ఈస్ట్ కాశీ హిల్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
East Khasi Hills జిల్లా
Khasi Hills
Meghalaya జిల్లాలు
Meghalaya రాష్ట్రంలో East Khasi Hills యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Meghalaya
ముఖ్యపట్టణం Shillong
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు 7
Area
 • మొత్తం 2,752
జనాభా (2011[1])
 • మొత్తం 824
 • జనసాంద్రత [[C
జనగణాంకాలు
 • అక్షరాస్యత 63.31%
 • లింగ నిష్పత్తి 1008
ప్రధాన రహదారులు NH-44, NH-40
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు కాశీ హిల్స్ జిల్లా ఒకటి. షిల్లాంగ్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,752 కి.మీ, జనసంఖ్య 824,059.2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు గారో హిల్స్ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. [2]

చరుత్ర[మార్చు]

తూర్పు కాశీ హిల్స్ జిల్లా కాశీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం విభజించి రూపుదిద్దబడింది. 1976 అక్టోబర్ 28న కాశీ హిల్స్ జిల్లా తూర్పు కాశీ మరియు పశ్చిమ కాశి జిల్లాలుగా విభజించబడింది. తూర్పు కాశి జిల్లా అదనంగా తూర్పు కాశీ మరియు రి-భోయ్ జిల్లాలుగా విభజించబడ్డాయి.

భౌగోళికం[మార్చు]

తూర్పు కాశీ హిల్స్ జిల్లాకు షిల్లాంగ్ కేంద్రంగా ఉంది. తూర్పు కాశీ హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రానికి మద్యభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 2,748 చ.కి.మీ ఉంటుంది. జిల్లా 25°07” & 25°41” ఉత్తర అక్షాంశం మరియు 91°21” & 92°09” తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

జిల్లా ఉత్తర సరిహద్దులో రి-భోయి మైదానాలు మొదలై క్రమంగా షిల్లాంగ్ పచ్చికబైళ్ళ వైపు సాగిపోతూ నదీ లోయలో కలిసిపోతుంది. తూర్పు కాశీ హిల్స్ జిల్లా దక్షిణ ప్రాంతంలో అత్యధికంగా కొండలతో సన్నని దారులు మరియు కనుమలతో నిండి ఉంటుంది. జిల్లా తూర్పు సరిహద్దులో జంతీ హిల్స్ జిల్లా, పడమర సరిహద్దులో పశ్చిమ కాశీ హిల్స్ జిల్లా ఉన్నాయి. జిల్లా నైసర్గిక పరిస్థితిలో నదీ లోయలతో కలిసిపోయిన షిల్లాంగ్ మైదానం ప్రధానమైనదిగా భావించవచ్చు. అలాగే షెల్లా భోలాగంజ్ , కమ్యూనిటీ మరియు రూరల్ డెవలెప్మెంటు బ్లాక్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. నగరానికి 10 కి.మీ దూరంలో షిల్లాంగ్ శిఖరం ఉంటుంది. పల్లెసీమల అందాలతో కూడిన ఎత్తైన పర్వతప్రాంతాలు ప్రకృతి సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ దృశ్యాలు రాష్ట్రానికంతటికీ గుర్తింపు తీసుకువచ్చాయి.

వాతావరణం[మార్చు]

The climate of the district ranges from temperate in the plateau region to the warmer tropical and sub-tropical pockets on the Northern and Southern regions. The whole of the district is influenced by the south-west monsoon which begins generally from May and continues till September. The weather is humid for the major portion of the year except for the relatively dry spell usually between December and March.

