ఆల్ఫా కణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్థిర కేంద్రకం నుండి ఆల్ఫా కణం వెలువడుట

ఆల్ఫా కణం (α-కణం) అనునది హీలియం పరమాణు కేంద్రకం. దీనిని 2 He 4 లేదా He2+ లేదా He++గా సూచిస్తారు.యివి ధనావేశం గల కణాలు.

వివరణ[మార్చు]

సాధారణంగా హీలియం పరమాణువులో రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు, రెండు ఎలక్ట్రాన్లు ఉండును. ఇలా ఉంటే అది హీలియం తటస్థ పరమాణువు అవుతుంది. హీలియం కేంద్రకంలో రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు ఉంది కేంద్రకం చుట్టూ రెండు ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. బాహ్య కక్ష్యలోని రెండు ఎలక్ట్రాన్ లు తొలగించినపుడు అది హీలియం అయాన్ గా మారుతుంది. మిగిలిన కేంద్రకాన్ని ఆల్ఫా కణం అంటారు.

కేంద్రకం కనుగొను ప్రయోగంలో[మార్చు]

పరమాణు కేంద్రకం కనుగొనే ప్రయోగంలో బంగారు రేకులోనికి ఆల్ఫా కణాలను రూథర్ ఫర్డు అనే శాస్త్రవేత్త పంపించాడు. పలుచని బంగారు రేకు గుండా వెళ్ళినపుడు 20000 కణాలలో ఒక కణం వెనుకకు వచ్చినట్లు గమనించాడు. దీనిని బట్టి పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. మధ్యలో కొంచెం ప్రదేశంలో కేంద్రకం ఉన్నట్లు గుర్తించాడు.

సహజ రేడియో ధార్మికత[మార్చు]

ఇవి సాధారణంగా పరమాణు సంఖ్య 83 తర్వాత గల మూలకాలలో కేంద్రకం అస్థిరత్వం వల్ల వెలువడతాయి. ఇవి రేడియో ధార్మికత ప్రదర్శిస్తాయి. వీటిని మొదట హెన్రీ బెక్వరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన చేస్తున్న ప్రయోగంలో యురేనియం ఖనిజమైన పిచ్ బ్లెండ్ ను టేబుల్ సొరుగులో ఉంచి కొన్నిరోజుల తర్వాత చూసినపుడు అదే సొరుగులో గల చాలా జాగ్రత్తగా భద్రపరచబడ్డ పోటోగ్రాఫిక్ ప్లేట్లును కొన్ని కిరణాలు ప్రభావితం చెసినట్లు కనుగొన్నాడు. ఆ కిరణాలు పిచ్ బ్లెండ్ ఖనిజం నుండి వచ్చినట్లు గమనించాడు. అదే విధంగా వివిధ మూలకాలతో ప్రయోగం చేసిన తదుపరి 83 పరమాణు సంఖ్య తర్వాత గల మూలకాలలో కొన్ని కిరణాలు వెలువడుతున్నట్లు గుర్తించాడు. వీటికి బెక్వరల్ కిరణాలు అని నామకరణం చేసాడు. పరమాణు కేంద్రకం నుండి అస్థిరత్వం వల్ల కిరణాలు వెలువడటాన్ని సహజ రేడియో థార్మికత అంటారు.

రేడియో ధార్మిక వికిరణాలు-రకాలు[మార్చు]


ఒక సీసం దిమ్మకు రంధ్రం చేసి అందులో ఏదైనా రేడియో ధార్మిక మూలకం తీసుకోవావి.ఎందువలనంటే సీసం రేడియో ధార్మికతను ప్రదర్శించదు. రేడియో ధార్మిక మూలకం నుండి వెలువడుతున్న కిరణాలను శోషించుకుంటుంది. కాని కిరణాలు ఒకవైపు వస్తాయి. ఈ కిరణ పుంజంలో ఎన్ని రకాల వికిరణాలు ఉన్నాయో తెలుసుకొనుటకు కిరణ పుంజమునకు ఇరువైపుల అయస్కాంత క్షేత్రం ఉంచినపుదు అవి మూడు రకాలుగా ఉన్నాయని తెలిసింది. ఇపుడు అయస్కాంత క్షేత్రాన్ని తొలగించి విద్యుత్ క్షేత్రమును ఉంచినపుడు కొన్ని కణాలు ఋణావేశ పలకవైపు వంగినవి. కొన్ని ధనావెశ్ పలక వైపు వంగినవి. కొన్ని అపవర్తనం చెందకుండా పైకి పోయినవి.


పై ప్రయోగంలో ఋణావేశ పలక వైపు ఆకర్షించినవి ఆల్ఫా కణాలు. ధనావేశ పలక వైపు వంగినవి బీటా కణాలు, అపవర్తనం చెందనివి గామా కిరణాలు

ఆల్ఫా కణాల ధర్మాలు[మార్చు]

  • ఇవి రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు కలిగి ఉంటాయి.
  • ఇవి ద్వి అయనీకరణం చెందబడిన హీలియం పరమాణువులు.
  • వీటి ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి 4 రెట్లు,, ఆవేశం ప్రోటాన్ ఆవేశానికి 2 రెట్లు.
  • వీటి వేగం సుమారు 107 మీ/సె. అన్ని కణాల వేగం ఒకేలా ఉండాలని లేదు.
  • ఇవి వాయువు గుండా ప్రయాణించినపుడు వాయువును అయనీకరిస్తాయి. వీటి అయనీకరణ సామర్థ్యం బీటా, గామా కణాల కన్న ఎక్కువ.
  • వీటి చొచ్చుకుపోయే సామర్థ్యం బీటా, గామా కణాల కన్న తక్కువ.
  • ఏ కేంద్రకం నుండయినా వెలువడినప్పుడు పరమాణువు పరమాణు సంఖ్యలో రెండు ప్రమాణాలు, ద్రవ్యరాశి సంఖ్యలో 4 ప్రమాణాలు తగ్గును.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్ఫా_కణం&oldid=4094826" నుండి వెలికితీశారు