ఆశా భోస్లే

వికీపీడియా నుండి
ఆశా భోస్లే
Asha Bhosle - still 47160 crop.jpg
పూర్వరంగ సమాచారం
జన్మనామం ఆషా మంగేష్కర్
జననం సెప్టెంబరు 8 1933 (1933-09-08) (వయసు 79)
సాంగ్లి, ముంబై సంస్థానము, బ్రిటీష్ ఇండియా
సంగీత రీతి పాశ్చాత్య, జానపద, భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తి గాయని, నేపధ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు 1943 – నేటి వరకు

ఆశా భోస్లే (జననం: సెప్టెంబర్ 8, 1933) ప్రముఖ బాలీవుడ్ గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన లతా మంగేష్కర్ కు సోదరి.

సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.

బాల్యం [మార్చు]

ఆశా భోస్లే మహారాష్ట్ర కు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు మరియు గాయకుడు.

బాహ్య లంకెలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఆశా_భోస్లే&oldid=813446" నుండి వెలికితీశారు