ఈగ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈగలు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: ఆర్థ్రోపోడా
తరగతి: కీటకాలు
ఉప తరగతి: టెరిగోటా
Infraclass: నియోప్టెరా
Superorder: Endopterygota
క్రమం: డిప్టెరా
లిన్నేయస్, 1758
Suborders

Nematocera (includes Eudiptera)
Brachycera

ఈగ

ఈగలు (ఆంగ్లం: Fly) ఒక చిన్న కీటకాలు. నిజమైన ఈగలు డిప్టెరా (గ్రీకు: di = రెండు, and pteron = రెక్కలు), క్రమానికి చెందిన కీటకాలు. వీని ముఖ్య లక్షణం ఒక జత రెక్కలు మరియు ఒక జత హాల్టార్స్ ను కలిగి ఉండటం. ఇదే లక్షణం వీటిని తూనీగలు మొదలైన ఇతర ఎగిరే కీటకాల నుండి వేరుచేస్తాయి. కొన్ని నిజమైన ఈగలు రెక్కలు లేకుండా జీవించగలవు.

ఇది మానవ ఆవాసాలలో పెరుగుతూ ఉంటుంది. ఆహార పదార్థాలపై వాలడం ద్వారా అంటు వ్యాధులను వ్యాపిస్తాయి. నోటిలోని అవయువాలు ద్రవపదార్థ స్వాదనానికి అనుకూలంగా ఉంటాయి. లాలాజలంతో ఈగలు ఘన పదార్థాలను కూడా ద్రవపదార్థాలుగా మారుస్తాయి.

దీనికి ముళ్ళ వంటి పంకా ఉన్నందున పాలు, ఇతర పదార్థాలు ఉండే గ్లాసుల మీద కూడా వాలగలవు. దీని కాళ్ళపై సన్నని రోమాలుంటాయి. ఇవి కొంచెం తడిగా ఉండే ఆహార పదార్థాలపైనే వాలుతూనే ఉంటాయి.

ఆడ ఈగలు ఒక్కసారి వంద గుడ్లను పెడుతుంది. పన్నెండు గంటల్లోనే ఈ గ్రుడ్లు పొదగబడి కోశస్థ దశను చేరుకుంటుంది. ఈ కోశస్థను ప్యుపేరియం అంటారు. ఇది ఈగకు కవచంలా ఉంటుంది. దీని పగల గొట్టిన తర్వాతనే ఈగగా బయటకు వస్తుంది. రెండు వారాల వయస్సు నుంచే సంతానోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించే ఈగల ద్వారానే కలరా, జిగట విరేచనాలు వ్యాపిస్తాయి.

ఈగలు ఆహార పదార్థాల రుచులను ఎలా తెలుసుకుంటాయి?[మార్చు]

ఇతర ప్రాణుల్లాగా ఆహారాన్ని తీసుకొనే నోటిలోని భాగాల ద్వారా మాత్రమే ఈగలు ఆయా పదార్థాల రుచులు తెలుసుకోవు. ఈగల విషయంలో రుచి గ్రాహకాలు వాటి దేహమంతా వ్యాపించి ఉండే అతి సన్నని వెంట్రుకలపై కూడా ఉంటాయి. ఈ రుచి గ్రాహకాలు ఈగల రెక్కలు, కాళ్లు, పాదాలు, దేహం వెనుక భాగాలపై కూడా పరుచుకొని ఉంటాయి. (ఇంద్రుడికి ఒళ్లంతా కళ్లు ఉన్నట్లు) అందువల్ల ఈగల శరీర భాగాలు ఏ దిశలో ఆహారపు పదార్థాలను స్పర్శించినా వాటికి ఆ పదార్థాలు రుచిగా ఉన్నాయా లేదా అనే విషయం తెలిసిపోతుంది. మనలాగే ఈగలకు ఆహార పదార్థాలు తీయగా ఉన్నాయో, లేదో అనే విషయం వాటి గ్రాహకాల ద్వారా తెలుసుకుంటాయి.

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఈగ&oldid=1200377" నుండి వెలికితీశారు