ఇళయరాజా
| ఇళయరాజా | |
| జననం | జూన్ 2, 1943 |
|---|---|
| స్వస్థలం | పన్నైపురం |
| నివాసం | చెన్నై,తమిళనాడు |
| ఇతర పేర్లు | జ్ఞానదేశికన్,మేస్ట్రో,ఇసైజ్ఞాని రాసయ్య,రాజా, |
| మతం | హిందూ |
| తండ్రి | రామసామి |
| తల్లి | చిన్నతాయి |
| వెబ్సైటు | www.raaja.com - అధికారిక సైటు |
ఇళయరాజా (జూన్ 2 1943 లో జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించారు) భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 4,000 పాటలకు, 800 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారత దేశంలోని, చెన్నై లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి). వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి
విషయ సూచిక |
[మార్చు] బాల్యం, విద్యాభ్యాసం
తమిళనాడు రాష్త్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న(పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారత దేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారత దేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.[1]
సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది. [2]
[మార్చు] సినిమా జీవితం
చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే పశ్చిమ బెంగాల్ కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా పని చేశాడు. [3][4][5]తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా పని చేశాడు.[6]. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు. [7] పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు.
[మార్చు] ప్రభావం
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేఛ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.[8][9] ప్రముఖ సినిమా దర్శకుడు మణిరత్నం మాటల ప్రకారం:
"ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు. "[10]
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు.[11] ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు మరియు నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.[12]
[మార్చు] సినిమాయేతర సంగీతం
ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలు రెండూ భారతీయ, పాశ్చ్యాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం "హౌ టు నేమ్ ఇట్" (1986) కర్నాటక సంగీతకారుడు త్యాగరాజుకు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాఁక్ లకు అంకితమిచ్చాడు. [13] రెండవ ఆల్బం "నథింగ్ బట్ విండ్"(1988), ప్రముఖ బాఁసురీ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఇంకా యాభై మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం, వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారుచేయబడింది. [14][15] "ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండొలిన్" అనే పేరుతో కొన్ని కృతులను కర్నాటక సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండొలిన్ విద్వాంసుడు మాండొలిన్ శ్రీనివాస్ రికార్డు చేశారు.[16]ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణమహర్షి స్ఫూర్తితో చేయబడిన "గురు రమణగీతం" (2004) సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం [17] "సింఫొనీ" సంపుటంలోని తిరువాసగం (పవిత్ర ఉచ్ఛారణ) తమిళ సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది.[18][19] ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత సంపుటం ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ "ది మ్యూజిక్ మెసయ్యా" (2006).[20]
[మార్చు] గౌరవాలు
ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన "దళపతి" చిత్రంలోని "చిలకమ్మా చిటికెయ్యంగ" పాట బి.బి.సి. వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. [21] టైమ్ మ్యాగజైన్ వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన నాయకుడు (1987) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
[మార్చు] అవార్డులు
ఇళయరాజా "సాగర సంగమం" (1984), "సింధు భైరవి" (1985) మరియు "రుద్రవీణ" (1989) చిత్రాలకు గాను జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు. 2004 లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2010 లో పద్మభుషణ్ ఆవార్డు ఆందుకున్నారు.
[మార్చు] తెలుగు సినీ ప్రస్థానం (సంగీత దర్శకుడిగా)
| సంవత్సరం | చిత్రం పేరు | నటీ నటులు | దర్శకుడు |
|---|---|---|---|
| 1977 | భద్రకాళి | శివ కుమార్, పండారీ బాయి మనోరమ | ఎ.సి. త్రిలోకచందర్ |
| 1978 | వయసు పిలిచింది | రజనీకాంత్, కమల్ హాసన్, జయచిత్ర | కె.బాలచందర్ |
| 1979 | అమ్మ ఎవరికైనా అమ్మే | రజినీకాంత్, శ్రీ ప్రియ | ఆర్.త్యాగరాజన్ |
| 1979 | ఊర్వశీ నువ్వే నా ప్రేయసి | ||
| 1979 | ఎర్ర గులాబీలు | కమల్ హాసన్, శ్రీదేవి | భారతి రాజా (డబ్బింగ్) |
| 1979 | పంచభూతాలు | ||
| 1979 | ధర్మయుద్ధం | రజినీకాంత్, శ్రీ దేవి | |
| 1979 | యుగంధర్ | ఎన్టీఆర్, జయసుధ | కె.ఎస్.ఆర్.దాస్ |
| 1980 | ఆమె కాపురం | ||
| 1980 | గురు | కమల హాసన్, శ్రీ దేవి | ఐ. వి.శశి |
| 1980 | కాళి | రజినీ కాంత్ | ఐ.వి.శశి |
| 1980 | కాళరాత్రి | నిళగళ్ రవి, మనోరమ | |
| 1980 | కొత్త జీవితాలు | గుమ్మడి, సుహాసిని | భారతి రాజా |
| 1980 | మాయదారి కృష్ణుడు | రజినీకాంత్ | ఆర్.త్యాగరాజన్ |
| 1980 | పసిడిమొగ్గలు | చంద్ర మోహన్, మధు మాలిని | దుర్గా నాగేశ్వర రావు |
| 1981 | అమావాస్య చంద్రుడు | కమల్ హాసన్, మాధవి, ఎల్ వి ప్రసాద్ | |
| 1981 | చిన్నారి చిట్టిబాబు | సుదర్శన్, కవిత | ఎన్. గోపాల క్రిష్ణ |
| 1981 | బాల నాగమ్మ | శరత్ కుమార్, శ్రీ దేవి | |
| 1981 | మౌనగీతం | ప్రతాప్ పోతన్, సుహాసిని | (డబ్బింగ్) |
| 1981 | ప్రేమ పిచ్చి | ||
| 1981 | సీతాకోకచిలుక | కార్తీక్, అరుణా | భారతీ రాజా |
| 1982 | అంగదుడు | ||
| 1982 | పూలపల్లకి | ప్రతాప్ పోతన్, ఆరుణ | హేమంబరద రావు |
| 1982 | టిక్ టిక్ టిక్ | కమల హాసన్, మాధవి | భారతి రాజా (డబ్బింగ్) |
| 1982 | తీర్పు | శివాజి గణేష్, సుజాత | కె. క్రిష్ణ మూర్తి |
| 1982 | నిరీక్షణ | భానుచందర్, అర్చన | బాలు మహేంద్ర |
| 1982 | యుగధర్మం | ||
| 1983 | అభిలాష | చిరంజీవి, రాధిక, రావు గోపాలరావు | ఎ.కోదండరామిరెడ్డి |
| 1983 | ఒప్పందం | ||
| 1983 | కొక్కొరొకో | ||
| 1983 | సాహసమే జీవితం | ||
| 1983 | రాజ్ కుమార్ | శోభన్ బాబు | |
| 1983 | సాగరసంగమం | కమల్ హాసన్, జయప్రద | కె. విశ్వనాధ్ |
| 1983 | సితార | సుమన్ , భానుప్రియ, శరత్ బాబు | వంశీ |
| 1983 | పల్లవి అనుపల్లవి | అనిల్ కపూర్, లక్ష్మి | మణిరత్నం (డబ్బింగ్) |
| 1983 | మంత్రిగారి వియ్యంకుడు | చిరంజీవి, తులసి, అల్లు రామలింగయ్య | బాపు |
| 1984 | గడుసు పిండం | ||
| 1984 | ఛాలెంజ్ | చిరంజీవి, విజయశాంతి, సుహాసిని | |
| 1984 | జల్సా రాయుడు | ||
| 1984 | టక్కరి దొంగ | ||
| 1984 | ప్రేమ సంగమం | ||
| 1984 | నువ్వా నేనా | ||
| 1984 | నూరవ రోజు | ||
| 1984 | న్యాయం | ||
| 1984 | మాయదారి మొగుడు | ||
| 1984 | మంచి మనసులు | భాను చందర్, రజని | |
| 1984 | మెరుపు దాడి | ||
| 1984 | వీరభద్రుడు | ||
| 1985 | ఆత్మ బంధువు | శివాజీ గణేశన్, రాధ | (డబ్బింగ్) |
| 1985 | ఆలాపన | భానుప్రియ, మోహన్ | వంశీ |
| 1985 | ఇల్లాలి శపథం | ||
| 1985 | జల్సా బుల్లోడు | కమల హాసన్, అంబిక | ఎస్.పి.ముత్తురామన్ |
| 1985 | జ్వాల | చిరంజీవి భానుప్రియ, రాధిక | రవిరాజా పినిసెట్టి |
| 1985 | ప్రజా పోరాటం | ||
| 1985 | ప్రేమించు పెళ్ళాడు | రాజేంద్రప్రసాద్ , భానుప్రియ | వంశీ |
| 1985 | దర్జా దొంగ | ||
| 1985 | మాంగల్య బంధం | ||
| 1985 | ముత్యాల జల్లు | ||
| 1985 | మొనగాడు మోసగాడు | ||
| 1985 | స్వాతిముత్యం | కమల్ హాసన్, రాధిక | కె. విశ్వనాధ్ |
| 1985 | సింధు భైరవి | శివ కుమార్, సుహాసిని | కైలాసం బాలచందర్ |
| 1986 | లేడీస్ టైలర్ | రాజేంద్రప్రసాద్ | వంశీ |
| 1986 | కిరాతకుడు | చిరంజీవి,సుహాసిని | ఎ.కోదండరామి రెడ్డి |
| 1986 | ధర్మపత్ని | ||
| 1986 | మౌనరాగం | మోహన్, కార్తీక్, రేవతి | మణిరత్నం (డబ్బింగ్) |
| 1986 | రాక్షసుడు | చిరంజీవి, రాధ, సుహాసిని | ఎ. కోదండరామి రెడ్డి |
| 1986 | శ్రీ షిర్డీ సాయి బాబా మహత్మ్యం | విజయచందర్,చంద్ర మోహన్ | కె>వాసు |
| 1987 | అన్వేషణ | భానుప్రియ, కార్తీక్, శరత్ బాబు | వంశీ |
| 1987 | ఆరాధన | చిరంజీవి, సుహాసిని | భారతి రాజా |
| 1987 | ఒక రాధ ఇద్దరు కృష్ణులు | కమల్ హాసన్, శ్రీదేవి | ఎ. కోదండరామి రెడ్డి |
| 1987 | చినబాబు | నాగార్జున | |
| 1987 | నాయకుడు | కమల్ హాసన్ | మణిరత్నం (డబ్బింగ్) |
| 1987 | మేనమామ | ||
| 1987 | రక్తాభిషేకం | ||
| 1987 | రెండు తోకల పిట్ట | ||
| 1987 | శ్రీ కనక మహాలక్షీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ | నరేష్, కోట శ్రీనివాసరావు | వంశీ |
| 1987 | సంకీర్తన | నాగార్జున, రమ్య క్రిష్ణ | గీతాక్రిష్ణ |
| 1988 | అభినందన | కార్తీక్, శోభన | అశోక్ కుమార్ |
| 1986 | ఆఖరి పోరాటం | నాగార్జున, శ్రీదేవి , సుహాసిని | కె. రాఘవేంద్ర రావు |
| 1988 | ఆస్తులు అంతస్తులు | రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ | |
| 1988 | ఘర్షణ | కార్తీక్, ప్రభు, అమల, నిరోషా | మణిరత్నం (డబ్బింగ్) |
| 1988 | మరణ మృదంగం | చిరంజీవి | |
| 1988 | మహర్షి | మహర్షి రాఘవ,శాంతి ప్రియ | వంశీ |
| 1988 | రుద్రవీణ | చిరంజీవి, విజయశాంతి | కె.బాలచందర్ |
| 1988 | వారసుడొచ్చాడు | వెంకటేష్, సుహాసిని | ఎ. మోహన గాంధీ |
| 1988 | స్వర్ణ కమలం | వెంకటేష్, భానుప్రియ | కె. విశ్వనాధ్ |
| 1988 | స్వాతి చినుకులు | శరత్ బాబు, జయసుధ | ఎన్.బి.చక్రవర్తి |
| 1989 | అశోక చక్రవర్తి | బాలకృష్ణ, భానుప్రియ | ఎస్.ఎస్. రవిచంద్ర |
| 1989 | ఇంద్రుడు చంద్రుడు | కమల్ హాసన్, విజయశాంతి | సురేష్ కృష్ణ |
| 1989 | కోకిల | నరేష్, శోభన | గీతాకృష్ణ |
| 1989 | గీతాంజలి | నాగార్జున, గిరిజ | మణిరత్నం |
| 1989 | గోపాలరావు గారి అబ్బాయి | రాజేంద్ర ప్రసాద్ | మణివణ్ణన్ |
| 1989 | చెట్టుకింద ప్లీడర్ | రాజేంద్రప్రసాద్, కిన్నెర | వంశీ |
| 1989 | డాన్స్ మాస్టర్ | కమల్ హాసన్, రేవతి | కైలాసం బాలచందర్ |
| 1989 | ప్రేమ | వెంకటేష్, రేవతి | సురేష్ కృష్ణ |
| 1989 | విచిత్ర సోదరులు | కమల్ హాసన్, గౌతమి | సింగీతం శ్రీనివాసరావు (డబ్బింగ్) |
| 1989 | రుద్రనేత్ర | చిరంజీవి,రాధ, విజయ శాంతి | కె. రాఘవేంద్ర రావు |
| 1989 | సత్య | కమల్ హాసన్, అమల | సురేష్ క్రిష్ణ (డబ్బింగ్?) |
| 1989 | శివ | నాగర్జున, అమల | రాంగోపాల్ వర్మ |
| 1990 | అంజలి | రఘువరన్, రేవతి | మణిరత్నం (డబ్బింగ్) |
| 1990 | ఇదేం పెళ్ళాం బాబోయ్ | (To be verified) | |
| 1990 | ఏప్రిల్ 1 విడుదల | రాజేంద్రప్రసాద్, శోభన | వంశీ |
| 1990 | ఓ పాపా లాలి | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక | వసంత్ (డబ్బింగ్) |
| 1990 | కొండవీటి దొంగ | చిరంజీవి, రాధ, విజయశాంతి | ఎ. కోదండరామి రెడ్డి |
| 1990 | గురు శిష్యులు | రజినీ కాంత్, ప్రభు | ఎస్.పి.ముత్తురామన్ |
| 1990 | చైతన్య | నాగార్జున, గౌతమి | |
| 1990 | జగదేకవీరుడు అతిలోకసుందరి | చిరంజీవి, శ్రీదేవి | కె. రాఘవేంద్ర రావు |
| 1990 | బామ్మ మాట బంగారు బాట | రాజేంద్ర ప్రసాద్, గౌతమి | |
| 1990 | బొబ్బిలి రాజా | వెంకటేష్, దివ్య భారతి | బి. గోపాల్ |
| 1990 | మైఖేల్ మదన కామరాజు | కమల్ హాసన్ | సింగీతం శ్రీనివాసరావు (డబ్బింగ్) |
| 1990 | సామ్రాజ్యం | మమ్ముట్టి | (డబ్బింగ్) |
| 1990 | సూర్య ఐ.పి.యస్. | వెంకటేష్, విజయ శాంతి | ఎ.కోదండరామి రెడ్డి |
| 1991 | ఆదిత్య 369 | బాల కృష్ణ, మోహిని | సింగీతం శ్రీనివాసరావు |
| 1991 | ఏప్రిల్ 1 విడుదల | రాజేంద్రప్రసాద్, శోభన | వంశీ |
| 1991 | కలికాలం | చంద్రమోహన్, జయసుధ | |
| 1991 | కిల్లర్ | నాగార్జున, నగ్మా | ఫాజిల్ |
| 1991 | కీచురాళ్ళు | భానుచందర్, శోభన | గీతాక్రిష్ణ |
| 1991 | కూలీ నెం.1 | వెంకటేష్, టబు | కె. రాఘవేంద్ర రావు |
| 1991 | ఖైదీ అన్నయ్య | ||
| 1991 | చంటి | వెంకటేష్, మీనా | రవిరాజా పినిశెట్టి |
| 1991 | దళపతి | రజనీకాంత్, మమ్ముట్టి | మణిరత్నం (డబ్బింగ్) |
| 1991 | శ్రీ ఏడుకొండల స్వామి | గోవింద్ డేవిల్,భానుప్రియ | కమలాకర కామేశ్వర రావు |
| 1991 | స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ | చిరంజీవి | యండమూరి వీరేంద్రనాథ్ |
| 1992 | అశ్వమేధం | బాల కృష్ణ, శోభన్ బాబు, నగ్మా, మీనా | కె. రాఘవేంద్ర రావు |
| 1992 | క్షత్రియ పుత్రుడు | కమల్ హాసన్, రేవతి, గౌతమి | భరతన్ (డబ్బింగ్) |
| 1992 | గుణ | కమల్ హాసన్ | సంతాన భారతి (డబ్బింగ్) |
| 1992 | చక్రవ్యూహం | సుమన్, అర్చన, గౌతమి | బాలు మహేంద్ర |
| 1992 | చామంతి | ప్రశాంత్, రోజా | (డబ్బింగ్?) సెల్వమణి |
| 1992 | చినరాయుడు | వెంకటేష్, విజయశాంతి | బి. గోపాల్ |
| 1992 | పట్టుదల | జి.బి.శేఖర్ | |
| 1992 | తొలిముద్దు | ప్రశాంత్, దివ్య భారతి | |
| 1992 | ధర్మక్షేత్రం | బాల కృష్ణ, దివ్య భారతి | ఎ.కోదండరామిరెడ్డి |
| 1992 | హృదయం | మురళి, హీరా | కధీర్ (డబ్బింగ్) |
| 1993 | రౌడీ జమీందారు | రజనీకాంత్ | ఎమ్.శరవణన్ (డబ్బింగ్) |
| 1993 | అమ్మ కొడుకు | రాజశేఖర్, ఆమని | వడ్డే రమేష్ |
| 1993 | ఆ ఒక్కటీ అడక్కు | రాజేంద్రప్రసాద్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, రంభ | ఇ.వి.వి. సత్యనారాయణ |
| 1993 | ఐ లవ్ ఇండియా | శరత్ కుమార్ | (డబ్బింగ్?) |
| 1993 | డిటెక్టివ్ నారద | మోహన్ బాబు, జగ్గయ్య, మోహిని | వంశీ |
| 1993 | మహానది | కమల్ హాసన్ | సంతాన భారతి (డబ్బింగ్) |
| 1994 | అల్లరి పోలీస్ | మోహన్ బాబు, మాలాశ్రీ | ఉప్పలపాటి నారాయణ్ రావు |
| 1994 | కుర్రాడు బాబోయ్ | ప్రభుదేవా, రోజా | (డబ్బింగ్) |
| 1994 | సమరం | సుమన్, రోజా | సెల్వమణి |
| 1995 | సతీ లీలావతి | కమల్ హాసన్, రమేష్ అరవింద్ | సంతాన భారతి(?) (డబ్బింగ్) |
| 1996 | కాలాపాని | మోహన్ లాల్, ప్రభు | ప్రియదర్శన్ (డబ్బింగ్) |
| 1996 | [[శ్రీకారం] | ఉమా మహేశ్వర రావు | |
| 1997 | చిన్నబ్బాయి | వెంకటేష్, రవళి | కె. విశ్వనాథ్ |
| 1998 | అంతఃపురం | సౌందర్య , ప్రకాష్ రాజ్ | కృష్ణవంశీ |
| 1999 | టైం | ప్రభుదేవా, సిమ్రాన్ | గీతాకృష్ణ |
| 1999 | రాజస్థాన్ | శరత్ కుమార్ | ఆర్.కె. సెల్వమణి (డబ్బింగ్) |
| 2000 | హే రామ్ | కమల్ హాసన్, [[రాణి ముఖర్జీ | కమల హాసన్ (డబ్బింగ్) |
| 2003 | నిను చూడక నేనుండలేను | సచిన్ | శ్రీనివాస్ |
| 2003 | శంభు | ఆర్యన్ రాజేష్ | సురేష్ వర్మ |
| 2003 | శివపుత్రుడు | సూర్య, విక్రమ్ లైలా, సంగీత | బాలా (డబ్బింగ్) |
| 2003 | పోతురాజు | కమల్ హాసన్ | కమలా హాసన్ |
| 2003 | శివ్ శంకర్ | మోహన్ బాబు | కపుగంటి రాజేంద్ర |
| 2005 | మంబయ్ ఎక్స్ ప్రెస్ | కమల్ హాసన్, మనీషా కోయిరాలా | సింగీతం శ్రీనివాసరావు (డబ్బింగ్) |
| 2006 | శివ 2006 | మోహిత్ అహ్లావాట్, నిషా కొఠారి | రామ్ గోపాల్ వర్మ (డబ్బింగ్) |
| 2007 | అనుమానాస్పదం | ఆర్యన్ రాజెష్, హంస నందిని | వంశీ |
| 2007 | సన్నీ | కమలాకర్, అభిషేక్,సుభాషిని | కమలాకర్ |
| 2008 | మల్లెపువ్వు | భూమిక | వి. సముద్ర |
| 2011 | శ్రీరామరాజ్యం | నందమూరి బాలకృష్ణ | బాపు |
2012 || [[ yeto vellipoindi manasu || nani,samantha || goutham menon
[మార్చు] మూలాలు
- ↑ Available from: http://www.hinduonnet.com/fr/2004/07/09/stories/2004070902310400.htm. Accessed 19 November 2006.
- ↑ Available from: http://www.hinduonnet.com/2005/06/19/stories/2005061904010500.htm. Accessed 1 February 2007.
- ↑ Gautam, S. 2004. 'Suhana safar' with Salilda. The Hindu, Tuesday, Nov 13. Available from: http://www.hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm. Accessed 13 October 2006.
- ↑ Chennai, S. 2005. Looking back: flawless harmony in his music. The Hindu, Sunday, Nov 20. Available from: http://www.hindu.com/mag/2005/11/20/stories/2005112000340500.htm. Accessed 15 November 2006.
- ↑ Choudhury, R. 2005. The films of Salil Chowdhury: Introduction. Available from: http://www.salilda.com/filmsongs/films.asp. Accessed 16 November 2006.
- ↑ Vijayakar, R. 2006. The prince in Mumbai. Screen, July 21. Available from: http://www.screenindia.com/fullstory.php?content_id=13039. Accessed 6 February 2007.
- ↑ Ramnarayanan, G. 1989. Matchless in quality and speed! The Hindu, May 26. Available from: http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf. Accessed 13 October 2006.
- ↑ Mohan, A. 1994. Ilaiyaraja: composer as phenomenon in Tamil film culture. M.A. thesis, Wesleyan University (pp. 106-107).
- ↑ Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent. New York: Garland Pub. (p. 544).
- ↑ Rangaraj, R. 2005. Mani Ratnam on Ilayaraja, Rehman. ChennaiOnline, March 9th. Available from: http://www.chennaionline.com/film/Events/2005/03maniratnam.asp. Accessed 13 October 2006.
- ↑ Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). Intercultural Music Vol. I. Bayreuth: Breitinger (p. 110).
- ↑ Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). Intercultural Music Vol. I. Bayreuth: Breitinger (p. 111).
- ↑ Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent. New York: Garland Pub. (pp. 544-545).
- ↑ Oriental Records. Undated. Nothing But Wind. Available from: http://www.orientalrecords.com/productdetails.php?id=123. Accessed 19 November 2006.
- ↑ Amazon.com. 1996-2006. Nothing But Wind. Available from: http://www.amazon.com/dp/B0000C06OD/. Accessed 19 November 2006.
- ↑ Chennai Interactive Business Services (P) Ltd. Undated. Mandolin U. Srinivas plays Ilaiyaraaja's classics. Available from: http://shopping.chennaionline.com/newshop/audiovideo/prodpop.asp?value=AVMCD206. Accessed 6 February 2007.
- ↑ Ayyar,I. and Govindan, H. Undated. Ilaiyaraja: Guru Ramana Geetam — notes. Available from: http://cdbaby.com/cd/ilaiyaraja1. Accessed 19 November 2006.
- ↑ Viswanathan, S. A cultural crossover. Frontline 22 (15), July 16-29, 2005. Available from: http://www.hinduonnet.com/fline/fl2215/stories/20050729004110200.htm. Accessed 13 October 2006.
- ↑ Parthasarathy, D. 2004. Thiruvasagam in 'classical crossover'. The Hindu, Friday, Nov 26. Available from: http://www.hinduonnet.com/thehindu/2004/11/26/stories/2004112603032000.htm. Accessed 1 March 2007.
- ↑ Soman, S. 2006. 'The Music Messiah'. The Hindu, Saturday, Dec 30. Available from: http://www.hindu.com/2006/12/30/stories/2006123006000200.htm. Accessed 27 February 2007.
- ↑ BBC World Service. 2002. BBC World Service 70th Anniversary Global Music Poll: The World's Top Ten. Available from: http://www.bbc.co.uk/worldservice/us/features/topten. Accessed 13 October 2006.
[మార్చు] మరికొంత సమాచారం
- Prem-Ramesh. 1998. Ilaiyaraja: Isaiyin Thathuvamum Alagiyalum (trans.: Ilaiyaraja: The Philosophy and Aesthetics of Music). Chennai: Sembulam.
- Ilaiyaraaja. 1998. Vettaveli Thanil Kotti Kidakkuthu (trans.: My Spiritual Experiences) (3rd ed.). Chennai: Kalaignan Pathipagam. → A collection of poems by Ilaiyaraaja.
- Ilaiyaraaja. 1998. Vazhithunai. Chennai: Saral Veliyeedu.
- Ilaiyaraaja. 1999. Sangeetha Kanavugal (trans.: Musical Dreams) (2nd ed.). Chennai: Kalaignan Pathipagam. → An autobiography about Ilaiyaraaja's European tour and other musings.
- Ilaiyaraaja. 2000. Ilaiyaraajavin Sinthanaigal (trans.: Ilaiyaraaja's Thoughts). Chennai: Thiruvasu Puthaka Nilayam.
[మార్చు] బయట లింకులు
- సాధారణ సంప్రదింపులు
- Raaja.com: ఇది ఇలయరాజా గారి అదికారిక వెబ్ సైట్
- 1989 లో ఇళయరాజాగారి ఇంటర్వ్యూ (primary source: Indian news magazine Frontline)
- [http://www.geocities.com/ilaiyaragam/index.html ఇళయరాజాగారి పాటలు "రాగం" ప్రాతిపధికన విభజన)
Discographies
- For catalogues of film music albums categorised by film name, song name, singer etc., go to Raaja Information Center: Film Music Database or Rakkamma.com
- For a chronological listing of film music albums or a listing of film music albums by film genre (e.g., drama, romance, thriller), go to IMDb (by chronology) and IMDb (by film genre)
- A listing of this musician's non-film albums