ఈము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈము
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: Struthioniformes
కుటుంబం: Casuariidae
జాతి: డ్రోమియస్
ప్రజాతి: D. novaehollandiae
ద్వినామీకరణం
Dromaius novaehollandiae
(Latham, 1790)
The Emu has been recorded in the areas shown in orange.
పర్యాయపదాలు

Dromiceius novaehollandiae

  • ఈము (ఆంగ్లం Emu) ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు.
  • ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరంపై దట్టంగా ఈకలు ఉంటాయి. ఇవి పొడుగాటి కాళ్ళతో 6 అడుగుల ఎత్తు, 45-50 కి.గ్రా. బరువుంటాయి. ఇవి 25-30 సంవత్సరాలు జీవిస్తాయి మరియు శాఖాహారులు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. వీటిని మాంసం, నూనె మరియు చర్మం కోసం మనదేశంలో కూడా పెంచుతున్నారు.

ఉపయోగాలు[మార్చు]

  • ఈము పక్షుల కొవ్వు నుండి ఖరీదైన నూనె తయారుచేస్తారు. ఇది కీళ్ళనొప్పులు, చర్మవ్యాధుల నివారణలో, ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది.
  • ఈము మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.
  • ఈము చర్మంతో దుస్తులు, చేతి సంచులు, బూట్లు తయారుచేస్తారు.

ఈము పెంపకం[మార్చు]

ఎమూ పక్షులు రేటైట్ (Ratite - అడుగుభాగం లేని వక్షశల్య జాతి) జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడ ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ మరియు ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం మరియు ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విస్తృతమైన పెంపక క్షేత్రాలలో (Rancher) మరియు తక్కువ వైశాల్యం గల ప్రదేశాలలో కూడ ఈ పక్షులను, అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, మరియు చైనా, ఎమూ పెంపకంలో ముందున్నాయి. ఎమూ పక్షులు, భారత దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా యిమిడి పోయాయి. [1]

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  1. ప్రగతిపీడియా జాలగూడు

"http://te.wikipedia.org/w/index.php?title=ఈము&oldid=1168332" నుండి వెలికితీశారు