ఇంద్రుడు

వికీపీడియా నుండి
ఇరావతంపై ఇంద్రుడు - 18వ శతాబ్దానికి చెందిన తిరుచ్చినాపల్లి చిత్రం.

దేవేంద్రుడు (సంస్కృతం— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి మరియు కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.

విషయ సూచిక

[మార్చు] ఇంద్ర పదవి

సాధారణంగా ఇంద్రుడు అన్నది స్వర్గాధిపత్యము అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ ఇంద్రుడు అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది. ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికీ మారుతుంటుంది.

  • ఉత్తమ మన్వంతరములో సుశాంతుడు
  • రైవత మన్వంతరములో విభుడు
  • చాక్షుష మన్వంతరములో మనోజవుడు
  • సావర్ణి మన్వంతరములో బలి చక్రవర్తి

ఇంద్రపదవిని ధరించారు.

[మార్చు] వేదాలలో ఇంద్రుడు

[మార్చు] వృత్రాసుర వధ

[మార్చు] పురాణాలలో ఇంద్రుడు

పౌరాణిక కథలలో ఇంద్రుడు, సాధారణంగా రాక్షసులను ఎదిరించలేక ముఖ్యదేవతలను వేడుకొనేవాడిగా కనిపిస్తాడు. వారిద్వారా ఆయా రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. మరొక వైపు కొన్ని కధలలో ఇంద్రుడు దుష్టుడుగా, పాపకార్యాలు చేయువాడుగా చెప్పబడతాడు. అందమైన కన్యలను చెరబట్టడం, శాపాలకు గురికావడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని కథలు పుట్టుకొస్తుంటాయి.

[మార్చు] సినిమాల ద్వారా ఇంద్రుడు

సినిమాల ద్వారా ఇంద్రుని పాత్ర అందరికి సుపరిచితం. తెలుగు సినిమాలలో ముఖ్యంగా అధికభాగం పౌరాణిక మరియు జానపద సినిమాలలో ఉండే ఒక పాత్ర ఇంద్రుడు. ఇంద్రుని పాత్రను తెలుగు సినిమాలలో కొన్నిచోట్ల ఉదాత్తంగాను, మరికొన్ని చోట్ల హాస్యంగాను, భోగలాలసునిగాను మలిచారు.

ఇంద్రుడు ఒక ప్రధాన భూమిక పోషించిన కొన్ని సినిమాలు.

"http://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రుడు&oldid=726481" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు