ఇస్రా మరియు మేరాజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
16వ శతాబ్దంలోని పర్షియన్ చిత్రం మహమ్మదు ప్రవక్త మేరాజ్ ప్రయాణానికి వెళ్ళుట. ఇస్లాంలో మనుషుల చిత్రీకరణ నిషిధ్ధం, ముఖంకప్పి చిత్రించడం, అదో విడ్డూరం, అదియూ మహమ్మదు ప్రవక్తగారి చిత్రం!

ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా మరియు మేరాజ్ (అరబ్బీ : الإسراء والمعراج), అనునవి క్రీ.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు.</ref> మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు.[1] క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరా లో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.

  • ఇస్రా: మక్కా నగరంలోని కాబా లో మహమ్మదు ప్రవక్త విశ్రాంతి తీసుకొనుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై, అల్లాహ్ ఆజ్ఞతో బుర్రాఖ్ పై కూర్చుబెట్టుకొని, మక్కానుండి "సుదూరపు మస్జిద్" (జెరూసలేం లోని మస్జిద్-అల్-అఖ్సా) కు తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. ఇచ్చట ప్రవక్తల నమాజుకు ఇమామత్ చేశారు.
  • మేరాజ్: "సుదూరపు మస్జిద్" నుండి జిబ్రయీల్, మహమ్మదు ప్రవక్తను బుర్రాఖ్ పై కూర్చోబెట్టి, మేరాజ్ స్వర్గారోహణకై తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు.

ఈ ఆరోహణలో మహమ్మదు ప్రవక్త ఇతర ప్రవక్తలతో సంభాషిస్తాడు. అల్లాహ్ తోనూ సంభాషిస్తాడు. ఈ శుభఘడియలో అల్లాహ్ తన బహుమానంగా మహమ్మదు ప్రవక్తకు 5 పూటల ప్రార్థనలను (నమాజ్ లను) ప్రసాదిస్తాడు.

ఈ మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మరియు మేరాజ్' ఆరోహణనూ మరియు ప్రయాణాన్ని విశ్వాసులు నమ్ముతారు (అందులో అబూబక్ర్ ప్రథముడు), అవిశ్వాసులు నమ్మక గేలిచేస్తారు.

మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మేరాజ్' లను పునస్కరించుకొని ముస్లింలు షబ్-ఎ-మేరాజ్ లేదా లైలతుల్ మేరాజ్ పర్వాన్ని గడుపుకొంటారు. రాత్రంతా జాగారం చేసి నమాజ్ చేస్తారు.

ప్రయాణ విధము[మార్చు]

పెక్కు మంది ముస్లింలు ఈ ప్రయాణాన్ని 'భౌతిక (బొందితో) ప్రయాణ'మని నమ్ముతారు. కొందరైతే ఈ ప్రయాణం 'ఆత్మ పరమైన ప్రయాణం' (కల) అని భావిస్తారు. ఇస్లామీయ చరిత్రకారుడు ఇబ్న్ ఇస్ హాఖ్ ప్రకారం ఈ ప్రయాణం ఆత్మపర ప్రయాణం. హదీసుల ప్రకారం ఆయెషా సిద్దీఖా (మహమ్మదు ప్రవక్త గారి పత్ని) ఇలా చెప్పారు: "మహమ్మదు ప్రవక్త గారి ఆత్మ ఈ సుదూర ప్రయాణం (మేరాజ్) చేసింది" అని. కానీ అల్-తబరి మరియు ఇబ్న్ కసీర్ ల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది.[2] అబుల్ అలా మౌదూది ప్రకారం : "ఇతర హదీసుల ప్రకారం ఈ ప్రయాణం భౌతికమయినది", " ఆత్మపరమైన ప్రయాణమని విశ్వాసులు అంగీకరించరు".[3]

మస్జిద్ అల్-అఖ్సా, సుదూరపు మస్జిద్[మార్చు]

మేరాజ్ జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మస్జిద్ లేదు. అందుకే ఆ మస్జిద్ కు 'సుదూరపు మస్జిద్' లేక మస్జిద్-ఎ-అఖ్సా (అరబ్బీ భాష : المسجد الأقصى ) అని అంటారు. దీని వర్ణన ఖురాన్ 17:1, లో జరిగినది.ఈ మస్జిద్ జెరూసలేం లోని మస్జిద్ ల సమూహంలో గలదు. [4]

నవీన అల్-అఖ్సా మస్జిద్, మహమ్మదు ప్రవక్త నిర్యాణం తరువాత నిర్మింపబడింది.

నవీన ధృక్పదం[మార్చు]

ఇస్లాం లో పర్వదినమైన లైలతుల్-మేరాజ్, హిజ్రత్ కు ముందు తాయిఫ్ ప్రజలవద్దకు వెళ్ళకముందు జరిగినది. రజబ్ నెల 27వ తేదీన రాత్రి జరిగినది.

లైలతుల్-మేరాజ్ (అరబ్బీ: لیلة المعراج, లేదా షబ్-ఎ-మేరాజ్ అరబ్బీ شب معراج , ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా మరియు మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ ను కలవడానికి జిబ్రయీల్ తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్ మరియు మహమ్మద్ ల మధ్య సంభాషణ మరియు వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి. ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు. [5][6]

ఖురాన్ మరియు హదీసులు[మార్చు]

ఈ విషయంగూర్చి ఖురాన్ లో కొద్దిగా మాత్రంమే చర్చింపబడింది. హదీసులలో సంపూర్ణంగా వివరింపబడింది. ఇస్రా గూర్చి ఖురాన్ లోని 17వ సూరా అల్-ఇస్రా లో వర్ణింపబడింది. సూరా అన్-నజ్మ్ లో కూడా ఇస్రా మరియు మేరాజ్ గురించి వర్ణింపబడింది.[7]

ఖురాన్[మార్చు]

ఖురాన్ లో వర్ణనలు

QuoteQuran

—Glory to (Allah) Who did take His servant for a Journey by night from the Sacred Mosque to the farthest Mosque, whose precincts We did bless,- in order that We might show him some of Our Signs: for He is the One Who heareth and seeth (all things)., 102

QuoteQuran

—Behold! We told thee that thy Lord doth encompass mankind round about: We granted the vision which We showed thee, but as a trial for men,- as also the Cursed Tree (mentioned) in the Qur'an: We put terror (and warning) into them, but it only increases their inordinate transgression!, 102

QuoteQuran-range

—18, For indeed he saw him at a second descent, Near the Lote-tree beyond which none may pass: Near it is the Garden of Abode. Behold, the Lote-tree was shrouded (in mystery unspeakable!) (His) sight never swerved, nor did it go wrong! For truly did he see, of the Signs of his Lord, the Greatest!

హదీసులు[మార్చు]

హదీసులలో అతిముఖ్యమైన హదీసులు అనస్ బిన్ మాలిక్ (612-712) చే ఉల్లేఖించబడినవి. మహమ్మదు ప్రవక్త మేరాజ్ సమయంలో అనస్ బిన్ మాలిక్ యువకుడు.

ఇవీ చూడండి[మార్చు]

Notes[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]