధ్యం వహించినప్పుడు, అది విలువలు, నాణ్యతలకు సంబంధించినదని, పాస్ పోర్ట్ కు సంబంధించినది కాదు" అని చెప్పాడు. దీని మూలాన పార్డ్యూ చెప్పిన మాటలలో జాతి విపక్ష ఉందని పరోక్షంగా చెప్పాడు. "ఒక స్వీడెన్ దేశస్తురాలును వివాహం చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్ళను జట్టులోకి తీసుకున్న వ్యక్తిని జాతి విపక్ష ఉన్న వ్యక్తి అని చెప్పులేము" అని పార్డ్యూ స్పందించాడు.[61] FA లో ఫుట్ బాల్ అభివృద్ది డైరెక్టర్ అయిన ట్రెవర్ బ్రూకింగ్ తో సహా ఇతర మేధావులు వెంగెర్ కు మద్దతు పలికారు. ఇంగ్లాండ్ లోని అత్యధిక విజయాలు సాధించిన ఒక క్లబ్బులో ఇంగ్లీష్ ఆటగాళ్ళు తక్కువ ఉన్నారంటే, అది ఇంగ్లాండ్ ప్రతిభ యొక్క స్థితిని చూపిస్తుందే గాని వెంగెర్ ను కాదు" అని బ్రూకింగ్ చెప్పారు.[62] వెంగెర్ ఆద్వర్యంలో పలు ఇంగ్లీష్ ఆటగాళ్లు తమ ఫుట్ బాల్ వృత్తిని ప్రారంభించారు. వారిలో కొందరు: డేవిడ్ బెంట్లే, స్టీవ్ సిడ్వేల్, జెర్మైన్ పెన్నంట్, మాథ్యూ ఉప్సన్, ఆష్లీ కాలే. థియో వాల్కాట్, కియరన్ గిబ్స్, జాక్ విల్షేర్ వంటి యువ ఇంగ్లీష్ ఆటగాళ్ళు ప్రాస్తుతం తమ క్రీడా వృత్తిని ఆర్సెనల్ లో కొనసాహిస్తూ ఉన్నారు.

రెఫరీల నిర్ణయాలు తన జట్టుకు అనుకూలంగా లేనప్పుడు వారు మీద వెంగెర్ వివాదాస్పత ప్రకటనలు చేశాడు.[63] 2007 కార్లింగ్ కప్ ఫైనల్ అనంతరం, ఒక లైన్స్ మాన్ ను 'అబద్దాలకోరు' అని చెప్పాడు. దేని మీద విచారణ జరిపిన FA,[64] వెంగెర్ కు £2500 జరిమానా విధించి ఒక హెచ్చరిక జారి చేసింది.[65] తన జట్టు ఆటగాళ్లు వివాదాస్పత సంఘటనలలో ఇరుక్కున్నప్పుడు, తాను ఆ సంఘటనను చూడలేదని చెప్పి తప్పించుకొని తన ఆటగాళ్లను సమర్ధించేవాడు; ఆ క్రీదాకారుడును సమర్ధించడానికి ఎటువంటి "వివేచనాత్మక వివరణ" ఇవ్వలేనప్పుడు, తాను ఆ విధంగా చెపుతానని, అది క్రీడాకారుడు యొక్క మంచికే అని వెంగెర్ చెప్పాడు.[66]

[మార్చు] గణాంకాలు

[మార్చు] ఆటగాడు

మూస:Football player statistics 1 |- !colspan="3"|France

|- |1978–79 |rowspan="3"|స్ట్రాస్బోర్గ్ |rowspan="3"|డివిజన్ 1 |2||0|| || || || ||1||0|| || |- |1979–80 |1||0|| || || || ||colspan="2"|–|| || |- |1980–81 |8||0|| || || || ||colspan="2"|–|| || మూస:Football player statistics 311||0|| || || || ||1||0|| || మూస:Football player statistics 511||0|| || || || ||1||0|| || |} [67]

[మార్చు] నిర్వాహకుడు

League Coupe de France Coupe de la Ligue Europe Total

మూస:Updated[68]

గమనిక
  1. "2003 Queen's birthday honours announced", BBC News, 14 June 2003. Retrieved on 1 January 2010.
  2. 2.0 2.1 Arsène Wenger. Arsenal.com. తీసుకొన్న తేదీ: 5 March 2009.
  3. 1934 - 1947 మధ్య జార్జ్ అల్లిసన్ ఆర్సెనల్ బాధ్యతలు చేపట్టిన 13 సంవత్సరాల కాలం వెంగెర్ యొక్క 12½ సంవత్సరాల (మార్చ్ 2009 నాటికి) కాలానికంటే ఎక్కువే. అయితే, అల్లిసన్ యొక్క వ్యవధిలో రెండవ ప్రపంచ యుద్ధం నెలకున్న పూర్తి కాలం కూడా కలిసి ఉంది. ఆ సమయములో అధికారికంగా ఫుట్ బాల ఆటలు ఏమి నిర్వహించబడలేదు. అందువలన, వెంగెర్ ఎక్కువ ఆటలకు నిర్వాహకుడుగా వ్యవహరించాడు.
  4. Winter, Henry. "Wenger, an expert of timing", telegraph.co.uk, 6 December 2001.
  5. A few things you may not know about Arsène Wenger. Football365.com.
  6. Amy Lawrence Q&A on Arsène Wenger. bbc.co.uk.
  7. Hytner, David. "I owe everything to growing up above a pub, says Arsène Wenger", The Guardian, 25 September 2009. Retrieved on 2009-09-28.
  8. 8.0 8.1 8.2 Jasper Rees. "Inside the mind of Arsene Wenger (excerpt from Wenger: The Making of a Legend by Jasper Rees)", The Guardian, 18 August 2003.
  9. Amy Lawrence. "French lessons", The Observer, 1 October 2006.
  10. Arsène Wenger signs for Castrol. Castrol India (2009-03-25). తీసుకొన్న తేదీ: 2009-08-31.
  11. Educate coaches and young players – Arsene Wenger. The Malaysian Insider (2008-06-09). తీసుకొన్న తేదీ: 2009-08-31.
  12. An interview with Arsene Wenger. FC Business. తీసుకొన్న తేదీ: 2009-08-31.
  13. Amazon.co.jp: 勝者のエスプリ: アーセン ベンゲル, Ars`ene Wenger: 本. Amazon Japan. తీసుకొన్న తేదీ: 2009-09-02.
  14. ఫుట్ బాల్: ముట్జిగ్ నుంచి హైబరీ: ఆర్సేన్ వెంగెర్ గురించిన ఒక క్లుప్త చరిత్ర| ఇండిపెన్డెంట్, ది (లండన్) | వ్యాసాల కొరకు BNET.com చూడండి[dead link]
  15. "Profile: Arsene Wenger", BBC News, 12 June 2003. Retrieved on 24 February 2008.
  16. Jason Cowley. "The French revolutionary", The Observer, 2006-05-14. Retrieved on 2009-09-02.
  17. Arsene Wenger. ESPN Soccernet. తీసుకొన్న తేదీ: 2009-09-02.
  18. ఆర్సేన్ వెంగెర్ జీవితచరిత్ర - జేవియర్ రివోయిర్ రచించినది
  19. ESPNsoccernet: Arsene Wenger. ESPNsoccernet. తీసుకొన్న తేదీ: 2006-12-26.
  20. Manager Profile: Arsene Wenger. Premier League. తీసుకొన్న తేదీ: 2009-11-28.
  21. ది ఇండిపెన్డెంట్ – వెంగెర్ యొక్క పది సంవత్సరాలు: అతను ఏ విధంగా ఫ్రెంచ్ విప్లవానికి పన్నాగం పన్నాడు
  22. Ten Years of Wenger: a week of celebration. Arsenal.com. తీసుకొన్న తేదీ: 2006-10-09.
  23. Dart, Tom. "Regrets? I've had more than a few, says title-chasing Wenger", Times Online, 7 October 2006. Retrieved on 2006-10-23.
  24. Press at a glance: Tuesday 7 December 1998. ANR. తీసుకొన్న తేదీ: 2006-10-09.
  25. http://www.rsssf.com/miscellaneous/unbeaten.html#సీజన్
  26. వెంగెర్ నిజంగా చేసిన వ్యాఖ్య: "అది అసాధ్యం కాదు. సీజన్ అంతటా ఒక ఓటమి కూడా లేకుండా గడపడం కష్టమని నాకు తెలుసు. అయితే, సరైన మనోభావం ఉంచుకుంటే, మేము దానిని సాధించ గలము." Lipton, Martin. "We Won't Lose One Match", The Mirror, 21 September 2002, pp. 78–79. నుంచి
  27. "Wenger signs new Arsenal contract", BBC, 27 October 2004. Retrieved on 27 October 2004.
  28. Dein: Wenger has job for life. Sky Sports.
  29. "Wenger agrees new deal at Arsenal", BBC Sport, 7 September 2007. Retrieved on 1 January 2010. ఒప్పందము విలువ ఏడాదికి £4 మిలియను అని అంచనా.
  30. Whyatt, Chris. "Wenger sticks to his guns", BBC Sport, 9 April 2008. Retrieved on 1 January 2010.
  31. Watt, Tom. "Arsene Wenger has made some mistakes but he's still the best Arsenal have ever had", Daily Mail, 17 April 2008.
  32. Finkelstein, Daniel. "Efficiency drive in defence and attack is proving Arsene Wenger right", The Times, 27 November 2007. “For the past four years, our model shows Arsenal as an attacking team – at no point has their defence ranking been above their ranking for attack.”
  33. Syed, Matthew. "Why Arsene Wenger should be proud rather than cowed", The Times, 10 April 2008. “Arsène Wenger could have instructed his team to play with the dispiriting pragmatism so beloved of his rival managers, but the mercurial Frenchman was not prepared to betray his nobler ideals, even when it might have improved his club’s chances of success.”
  34. Powell, Jeff. "Make this your final year, Joe", Daily Mail, 13 April 2008. “Imaginative play to delight connoisseurs but lack of a killer touch leaving them vulnerable to more relentless opponents.”
  35. What is Arsenal's optimal tactical strategy?.
  36. What is Arsenal's optimal tactical strategy?.
  37. Adebayor might not remain a lone Gunner.
  38. "Why don't more teams trust false nines?", The Guardian, 27 October 2009.
  39. Transfer League. Transfer League (2008-06-11). తీసుకొన్న తేదీ: 2009-10-31.
  40. అధికారిక ఆర్సెనల్ పత్రిక వాల్యూం 8 ఇష్యూ 07
  41. It's Wenger Day at Highbury!. Arsenal.com.
  42. Winter, Henry. "Arsenal sign Wenger with expert timing", Daily Telegraph, 6 December 2001.
  43. Arsenal commission bust of Arsène Wenger. Arsenal.com.
  44. Arsenewenger. Web.mac.com (2007-11-21). తీసుకొన్న తేదీ: 2009-10-31.
  45. Wenger has no back-up plan. Irish Examiner.
  46. Fair Play to Gunners. The Football Association. 2004-10-27న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు.
  47. Fair Play to Arsenal could see Spurs in Europe. BreakingNews.ie.
  48. Barclays Premiership 2005/06 Fair Play League (PDF). Premierleague.com. 2006-09-23న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు.
  49. http://www.ప్రీమియర్లీగ్.com/staticFiles/42/ef/0,,12306~126786,00.pdf
  50. MON On Fair Play | Latest News | Latest News | News | Aston Villa. Avfc.co.uk (2009-10-27). తీసుకొన్న తేదీ: 2009-10-31.
  51. What the 2008/09 Premier League Fair Play table tells us » Who Ate all the Pies. Whoateallthepies.tv (2009-06-05). తీసుకొన్న తేదీ: 2009-10-31.
  52. http://www.ప్రీమియర్లీగ్.com/page/FairPlayTable/0,,12306,00.html
  53. "Pizzagate: a slice of strife", Guardian, 15 September 2006. Retrieved on 18 February 2009.
  54. Bose, Mihir. "Untold story of 'Pizzagate'", Daily Telegraph, 8 December 2004. Retrieved on 18 February 2009.
  55. Wenger: I didn't see tunnel fracas. Football365.
  56. "Wenger fined over Ruud outburst", BBC Sport, 16 December 2004. Retrieved on 1 January 2010.
  57. "Wenger and Ferguson to end feud", BBC Sport, 20 January 2005. Retrieved on 1 January 2010.
  58. "Mourinho labels Wenger a 'voyeur'", BBC Sport, 31 October 2005. Retrieved on 1 January 2010.
  59. "Mourinho regrets 'voyeur' comment", BBC Sport, 23 December 2005. Retrieved on 1 January 2010.
  60. "This was no English victory says Taylor", The Guardian, 10 March 2006.
  61. Mick Collins. "Wenger and Pardew face an early rematch", 'The Telegraph', 2006-12-31. Retrieved on 2009-08-14.
  62. English kids are technically inferior, claims Brooking. Soccernet.
  63. "FA quizzes Wenger about comments", BBC Sport, 19 December 2005. Retrieved on 1 January 2010.
  64. "Wenger out of order, says ex-ref", BBC Website, 4 March 2007. Retrieved on 1 January 2010.
  65. "Wenger given fine & warning by FA", BBC Website, 17 April 2007. Retrieved on 1 January 2010.
  66. "Wenger admits to 'selective vision'", BBC Sport, 2009-08-14. Retrieved on 2009-08-14.
  67. Arsène WENGER - Racing Club de Strasbourg - racingstub.com. racingstub.com<! (1949-10-22). తీసుకొన్న తేదీ: 2009-10-31.
  68. Arsene Wenger's managerial career. Racing Post. తీసుకొన్న తేదీ: 2 November 2009.

