ఆశ్రమం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నూలు లోని వృద్ధాశ్రమం
మలిశెట్టి వెంకటరమణ నిర్వహిస్తున్న పరమాత్మ సేవా తపోవన ఆశ్రమం

ఆశ్రమం అంటే ఆశ్రితులను ఆదరించే ప్రదేశము. వివిధ రకాల ఆశ్రితులు వారి ఆశ్రమాలు:

యాచకులఆశ్రమం[మార్చు]

పేదరికం, నేర చరితులు, వివిధ కారణాలతో ఇళ్లు వదిలి నగరాలకు చేరుకుని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, బస్‌స్టాపులలో తలదాచుకుంటూ రాత్రి వేళల్లో నిద్రిస్తున్న వారికోసం ఢిల్లీ లాంటి నగరాలలో ఆశ్ర మాలున్నాయి.ఫుట్‌పాత్‌లపై నివాసముండి పనులు చేసుకునే వారు, యాచకులు రాత్రి వేళల్లో వీటిలో నిద్రించవచ్చు. రాత్రి వేళల్లో తలదాచుకునే వారి వద్ద నుంచి అతితక్కువ రుసుం వసూలు చేస్తారు.అతితక్కువ ధరకే ఆహారం కూడా దొరుకుతుంది.

వృద్ధాశ్రమం[మార్చు]

మరణపర్యంతం వృద్ధులకు వానప్రస్థాశ్రమం ఇక్కడే గడుస్తుంది. ఉచితంగా ఉండనిచ్చేవి, డబ్బుకట్టించుకుని ఉండనిచ్చేవి, ఆయా కులమతాలవారీగా చేర్చుకొనేవి ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆలన..పాలన


వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు. ఎంతోమంబొద్దు పాఠ్యంది తల్లితండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్లు తమను కళ్లల్లో పెట్టుకుని చూడాలని భావిస్తుంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లితండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడక పోవడంతో తల్లితండ్రులు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే.. పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో రాయవరం మండలం పసలపూడి ప్రశాంతి వృద్ధాశ్రమం ఒకటి. కాకినాడ-రావులపాలెం రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాల మధ్య ఉన్న ప్రశాంతి ఆశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా ఉంది.

ఆధ్యాత్మిక చింతనతో పాటు...

పసలపూడిలో ఉన్న ప్రశాంతి వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితం... ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ప్రశాంతి ఆశ్రమంగా వృద్ధుల పాలిట ప్రశాంత వృద్ధాశ్రమంగా మారింది. ఇక్కడ బ్రహ్మకుమారీ అక్కయ్యలు ఇచ్చే రాజయోగ శిక్షణ, మెడిటేషన్, ఆధ్యాత్మిక తరగతుల కారణంగా ఇక్కడ శేష జీవితం గడుపుతున్న వారికి ఆధ్యాత్మిక తరగతులు ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడివారికి మనఃశాంతి లభించడంతో పాటు.. రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింత లేదు.

16 ఏళ్లుగా వృద్ధుల సేవలో... అమ్మా.. వెనుకా ముందూ ఎవ్వరూ లేరు. మేమూ మీతోనే ఉంటాం.. అంటూ వచ్చిన పేదలను చూసి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినట్లు బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రశాంతి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వృద్దాశ్రమంపై వివరించి ఇక్కడకు రావాలని అప్పట్లో నిర్వహకులు ఆహ్వానించారు. ఒకరిద్దరితో ప్రారంభమైన వృద్ధాశ్రమం ఇప్పుడు 25 మందితో కొనసాగుతోంది. ఉదయం మెడిటేషన్‌తో ప్రారంభమైన అనంతరం ఆధ్యాత్మిక తరగతులు కొనసాగుతాయి. అవసరమైన సమయంలో వైద్య సదుపాయం కూడా అందిస్తున్నారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.

ఒకరికొకరు తోడుగా... ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతీ ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే బ్రహ్మకుమారీ అక్కయ్యలకు తెలియజేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు.

అనాద ఆశ్రమం

బాల కార్మికుల ఆశ్రమం[మార్చు]

బ్రహ్మకుమారీల ఆశ్రమం[మార్చు]

బ్రహ్మచారుల ఆశ్రమం[మార్చు]

వికలాంగుల ఆశ్రమం[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ్రమం&oldid=3851521" నుండి వెలికితీశారు