ఉపనిషత్తు
వికీపీడియా నుండి
(ఉపనిషత్తులు నుండి దారిమార్పు చెందింది)
|
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. |
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు |
|
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవ · వైష్ణవ | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము | |
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
- సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
- బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
- అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
- ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.
విషయ సూచిక |
[మార్చు] వ్యుత్పత్తి
- ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 12 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.
- ఉపనిషత్తుల అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి మరియు వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక మరియు అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద మరియు సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి, మరియు యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.
- మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష | లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగినది.
- ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు మరియు అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.
- భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.
[మార్చు] ఉపనిషత్తుల సంఖ్య
ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది
- ఋగ్వేదానికి సంబంధించినవి - 10
- కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
- శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
- సామవేదానికి సంబంధించినవి - 16
- అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)
[మార్చు] ముఖ్య ఉపనిషత్తులు
- మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
- (1) ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (2) కేనోపనిషత్తు (3) కఠోపనిషత్తు (4) ప్రశ్నోపనిషత్తు (5) ముండకోపనిషత్తు (6) మాండూక్యోపనిషత్తు (7) తైత్తిరీయోపనిషత్తు (8) ఐతరేయోపనిషత్తు (9) ఛాందోగ్యోపనిషత్తు (10) బృహదారణ్యకోపనిషత్తు
- దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:
-
- ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
- ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా
- మొదటి ప్రస్థానము దశోపనిషత్తులు గా, రెండవ ప్రస్థానము భగవద్గీత మరియు మూడవ ప్రస్థానము బ్రహ్మ సూత్రములు. ఈ మూడు ప్రస్థానములను కలిపి ప్రస్థానత్రయము అని పిలుచుదురు లేదా అందురు. ఇక్కడ ప్రస్థానము అనగా శాస్త్రము అని అర్ధము.
- వీటితోపాటు ( 11) శ్వేతాశ్వతర, (12) కౌశీతకి, (13) మైత్రాయణి ఉపనిషత్తులను కూడా చేర్చి 13 ముఖ్య ఉపనిషత్తులుగా వ్యవహరించడం కూడా పరిపాటి.
[మార్చు] మిగిలిన ఉపనిషత్తులు
- 14. బ్రహ్మ, 15. కైవల్య, 16. జబల, 17. హంస, 18. ఆరుణిక, 19. గర్భ, 20. నారాయణ, 21. పరమహంస, 22. అమర్తబిందు, 23. అమర్తనాద, 24. అథర్వాశిరస్, 25. అథర్వాశిక, 26. బృహజ్జబల, 27. నృసింహతపనీయ, 28. కళాగ్నిరుద్ర, 29. మైత్రేయ, 30. సుబల, 31. క్షురిక, 32. మంత్రిక, 33. సర్వసార, 34. నిరలాంబ, 35. సుకరహాస్య, 36. వజ్రశుచి, 37. తేజోబిందు, 38. నాదబిందు, 39. ధ్యానబిందు, 40. బ్రహ్మవిద్య, 41. యోగతత్త్వ, 42. ఆత్మబోధ, 43. నారదపరివ్రాజక, 44. త్రిశిఖీబ్రాహ్మణ, 45. సీత, 46. యోహచూడామణి, 47. నిర్వాణ, 48. మండలబ్రాహ్మణ, 49. దక్షిణామూర్తి, 50. శరభ, 51. స్కంద, 52. త్రిపద్విభూతి మహానారాయణ, 53. అద్వయతారక, 54. రామరహస్య, 55. రామతపనీయ, 56. వాసుదేవ, 57. ముద్గళ, 58. శాండిల్య, 59. పైంగళ, 60. భిక్షుక, 61. మహ, 62. శారీరక, 63. యోగశిఖ, 64. తురియాతీతావధూత, 65. సమన్యాస, 66. పరమహంస పరివ్రాజక, 67. అక్షమాళిక, 68. అవ్యక్త, 69. ఏకాక్షర, 70. అన్నపూర్ణ, 71. సూర్య, 72. అక్షి, 73. అధ్యాత్మ, 74. కుండిక, 75. సావిత్రి, 76. ఆత్మ, 77. పశుపతబ్రహ్మ, 78. పరబ్రహ్మ, 79. అవధూత, 80. త్రిపురతాపిని, 81. దేవి, 82. త్రిపుర, 83. కఠ (రుద్ర), 84. భావన, 85. రుద్రహృదయ, 86. యోగకుండలి, 87. భస్మజబల, 88. రుద్రాక్షజబల, 89. గణపతి, 90. దర్శన, 91. తారాశర, 92. మహావాక్య, 93. పంచబ్రహ్మ, 94. ప్రాణాగ్నిహోత్ర, 95. గోపాలతాపిని, 96. కృష్ణ, 97. యాజ్ఞవల్క, 98. వరాహ, 99. సాత్యాయన, 100. హయగ్రీవ, 101. దత్తత్రేయ, 102. గరుడ, 103. కలిసంతరణ, 104. జాబాలి, 105. సౌభాగ్యలక్ష్మి, 106. సరస్వతీరహస్య, 107. భవృచ, 108. ముక్తిక
[మార్చు] ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ
- దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.
- వేదములవలె ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి.
- ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.
- ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ మరియు పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాత్రుడు.
- భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును శంకరాచార్యుడు, ద్వైతమును మధ్వాచార్యుడు తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు.
- అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.
[మార్చు] కొత్త ఉపనిషత్తులు
- పైన 108 ఉపనిషత్తులని తెలిపినప్పటికీ కొత్త ఉపనిషత్తుల రచన జరుగుతూనే ఉంది. ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అప్పటికే ఉన్న ఉపనిషత్తులు కొత్త సిద్ధాంతంతో విభేదించిన సందర్భాలలో, సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 వ సంవత్సరములో డా. ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి: బష్కళ, ఛాగలేయ, ఆర్షేయ మరియు శౌనక ఉపనిషత్తులు.
- కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది.
- ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూక్ 1805 లో రచించడం జరిగింది.
[మార్చు] వేదాంతం
| లక్ష్యం | ఆత్మ సాక్షాత్కారము |
| గురువుల స్థానం | చాలా ఉన్నత స్థితిలో ఉండేది |
| భోధనా పద్దతులు | శ్రవణం, మననం, నిధిధ్యాస(అనుభవం) |
| కులములు | బ్రాహ్మణులు, క్షత్రియుల గురించి వివరములు కలవు, మిగిలిన రెండు కులముల గురించి వివరములు తెలీదు |
| స్త్రీ విద్య | కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు |
[మార్చు] బయటి లింకులు
- హిందూ ధర్మశాస్రాలు రాధాక్రిష్ణ
- Devanagari text in Wikisource
- GRETIL
- Sri Aurobindo, The Upanishads [1]. Sri Aurobindo Ashram, Pondicherry. 1972.
[మార్చు] 'అనువాదాలు
- The Upanishads Translated and Commentated by Swami Paramananda From the Original Sanskrit Text
- English translation of 108 Upanishads
- 11 principal Upanishads with translations
- Translations and Essays on the Upanishads at Hinduwebsite.com
- Upanishads at Sanskrit Documents Site
- Upanishad page from hindunet.org
- Translations of principal Upanishads at sankaracharya.org
- English translations of major Upanishads.
- Upanishads Vedanta Treatises in Hinduism
- Ishopanishad The complete text, with transliteration, word-for-word meanings, and commentary
- Sri Aurobindo, The Upanishads [2]. Sri Aurobindo Ashram, Pondicherry. 1972.
- Shweta-shwatrupanishad Bhashya, by Pandit Raghunath Vinayak Dhulekar
- Prashnapanishad Saral Bhashya, by Pandit Raghunath Vinayak Dhulekar
- Kathopnishad Saral Bhasyha, by Pandit Raghunath Vinayak Dhulekar
[మార్చు] వ్యాఖ్యలు, వివరణలు, ఇతర లింకులు:
- HinduWiki.Com - A collaborated wiki web site covering all aspects of Hinduism.
- Overview of 18 Upanisads; 108 main Upanisads
- Vaishnava explanation of Upanisads, list of Vaishnava commentaries
- The Upanishads (www.advaita-vedanta.org)
- Selections from the Upanishads
- Essence of Upanishads
- Weekly podcast on Vedic Chanting, Mantras, Vedic Mythology and stories from the Puranas
- Sacred-Texts (www.sacred-texts.com)
- The One and the Many: A Fundamental Philosophical Problem in the Prinicipal Upanishads by Georg Feuerstein, JOY: The Journal of Yoga, September 2002, Volume 1, Number 1