[మార్చు] గౌరవాలు

[మార్చు] ఆటగాడు

[మార్చు] స్ట్రాస్బోర్గ్

  • లిక్యూ 1: 1978–79

[మార్చు] నిర్వాహకుడు

[మార్చు] మోనాకో

విజేత
  • లిక్యూ 1 (1): 1987–88
  • కూ డి ఫ్రాన్స్ (1): 1990–91
ద్వితీయ స్థానం
  • UEFA కప్ విన్నర్స్' కప్ (1): 1990–91
  • లిక్యూ 1 (3): 1990–91 1991–92 1992–93

[మార్చు] నగోయ గ్రాంపస్

విజేత
  • ఏమ్పెరర్స్ కప్ (1): 1995
  • J-లీగ్ సూపర్ కప్ (1): 1996
ద్వితీయ స్థానం
  • J. లీగ్ (1): 1996

[మార్చు] అర్సెనల్

విజేత
  • ప్రీమియర్ లీగ్ (3): 1997–98, 2001–02, 2003–04
  • FA కప్ (4): 1997–98, 2001–02, 2002–03, 2004–05
  • FA కమ్యూనిటీ షీల్డ్ (4): 1998, 1999, 2002, 2004
ద్వితీయ స్థానం
  • UEFA చాంపియన్స్ లీగ్ (1): 2005–06
  • ప్రీమియర్ లీగ్ (5): 1998–99, 1999–2000, 2000–01, 2002–03, 2004–05
  • FA కప్ (1): 2000–01
  • లీగ్ కప్ (1): 2006–07
  • FA కమ్యూనిటీ షీల్డ్ (2): 2003, 2005
  • UEFA కప్ (1): 1999–2000

