ఉడిపి

వికీపీడియా నుండి

  ?ఉడిపి
కర్నాటక • భారతదేశం
ఉడిపి నగర స్వాగతద్వారం
ఉడిపి నగర స్వాగతద్వారం
ఉడిపిను చూపిస్తున్న పఠము
కర్నాటక రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పఠము
ఉడిపి పట్టణం
అక్షాంశరేఖాంశాలు: 13°21′N 74°45′E / 13.35, 74.75
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
68.23 కి.మీ² (26 చ.మై)
• 39 మీ (128 అడుగులు)
జిల్లా(లు) ఉడిపి
జనాభా
జనసాంద్రత
127,060 (2001)
• 286/కి.మీ² (741/చ.మై)
కౌంసిల్ ప్రెసిడెంటు శాంతా కృష్ణా నాయక్
కోడులు
పిన్‌కోడు
టెలీఫోను
వాహనం

• 576102
• +0820
• KA-20
వెబ్‌సైటు: www.udupicity.gov.in

అక్షాంశరేఖాంశాలు: 13°21′N 74°45′E / 13.35, 74.75

ఉడిపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడిపిలో ఉన్నది.

ఉడిపి జిల్లాను ఆగష్టు 1997లో యేర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడిపి, కుందాపూర్ మరియు కార్కళ్) కలిపి ప్రత్యేక ఉడిపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11,12,243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు మరియు కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడిపి మరియు దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.

విషయ సూచిక

[<small>మార్చు</small>] కృష్ణాలయం

ఉడిపి శ్రీకృష్ణుడు

ఉడుపి పూర్వపు పేరు శివ్వళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మాధవ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు), వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.

[<small>మార్చు</small>] అష్ట మఠాలు

బొమ్మ:Udupi balakrishna.jpg
ఉడిపి కృష్ణుడు

ఉడిపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడిపి రథవీదిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.

[<small>మార్చు</small>] ఉడుపి వంటకాలు

ఉడుపి వంటకాలు. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా ఉన్నవి. సాధారణము శాఖాహార వంటకాలలో ఉడిపి శైలి వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి.

[<small>మార్చు</small>] దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు

[<small>మార్చు</small>] ఇవి కూడా చూడండి

[<small>మార్చు</small>] బయటి లింకులు

కర్ణాటక జిల్లాలు

బగల్ కోట | బెంగుళూరు | బెంగుళూరు గ్రామీణ | బెల్గాం | బళ్లారి | బీదరు | బీజాపూర్ | చామరాజనగర్ | చికమగలూరు | చిత్రదుర్గ | దక్షిణ కన్నడ | దావణగెరె | ధార్వాడ | గదగ్ | గుల్బర్గా | హసన్ | హవేరి | కొడగు | కోలార్ | కొప్పళ | మాండ్య | మైసూరు | రాయచూరు | షిమోగా | తుముకూరు | ఉడిపి | ఉత్తర కన్నడ

"http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు