ఆల్‍ఫ్రెడ్ నోబెల్

వికీపీడియా నుండి
ఆల్‌ఫ్రెడ్ నోబెల్
AlfredNobel adjusted.jpg
జననం అక్టోబర్ 21, 1833
Flag of స్వీడన్ స్టాక్‌హోం, స్వీడన్
మరణం డిసెంబర్ 10, 1896
Flag of ఇటలీ సన్రెమో, ఇటలీ
వృత్తి రసాయనశాస్త్రవేత్త, ఇంజనీరు, డైనమైట్ను కనుగొన్నవాడు.

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్  (21 అక్టోబర్ 1833, స్టాక్‌హోం, స్వీడన్ – 10 డిసెంబర్ 1896, సన్రీమో, ఇటలీ) ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.

జీవితం [మార్చు]

ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరవాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.