[మార్చు] వ్యక్తిగత గౌరవాలు

  • ఫ్రెంచ్ మేనేజర్ అఫ్ ది ఇయర్: 1988, 2008
  • J. లీగ్ నిర్వాహకుడు అఫ్ ది ఇయర్: 1995
  • ఆఫీసర్ అఫ్ ది బ్రిటిష్ ఎంపయర్: 2003
  • Onze d'Or కోచ్ అఫ్ ది ఇయర్: 2000, 2002, 2003, 2004
  • FA ప్రీమియర్ లీగ్ మేనేజర్ అఫ్ ది ఇయర్: 1998, 2002, 2004
  • LMA మేనేజర్ అఫ్ ది ఇయర్: 2001–02, 2003–04[1]
  • BBC స్పోర్ట్స్ పెర్సనాలిటీ అఫ్ ది ఇయర్ కోచ్ అవార్డు: 2002, 2004
  • ఫ్రీడం అఫ్ ఐలింగ్టన్: 2004 [2]
  • FWA ట్రిబ్యూట్ అవార్డ్: 2005 [3]
  • ఇంగ్లీష్ ఫుట్ బాల్ హాల్ అఫ్ ఫేం: 2006
  • ప్రీమియర్ లీగ్ నిర్వాహకుడు అఫ్ ది మంత్ : 10 times[4] (మార్చ్ 1998, ఏప్రిల్ 1998, అక్టోబర్ 2000,[5] ఏప్రిల్ 2002,[6] సెప్టెంబర్ 2002,[7] ఆగష్టు 2003,[8] ఫిబ్రవరి 2004,[9] ఆగష్టు 2004,[10] సెప్టెంబర్ 2007,[11] డిసెంబర్ 2007[12])

[మార్చు] సూచికలు

  1. "Wenger secures LMA award", BBC Sport, 18 May 2004. Retrieved on 28 May 2009.
  2. Arsène Wenger | Coaching Staff | First Team. Arsenal.com. తీసుకొన్న తేదీ: 2009-10-31.
  3. Football Writers' Association: Latest News :: Arsene Wenger Tribute. Footballwriters.co.uk. తీసుకొన్న తేదీ: 2009-10-31.
  4. Arsene Wenger OBE – Honours. League Managers Association. తీసుకొన్న తేదీ: 28 May 2009.
  5. "Sheringham wins monthly award", BBC Sport, 10 November 2000. Retrieved on 28 May 2009.
  6. "Arsenal duo win awards", BBC Sport, 10 May 2002. Retrieved on 29 May 2009.
  7. "Arsenal duo bag awards", BBC Sport, 4 October 2002. Retrieved on 29 May 2009.
  8. "Wenger wins award", BBC Sport, 12 September 2003. Retrieved on 28 May 2009.
  9. "Arsenal scoop awards double", BBC Sport, 12 March 2004. Retrieved on 29 May 2009.
  10. "Arsenal claim double award", BBC Sport, 10 September 2004. Retrieved on 29 May 2009.
  11. Arsenal pair scoop monthly awards. BBC Sport (19 October 2007). తీసుకొన్న తేదీ: 28 May 2009.
  12. Wenger and Santa Cruz scoop awards. Barclays Premier League (11 Jan 2008). తీసుకొన్న తేదీ: 28 May 2009.

[మార్చు] బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
[[Commons: Category:Arsène Wenger

| Arsène Wenger

]]


మూస:Arsenal F.C. Squad మూస:League Managers Association Manager of the Year



ఉదహరింపు పొరపాటు: <ref> tags exist for a group named "nb", but no corresponding <references group="nb"/> tag was found

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు