ఇయాన్ బిషప్

వికీపీడియా నుండి

1967, అక్టోబర్ 24న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని బెల్మాంట్‌లో జన్మించిన ఇయాన్ బిషప్ (Ian Raphael Bishop) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1989 నుంచి 1998 వరకు ఇతడి వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 21 టెస్టు మ్యాచ్‌లలోనే తన తొలి 100 వికెట్లను సాధించాడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు ఔట్ స్వింగ్ బౌలింగ్ వేయడంలో నేర్పరి. 1991లో వెన్ను నొప్పి వలన 1991లో జట్టు నుంచి వైదొలిగినాడు. 1992లో మళ్ళీ పునరాగమనం చేసిననూ 1993లో మరో సారి గాయాలబారిపడి 1995 వరకు జట్టులోకి రాలేడు. గాయాల వల్ల క్రీడాజీవితానికి కోలుకోలేని దెబ్బతగిలింది. చివరికి 1998లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిస్క్రమించేనాటికి 43 టెస్టులలో 161 వికెట్లు సాధించాడు. వన్డేలలో 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 118 వికెట్లు పడగొట్టినాడు.

విషయ సూచిక

[మార్చు] టెస్ట్ క్రికెట్

ఇయాన్ బిషప్ తన క్రీడాజీవితంలో 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 24.27 సగటుతో 161 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 6 సార్లు సాధించాడు. టెస్టులలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 40 పరుగులకు 6 వికెట్లు. బ్యాటింగ్‌లో 12.15 సగటుతో 632 పరుగులు చేశాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ స్కోరు 48 పరుగులు.

[మార్చు] వన్డే క్రికెట్

బిషప్ 84 వన్డేలు ఆడి 26.50 సగటుతో 118 వికెట్లను పడగొట్టాడు. ఒకే వన్డేలో 5 వికెట్లను 2 సార్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 25 పరుగులకు 5 వికెట్లు. బ్యాటింగ్‌లో 16.19 సగటుతో 405 పరుగులు సాధించాడు. వన్డేలలో బిషప్ అత్యుత్తమ స్కోరు 33 (నాటౌట్).

[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్

1991 వరకు అత్యుత్తమ ప్రదర్శన చూపిన బిషప్ 1992 ప్రపంచ కప్ సమయంలో గాయం వల్ల జట్టులోకి రాలేడు. బిషప్ 1996లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు