ఇండియన్ రెవెన్యూ సర్వీస్

వికీపీడియా నుండి
ఇండియన్ రెవెన్యూ సర్వీస్
సర్వీసు అవలోకనం
సంక్షిప్తీకరణ I.R.S.
రూపొందినది 1963
దేశం Flag of భారత దేశం భారత్ చిహ్నం]' {{{{Emblem of India.svg}}}}
శిక్షణా మైదానం జాతీయ కస్టమ్స్ & ఎక్సైజ్ అకాడెమీ, ఫరీదాబాద్ జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడెమీ, నాగ్‌పూర్ నియంత్రణ అధికారం ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయ శాఖ
లీగల్ పర్సనాలిటీ ప్రభుత్వపరమైన: ప్రభుత్వ సర్వీసుమరియు అమలు
సహజ స్వభావం పన్నువిధానం/ రాబడి విధాన సూత్రీకరణ<br /పన్నువిధానం / రాబడి విధాన అమలు/రాబడి నిర్వహణ శాఖ
పన్ను నియమాల మంత్రులు/అమలు సలహాదారులు
కేడర్ పరిమాణం (కలిపినది) 4000

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (Indian Revenue Service or IRS ), భారత్‌కి చెందిన ప్రధాన గ్రూప్ A సివిల్ సర్వీసెస్‌లలో ఒకటి. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రెండు వేర్వేరు శాసనబద్ధ సంస్థలైన కేంద్ర ఎక్సైజ్ & కస్టమ్స్ మండలి (CBEC) & ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (CBDT) ద్వారా నియంత్రించబడిన రెండు శాఖలతో (కస్టమ్స్ & కేంద్ర ఎక్సైజ్) కూడి ఉంటోంది. ప్రొబేషనరీ IRS అధికారులు కస్టమ్స్ & ఎక్సైజ్ లేదా ఆదాయపన్ను శాఖల మధ్య దేన్నయినా ఎంపిక చేసుకోవచ్చు, ఇలా ఎంపిక చేసుకున్నాక ఆ శాఖకు వీరు శాశ్వత ఉద్యోగులవుతారు. IRS అధికారులు ప్రత్యక్ష (ఆదాయం, కార్పొరేట్, వెల్త్, FBT వగైరా) మరియు పరోక్ష (కేంద్ర ఎక్సైజ్, సేవా పన్ను మరియు కస్టమ్స్ పన్ను) సేకరణ, పాలనాయంత్రాగం మరియు విధాన రూపకల్పన వంటి అంశాలను నిర్వహిస్తారు. ఈ అధికారులు భారతీయ పన్ను నిర్వాహకులు. వీరు భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆదాయ శాఖలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) లేదా కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ మండలి (CBEC) కింద పని చేస్తుంటారు.

విషయ సూచిక

[మార్చు] ఎంపిక

సివిల్ సర్వీసుల పరీక్ష అని పిలువబడే మూడు దశల సంయుక్త ఎంపిక ద్వారా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్చే నిర్వహించబడే సివిల్ సర్వీసుల పరీక్ష ద్వారా వీరి ఎంపిక జరుగుతుంది. తొలి దశ, సివిల్ సర్వీసుల పరీక్ష (ప్రిలిమినరీ) రెండు ఆబ్జెక్టివ్ రకం పరీక్షలతో కూడి ఉంటుంది, వీటిలో ఒకటి జనరల్ స్టడీస్ మరొకటి ఇవ్వబడిన అంశాల జాబితాలోంచి అభ్యర్థి ఎంచుకోదగిన అంశం.

అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్, మెడిసన్ నుంచి చైనీస్ సాహిత్యం మరియు ఎక్కౌంటెన్సీ వరకు నలభై రంగాలలో పరీక్షించడానికి ఎంచుకోబడతారు. ఇది పూర్తిగా ప్రిలిమినరీ దశ, తుది ర్యాకింగులలో ఇది ఏ పాత్రనూ పోషించదు. దాదాపు 5000-6000 అప్లికేషన్లు సివిల్ సర్వీస్ పరీక్ష(మెయిన్స్) అని పిలువబడే తదుపరి దశకోసం ఎంచుకోబడతారు. రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుంది. దీంట్లో తొమ్మిది పేపర్లు ఉంటాయి వీటిలో రెండు సహజంగా అర్హతను కలిగి ఉంటాయి. ప్రిలిమినరీ దశలోని ఒక అంశం ఎంపికతో పోల్చి చూస్తే, అభ్యర్థులు తమ ఎంపికలలో రెండు ఐచ్ఛిక అంశాలను తప్పక ఎంచుకోవాలి. జనరల్ స్టడీస్‌లో రెండు పేపర్లు ఉంటాయి, ఆప్షనల్ 1, ఆప్షనల్ 2 మరియు ఒక సులభమైన పేపర్. దాదాపు 1200-1400 మంది అభ్యర్థులు మెయిన్స్‌లో ఎంపికై మూడో స్టేజీ అయిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (ఇంటర్వ్యూ)కి కూర్చుంటారు. ప్రతి అభ్యర్థీ ఇంటర్వ్యూకి ముందు తమ సర్వీస్ ప్రాధాన్యతను ఎంచుకోవలసిందిగా కోరబడతాడు. మొత్తం ఎంపిక ప్రక్రియకు 15 నుంచి ముప్పై రెండు నెలల కాలం పడుతుంది. మళ్లీ మళ్లీ ప్రయత్నాలను కూడా అనుమతిస్తారు (జనరల్ విభాగంలో గరిష్టంగా 4 సార్లు, OBCకి 7 సార్లు ప్రయత్నించవచ్చు కాని, SC & ST లకు పరిమితులు లేవు.

[మార్చు] శిక్షణ

IRS ఆఫీసర్ ట్రెయినీలు (OTలు , అని మక్కువగా ప్రస్తావించబడుతుంటారు) LBSNAA ముస్సోరిలో సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ A) వద్ద 3 నెలల ఫౌండేషనల్ ట్రెయినింగ్ ఆఫీసర్లుగా శిక్షణ పొందుతారు దీని తర్వాత కస్టమ్స్ మరియు ఎక్సైజ్ అధికారుల కోసం జాతీయ కస్టమ్స్ ఎక్సైజ్ మరియు మాదకద్రవ్యాల అకాడెమీ[1] ఫరీదాబాద్‌ [2]లో 15 నెలల తీవ్రమైన ప్రొఫెషనల్ శిక్షణ ఉంటుంది లేదా ఆదాయ పన్ను అధికారుల కోసం జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడెమీ, నాగ్‌పూర్[3]లో శిక్షణ నిర్వహిస్తారు, ఇక్కడ వీళ్లు మేనేజ్‌మెంట్‌లో సూత్రాలు, భావనలు మరియు పురోగతులు, పన్నుల విధానంలో విస్తృత శిక్షణ పొందుతారు. తీవ్రమైన శారీరక రక్షణ మరియు ఆయుధ శిక్షణకు అదనంగా పబ్లిక్ విధానం మరియు చట్టంపై శిక్షణ కూడా పొందుతారు.

[మార్చు] నియామకాలు

ప్రతిష్ఠాత్మకమైన సహాయం కమిషనర్ పదవితో మొదలుపెట్టి, IRS అధికారులు ఛీఫ్ కమిషనర్ స్థాయికి ఎదుగుతారు వీరిలో అత్యంత సీనియర్లు మెంబర్‌/చైర పర్సన్ - CBDT / CBEC / CESTAT / ITAT / సెటిల్మెంట్ కమిషన్ పదవిని కూడా చేరుకుంటారు.

ఆదాయ శాఖ అధికారులు తమ శాఖకు చెందిన అన్ని పాలనాపరమైన చర్యలకు సంబంధించిన వ్యవహారాలను, రెండు బోర్డుల (CBEC మరియు CBDT) మధ్య సమన్వయాన్ని నిర్వహిస్తారు, భారతీయ స్టాంపు చట్టం 1899 నిర్వహణ (కేంద్ర పరిధిలోకి వచ్చినంతవరకు), కేంద్ర సేల్స్ టాక్స్ చట్టం 1956, మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం 1985 (NDPSA), స్మగ్లర్లు మరియు విదేశీ మారక ఎగవేతదారుల (ఆస్తి జప్తు)చట్టం 1976 (SAFEM (FOP) A), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 1999 (FEMA), నగదు అక్రమ బదలాయింపు నిరోధక చట్టం 2002 మరియు విదేశీ మారక ద్రవ్య మార్పిడి మరియు స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1974 (COFEPOSA), మరియు కింద జతపర్చిన శాఖల కార్యాలయాలకు చెందిన వ్యవహారాలు:

a) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

b) సెంట్రల్ ఎకనమిక్ ఇంటలెజిన్స్ బ్యూరో (CEIB)

c) రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు

d) SAFEM (FOP) A మరియు NDPSA కింద నియమించబడిన పోటీపడుతున్న అధికారులు

e) ఫ్యాక్టరీల ప్రధానాధికారి

f) కేంద్ర మాదక ద్రవ్యాల బ్యూరో

g) కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీసుల పన్ను పునర్విచారణాధికార ట్రిబ్యునల్ * CESTAT

h) జప్తు చేయబడిన ఆస్తికోసం పునర్విచారణాధికార ట్రిబ్యునల్(ATFP)

i) పన్నులు మరియు కేంద్ర ఎక్సైజ్ కమిషన్ (CCESC)