విభాగాలు[మార్చు]

నిర్వహణావిభాగాలు[మార్చు]

తూర్పు కాశీ హిల్స్ జిల్లా 8 ఉపవిభాగాలుగా విభజించబడింది.[3]

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
ఖతర్షనంగ్ లైత్‌క్రొ మాజ్రంగ్
East Khasi Hills Subdivisions Khatarshnong Laitkroh.png
మాకింర్యూ మాకింర్యూ
East Khasi Hills Subdivisions Mawkynrew.png
మాఫ్లాంగ్ మాఫ్లాంగ్
East Khasi Hills Subdivisions Mawphlang.png
మారింగ్‌క్నెంగ్ మారింగ్‌క్నెంగ్
East Khasi Hills Subdivisions Mawryngknang.png
మాసింరం మాసింరం
East Khasi Hills Subdivisions Mawsynram.png
మిల్లియం Mylliem మిల్లియం
East Khasi Hills Subdivisions Mylliem.png
పింసుర్‌స్ల పింసుర్‌స్ల
East Khasi Hills Subdivisions Pynsursla.png
షెల్లా భోలఘని చిరపుంజి
East Khasi Hills Subdivisions Shella Bholaganj.png

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 824,059,[2]
ఇది దాదాపు... కొమరోస్ జనసంఖ్యకు [4]
అమెరికాలోని సౌత్ డకోటా [5]
640 భారతదేశ జిల్లాలలో 478 వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత 292 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 24.68%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 1008:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అత్యధికం
అక్షరాశ్యత శాతం 84.7%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

సంస్కృతి[మార్చు]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • షిల్లాంగ్ ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాకు కేంద్రంగా ఉంది. అంతే కాక ప్రకృతి సౌందర్యంతో అలరారే షిల్లాంగ్‌లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
  • చిరపుంజి ఒకప్పుడు ఇది అత్యంత పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతంగా ఉండేది.
  • నాహ్‌కలికై జలపాతం చిరపుంజి వద్ద ఉన్న ఈ జలపాతం భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతంగా గుర్తించబడింది.
  • నాహ్స్ంగిథియాంగ్ జలపాతం
  • కింరెం జలపాతం
  • ఉమియం సరసు షిల్లాంగ్ మార్గంలో ఉన్న అతిసుందరమైన సరసు.
  • " మాలీనాంగ్ " గ్రామం పింసుర్లా బ్లాక్ సమీపంలో ఉన్న ఈ గ్రామం పరిశుద్ధతకు ప్రత్యేకత సంతరించుకుంది. పర్యాటక పత్రిక అయిన " డిస్కవరీ ఆఫ్ ఇండియా " ఈ గ్రామాన్ని

2013 లో ఆసియాలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా పేర్కొన్నారు. అలాగే 2005 లో భారతదేశంలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా కూడా గుర్తించబడింది. [6]

ప్రయాణవసతులు[మార్చు]

జిల్లా కేంద్రం మరియు మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన షిల్లాంగ్ జాతీయ రహదారి 44 మర్గంలో గౌహతి మరియు సిచార్ నగరాలతో అనుసంధానించబడి ఉంది. సమీపంలోని రైల్వే స్టేషన్ మరియు విమానాశ్రయం గౌహతీ నగరంలో ఉన్నాయి. షిల్లాంగ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న ఉంరోయిలో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ నిలవడామికి అవసరమైన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఇతర సామాగ్రి జీబులు, ట్రాక్టర్లు మరియు ట్రక్కులలో రవాణాచేయబడుతుంటాయి. షిల్లాంగ్ రాష్ట్రంలోని ఇతర భూభాగాలతో ఆటో వాహనాల రాకపోకలకు అనువైన చక్కగా అనుసంధానించబడుతుంది. అలాగే జిల్లాలోని అన్ని బ్లాకుల కేద్రాలు కూడా రహదారి మార్గాలతో అనుసంధానించబడి ఉన్నాయి. అయినప్పటికీ సుదూరప్రాంతాలలో ఉన్న గ్రామలకు రాకపోకల మార్గాలు దీనావస్థలో ఉన్నాయి. అలాగే చాలినంత రవాణా వసతులు కూడా లేవు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.census2011.co.in/news/536-east-khasi-hills-census-2011-highlights.html
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  3. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/MEGHALAYA.pdf. Retrieved 2011-09-29.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Comoros 794,683 July 2011 est." 
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. సంగ్రహించిన తేదీ 2011-09-30. "South Dakota 814,180" 
  6. Eco Destination, Department of Tourism, Government of Meghalaya

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]