ఉత్పలమాల
వికీపీడియా నుండి
| పద్య విశేషాలు |
|---|
| వృత్తాలు |
| ఉత్పలమాల, చంపకమాల |
| మత్తేభం, శార్దూలం |
| తరళం, తరలము |
| తరలి, మాలిని |
| మత్తకోకిల |
| జాతులు |
| కందం, ద్విపద |
| తరువోజ |
| అక్కరలు |
| ఉప జాతులు |
| తేటగీతి |
| ఆటవెలది |
| సీసము |
విషయ సూచిక |
[మార్చు] ఉత్పల మాల
[మార్చు] ఉదాహరణ 1:
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
[మార్చు] లక్షణములు
భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
- ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
- యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
- ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు
[మార్చు] ఉదాహరణ 2
ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.