ఉపనిషత్తు

వికీపీడియా నుండి

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైష్ణవ
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి

  1. సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
  2. బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
  3. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
  4. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.



ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.

[మార్చు] ఉపనిషత్తుల సంఖ్య

ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

  • ఋగ్వేదానికి సంబంధించినవి - 10
  • కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
  • శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
  • సామవేదానికి సంబంధించినవి - 16
  • అధర్వణ వేదానికి సంబంధించినవి - 31

మొత్తం - 108


ఉపనిషత్తుల్లో ఐతరేయ, కౌశితకి, చాందోగ్య, కేన, తైత్తిరీయ, కఠ, శ్వేతోపనిషత్తు, బృహదారణ్యక, ఈశ, ముండక, ప్రశ్న, మాండూక్య ఉపనిషత్తులు ముఖ్యమైనవి.

దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:

ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా

[మార్చు] ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ

దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు.

ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.

లక్ష్యం ఆత్మ సాక్షాత్కారము
గురువుల స్థానం చాలా ఉన్నత స్థితిలో ఉండేది
భోధనా పద్దతులు శ్రవణం, మననం, నిధిధ్యాస(అనుభవం)
కులములు బ్రాహ్మణులు, క్షత్రియుల గురించి వివరములు కలవు, మిగిలిన రెండు కులముల గురించి వివరములు తెలీదు
స్త్రీ విద్య కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు
  1. ఈశావాస్యోపనిషత్తు
  2. కేనోపనిషత్తు
  3. కఠోపనిషత్తు
  4. ప్రశ్నోపనిషత్తు
  5. ముండకోపనిషత్తు
  6. మాండూక్యోపనిషత్తు
  7. తైత్తిరీయోపనిషత్తు
  8. ఐతరేయోపనిషత్తు
  9. ఛాందోగ్యోపనిషత్తు
  10. బృహదారణ్యకోపనిషత్తు

బొద్దు అక్షరాలు

[మార్చు] బయటి లింకులు

పాఠము:

అనువాదాలు:

వ్యాఖ్యలు, వివరణలు, ఇతర లింకులు:

పేజీకి సంభందించిన లింకులు