ఆవు
ఆవులు (ఆంగ్లం Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు[1]. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు. ఎద్దులు ఎద్దులు వ్వవసాయ దారునికి ఎంతో ఉపయోగం: వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్వవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్వవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలొచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముక్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి ఠీవి, అందం, వీటి భలం, ఇలా ఏ విషయంలో నైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వున్నది. అందుకే వీటి ధరలు లక్షల్లో వుంటాయి. ఈ జాతి అంత రించి పోయే దిశలో వున్నది.
హిందువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద , మూత్రం లలో ఎన్నో ఔషద గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలె శరణ్యం: ఆహారంగానె కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగె ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం:
ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషదమే గోమాత అర్క్ చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషద విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనె మాటనె.
భారత దేశానికి రైతు వెన్నుముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేక పోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆదారంగా బతగ్గలడు. ఆవుకు పుట్టిన కోడెలు (ఎద్దులు) రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేర వేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండ దండ గా వుంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు,ఆరాదిస్తాడు, పోషిస్తాడు. తమ పిల్లలు లాగా కాపాడు కుంటాడు. ఆవు పేడద్వార గోబర్ గ్యాసు ఉత్పత్తి చేసి వంట చెరుకుగా వాడు కుంటాడు. మిగిలిన వ్వర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడు కుంటాడు. చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడ దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనిషికన్నా ఆవె గొప్ప. ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెప్పుతున్నట్లు ఒక సినిమా పాట వున్నది. వినరా.. వినరా.... నరుడా తెలుసు కోరా పామరుడా...... గోమాతను నేనేరా నాతో సరిరారురా.......... ఇలా ఆపాట చాల హృద్యంగా సాగుతుంది. గో సంరక్షణార్థం మనదేశంలో చట్టాలు చాలానె వున్నాయి. కాని వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా వున్నది.
ఇంతటి ప్రాశస్త్యం గలిగిన ఆవులు గతంలో మనదేశంలో చాల జాతులు వుండేవి. కాల క్రమేణ అవి చాల వరకు అంత రించి పోయాయి. ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రం మిగిలి వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు, జర్సీ ఆవులు వంటివి ఎక్కువగా వున్నాయి. ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటి పై మక్కువ చూపు తున్నారు. ప్రభుత్వంకూడ వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటు వంటి సంకర జాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు.
కాని ఔషద సేవనలో, ఆచార వ్వవ హారాలకు, ఆరాధనా ప్రక్రియలలో దేశ వాళి ఆవులకు, వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత వున్నది. అందు చేత ఈ దేశ వాళి గోవులను, వాటి లుత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డా:బి.అర్.కె.ఆర్. ప్రభుత్య ఆయుర్వేద కళాశాల వారు మరియు చరక డైరి వారు సంయుక్తంగా దేశ వాళి ఆవుల ఉత్సవాన్ని 28..3..2012 నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించారు. వాటి ఉత్పత్తులను, ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారూ. అదే విధంగా గోమాతకు ప్రధక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారు.
ప్రస్తుతం మిగిలివున్న దేశ వాళి గో జాతుల్లోని కొన్నింటి విశేషాలు; 1. కపిల: ఇది అరుదైన జాతి. నల్లగా చూడ ముచ్చటగావుంటుంది.
2. దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వున్నాయి.
3. ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమె వున్నాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. వీటి ఆంబోతులు రాజ ఠీవి తో ఎంతో దర్పంగా వుంటాయి.
అతి బారి శరీరంతో ఠీవి గా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి. వీటి ధరలు లక్షల్లో వుంటుంది.
4. పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో
రికార్డు నామోదు కాబడనున్నది. వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమె.
5. గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడ పాల ఉత్పత్తిలో మంచివె. ఇవి ఖరీదైనవి కూడ. 6. షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా
అందంగా వుంటాయి.
విషయ సూచిక |
[మార్చు] కొన్ని విశేషాలు
ఆవు శాకాహారి జంతువు. ఇది కేవలం గడ్డి, లేగా మొక్కలకు సంబందించిన ఎటువంటి ఆహారానయినా భుజిస్తుంది. ఆవులు మరియూ ఎద్దులు వ్యవసాయంలో రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఆవులు పాలు ఇస్తే ఎద్దులు పొలం దున్నటానికి షాయపడతాయి. అందుకనే వాటికి కృతజ్ణతలు తెలుపటానికి సంక్రాంతి పండుగ ఆఖరి రోజయిన కనుమను వాటికోసమే ప్రత్యేకించారు.
[మార్చు] గోమాత మహిమ
ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.
ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి వున్నాయి. శిరస్సుకు మధ్యబాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్థశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది.
ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి 'నహుషం'లో ప్రవచించారు. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్రగ్రంథాలలోను, భారత, రామాయణ, భాగవతాది పవిత్రగ్రంథాలలోను, గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, బుద్ధుడు, స్వామి దయానంద సరస్వతి, గురు నానక్, శంకరాచార్యులు తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడైనాడు. దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలు.
[మార్చు] ఆవు పాలు
ఆవు పాలలో విటమిన్ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.గేదెల కంటే ఆవులు ఎక్కువ కాలం పాలు ఇస్తాయి.రోజువారీ పోషణ ఖర్చు తక్కువ , రోజుకు 20లీటర్ల వరకూ పాలు ఇస్తాయి.పోషక విలువలు అధికం.గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో వెన్న శాతం తక్కువ. సంకర జాతి ఆవు పాలలో వెన్నశాతం 3.5 ఉండగా, జెర్సీ ఆవు పాలలో 4.5 శాతం, గేదె పాలలో 6 నుంచి 9 శాతం వరకూ వెన్న ఉంటుంది.
[మార్చు] ఆవు పేడ
ఆవు పేడలో క్రిమి సంహరక గుణాలున్నయన్న నమ్మకం వల్ల ఇళ్ళు అలకడానికి ఉపయోగిస్తారు. పొద్దునే ఇంటి ముందు ముగ్గు వేసే ముందు పేడ నీళ్ళతో కల్లాపి చల్లుతారు. ఆవు పేడను పిడకలు చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు
[మార్చు] గోమూత్రం
విశ్వహిందూ పరిషత్‌నిర్వహిస్తున్న 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్ర' తయారు చేసిన ఉత్పత్తులకు అమెరికా, చైనా మేధో సంపత్తి హక్కులు లభించాయి.ఔషధంతో గోపంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్ పేటెంట్ గుర్తించింది.ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డీఎన్‌ఏను కాపాడేలా పనిచేస్తుందట.బాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని- రీ డిస్టిల్డ్ కౌ యూరిన్ డిస్టిలేట్( 'కామధేను ఆర్క్') అని నామకరణం చేశారు.
[మార్చు] గోవధను నిషేధించండి
హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు కాబట్టి గో రక్షణకు చట్టం తీసుకురావాలని, ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని,గోవధను నిషేధించాలని కోరుతూ హిందూమత పెద్దలు ఎనిమిది కోట్ల సంతకాలతో కూడిన ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు సమర్పించారు. (ఈనాడు1.2.2010)
[మార్చు] ప్రత్యేకమైన గోవులు
- కామ ధేనువు: కోరిన వరాలు ఇచ్చే గోవు.
[మార్చు] మూలాలు మరియు సూచనలు
- ↑ గోబర్ గ్యాసు లో గోబర్ అంటే పేడ అని అర్ధం, అంటే మన పిడకలు ఉపయోగించే విధానానికి ఒక శాస్తీయతను కల్పించే ప్రక్రియ గోబర్ గ్యాసు.