j) ఆదాయ పన్ను పరిష్కార కమిషన్ (ITSC)

k)కస్టమ్స్ మరియు కేంద్ర ఎక్సైజ్ కోసం ముందస్తు ఆదేశాల అథారిటీ (AAR)

l)ఆదాయపన్ను కోసం ముందస్తు ఆదేశాల అధారిటీ (AAR)

m) జాతీయ సామాజిక మరియు ఆర్థిక సంక్షేమ ప్రోత్సాహక కమిటీ (NCPSEW)

n) ఆర్థిక ఇంటలిజెన్స్ విభాగం, భారత్ (FIU-IND)

o) పరిష్కార కమిషన్ (ఆదాయ పన్ను/సంపద పన్ను)

p) ఆదాయ పన్ను మధ్యవర్తి

విజిలెన్స్ శాఖ, భారతీయ సెక్యూరిటీలు & ఎక్చేంజ్ బోర్డు, మాదకద్రవ్యాల నిరోధక బ్యూరోతోపాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు భారతీయ ప్రభుత్వ ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన పలు విభాగాలలో కూడా వీరు నియమించబడతారు. పాలనాపరమైన సేవా చాతుర్యం ఆలస్యంగా అయినా సరే ఇప్పుడు గుర్తింపు సాధించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్లలో ఒకరైన టి.ఎస్ కృష్ణమూర్తి భారత ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన మొట్టమొదటి IRS అధికారిగా పేరు గాంచారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రస్తుత సభ్యులలో ఒకరు కూడా IRS సభ్యులే.

'

[మార్చు] హోదాలు & కెరీర్ పురోగతి

ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారుల కాల వ్యవధి:

స్థానం / భారత ప్రభుత్వంలో వేతన గ్రేడ్ స్థాయి మరియు ర్యాంకు పూర్వ ఆదేశం
(పూర్వ ఆదేశం ప్రకారం)
1 జూనియర్ కాలవ్యవధి ఎంట్రీ-లెవల్ (ప్రొబేషనర్) / సహాయ కమిషనర్ --
2 సీనియర్ టైమ్ స్కేల్ డిప్యూటీ కమిషనర్ భారత ప్రభుత్వ కార్యదర్శి పదవికి (సరిసమానమైనది) --
3 జూనియర్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ జాయింట్ కమిషనర్ / జాయింట్ డైరెక్టర్ పదవి భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి పదవికి (సరిసమానమైనది) --
4 ఎంపిక గ్రేడ్ అదనపు కమిషనర్ పదవి భారత ప్రభుత్వ డైరెక్టర్ పదవికి (సరిసమానమైనది) --
5 సీనియర్ అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ కమిషనర్ పదవి భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పదవికి (సరిసమానమైనది) 24
6 హయ్యర అడ్మినిస్ట్రేటర్ గ్రేడ్ ప్రధాన కమిషనర్ పదవి భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి పదవికి (సరిసమానమైనది) 25
7 అపెక్స్ స్కేల్ / HAG+ ఛైర్మన్ / బోర్డు & ట్రిబ్యునల్ సభ్యులు - భారత ప్రభుత్వ అధికారిక ప్రత్యేక కార్యదర్శి
(బోర్డులలో అత్యున్నత ర్యాంకు )
26

[మార్చు] కెరీర్ అవకాశాలు

వీరికి వచ్చే వేతనం ప్రైవేట్ రంగంలో కంటే చాలా తక్కువే అయినప్పటికీ, అధికారుల అత్యున్నత ప్రతిభ, పోటీతత్వం, అసమాన అధికారం, ప్రోత్సాహకాలు మరియు ప్రతిష్ఠ ఈ పదవికి వీరిని సంసిద్ధులను చేస్తాయి. దేశాభివృద్దికి, ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యకలాపాలకు మూలమైన ఆదాయాన్ని పోగు చేయడానికి నేరుగా దోహదపడుతున్నామనే అదనపు సంతృప్తిని ఈ విభాగం అధికారులు అనుభూతి చెందుతుంటారు. మొత్తం 4000 మంది (ప్రత్యక్ష పన్నులు) మరియు అదనంగా 2500 మంది (పరోక్ష పన్నులు)తో కూడిన బలం యొక్క వాస్తవికత నుండి ఈ అధికారుల దోహదాన్ని లెక్కించవచ్చు, భారత ప్రభుత్వ రాబడులలో (పన్నులు) 85% సేకరణకు వీరే బాధ్యత వహిస్తున్నారు (ఇది రూ.7000 బిలియన్‌ల దాకా ఉంటుంది – ఇది GDPలో 10.5%. ప్రస్తుతం భారత జనాభాలో 3% మాత్రమే పన్ను పరిధిలోకి వస్తోంది. అదేవిధంగా, పన్ను వలయంలో చాలా కొద్ది సేవలే ఉన్న కారణంగా సేవా పన్ను అనేది చాలా ఆలస్యంగా ప్రారంభమయింది. ఆర్థిక వ్యవస్థ విజృంభిస్తుండంతో, ప్రభుత్వ వ్యవహారాల్లో IRS ప్రముఖ పాత్ర వహించడానికి సన్నద్ధమవుతోంది. దేశం మరింతగా సరళీకరించబడుతున్నందున, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ముఖ్యపాత్ర వహిస్తుండటంతో ఆర్థిక శక్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మారనుంది. అందుచేత, IRS అధికారులు ప్రైవేట్ పరిశ్రమ మరియు ప్రభుత్వం మధ్య పరస్పర చర్యా బిందువు కాబోతున్నారు. ది ఎకనమిక్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదికలో ఈ విషయం గుర్తించబడింది, అనేక ఆర్థిక, ద్రవ్య విధాన కేంద్రాలను, క్షేత్ర రూపకల్పనను నిర్వహించడంలో వీరికి ఉన్న విస్తృతమైన అనుభవం దృష్ట్యా, ప్రైవేట్ రంగంలో IRS అధికారులకు అధిక డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.

అతి తక్కువ రాజకీయ జోక్యం, స్థిరమైన పదవీకాలం మరియు మెట్రోపాలిటన్ నగరాలలో ఉద్యోగాలు కారణంగా అభ్యర్థులు ఇతర కీలక సర్వీసుల కంటే IRSకే ప్రాధాన్యం ఇస్తుంటారు.

[మార్చు] సవాళ్లు

ఇతర ప్రభుత్వ సర్వీసుల్లాగే, ఈ విభాగంపై కూడా 2009లో CBI దాడులతో సహా, అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.[1][2] ఇటీవలి కాలంలో ఒక సీనియర్ IRS అధికారిని 1993 ముంబై దాడుల్లో అతడి పాత్రకు గాను ముంబై TADA కోర్టు దోషిగా నిర్ధారించింది.

ఎలెక్ట్రానిక్ టెక్నాలజీలను ఉపయోగించే స్వయంచలిత ఇంటర్‌ఫేస్‌ల ప్రవేశం వల్ల వ్యవస్థలో ఇలాంటి లోపాలను గణనీయంగా తగ్గించవచ్చు.

ఒక IRS అధికారి పన్ను రిటర్న్‌ల అంచనాను (ఆదాయపన్ను, కేంద్ర పన్ను మరియు సేవా పన్నులోలాగా) లేదా ఎగుమతి మరియు దిగుమతి సరుకులతో సంబంధంలో సరిహద్దు నియంత్రణ (కస్టమ్స్‌లో వలే) కర్తవ్యాలను చేపడతాడు. దీనికి దీర్ఘకాలిక నిర్ధారణలు, విచారణలు మరియు దర్యాప్తుల అవసరముంది.

ఈ కర్తవ్యంలో సహాయం అందించడంలో ఒక IRSకు పరిమితమైన సిబ్బంది మాత్రమే ఉంటారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ రంగంలో ఉద్యోగుల తగ్గింపు అనేది దీనిపై తన ప్రభావం చూపింది. అయితే పదోన్నతి అవకాశాలు, ఉపనియామక పదవులు అధికారుల నైతిక శక్తిని ప్రధానంగా దెబ్బతీస్తున్నాయి, ఎందుకంటే ఇవి చాలావరకు IAS అధికారుల గుత్తాధిపత్యంలో ఉంటూ వచ్చాయి, ఇతర సర్వీసుల కోసం నిర్ణయాధికారం తీసుకునే స్థానంలో ఉంటున్నందువల్ల రెవెన్యూ శాఖలోని ముఖ్యమైన పదవులను కూడా వీరే కైవసం చేసుకున్నారు.

రెవెన్యూ కార్యదర్శి పదవి (రెవెన్యూ శాఖ కార్యనిర్వాహకాధిపతి) భారత ప్రభుత్వంలో ఒక అత్యంత ప్రభావశీలమైన పదవి & అతడు/ఆమెకు రెవెన్యూ శాఖలో తక్కువ అనుభవం & జ్ఞానం ఉన్నప్పటికీ IAS లాబీలో ఈ పోస్టు పట్ల అత్యంత ఆపేక్ష ఉంటోంది. ఈ రెండు సర్వీసులూ సరళీకరణ మరియు ప్రపంచీకరణ రూపంలో గత 15 సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్పు చెందుతున్నాయి.

[మార్చు] వీటిని కూడా చూడండి

  • భారత దేశంలో ప్రజాసేవ
  • అఖిల భారత సర్వీసు
  • CESTAT

[మార్చు] సూచనలు

[మార్చు] బాహ్య లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు