ఈత పండు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఈత చెట్టు | |
|---|---|
| ఈతకాయలు | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | Liliopsida |
| Order: | Arecales |
| Family: | పామే |
| Genus: | ఫీనిక్స్ |
| Species: | ఫీ. సిల్వెస్ట్రిస్ |
| Binomial name | |
| ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్ (L.) Roxb., 1832 |
|
ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.
విషయ సూచిక |
లక్షణాలు [మార్చు]
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.[1]
ఉపయోగాలు [మార్చు]
- ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
- ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
- ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.
గ్యాలరీ [మార్చు]
-
Female flowers at Narendrapur near Kolkata, West Bengal, India.
-
Male flowers at Narendrapur near Kolkata, West Bengal, India.
-
Fruits and spines in the Yucatán, Mexico.
-
Lower trunk at Purbasthali in Bardhaman District of West Bengal, India.
-
Fruits in Karnataka, India.
మూలాలు [మార్చు]
- ↑ Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586