ఇరాన్

వికీపీడియా నుండి

جمهوری اسلامی ايران
జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్
Flag of ఇరాన్ ఇరాన్ యొక్క చిహ్నం
నినాదం
పర్షియన్: Esteqlāl, āzādī, jomhūrī-ye eslāmī
(English: "Independence, freedom, (the) Islamic Republic")
జాతీయగీతం
Sorūd-e Mellī-e Īrān
ఇరాన్ యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
టెహ్రాన్
35°40′N, 44°26′E
అధికార భాషలు పర్షియన్
ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్
 -  Supreme Leader అలీ ఖుమైనీ
 -  President మహ్‌మూద్ అహ్మద్ నెజాద్
Revolution Overthrew Monarchy 
 -  Declared ఫిబ్రవరి 11, 1979 
విస్తీర్ణం
 -  మొత్తం 1,648,195 కి.మీ² (17th)
636,372 చ.మై 
 -  జలాలు (%) 0.7%
జనాభా
 -  2005 అంచనా 68,467,413 [1] (18th)
 -  1996 జన గణన 60,055,488 [2] 
 -  జన సాంద్రత 41 /కి.మీ² (128th)
106 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $561,600,000,000 (19th)
 -  తలసరి $8,065 (74th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.736 (medium) (99th)
కరెన్సీ Rial (ريال) (IRR)
టైం జోన్ (UTC+3.30)
 -  వేసవి (DST) not observed (UTC+3.30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ir
కాలింగ్ కోడ్ +98

ఇరాన్ (= పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది.1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు is a cognate of "ఆర్యన్" meaning "ఆర్య భూమి".

ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ) మరియు ఆర్మేనియా (35 కి.మీ) , ఉత్తరాన కాస్పియన్ సముద్రము , ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ) మరియు ఆఫ్ఘానిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ) మరియు ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు కలదు. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించినది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించినది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘానిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చినది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయువ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నవి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్ మరియు సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్ర్యమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినచి. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు మరియు తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.

16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాలు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా మరియు యునైటెడ్ కింగ్డమ్ నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగినది.

[మార్చు] సంస్కృతి

ఫర్హాంగ్ ("సంస్కృతి") అన్నివేళల పర్షియన్ నాగరికత కేంద్ర బిందువు.
ఫర్హాంగ్ ("సంస్కృతి") అన్నివేళల పర్షియన్ నాగరికత కేంద్ర బిందువు.

అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం మరియు ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సాంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.

[మార్చు] అధికారిక ప్రభుత్వ లింకులు

[మార్చు] బయటి లింకులు

మూస:Southwest Asia మూస:Middle East

"http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు