ఉప్పలపాటి ప్రభాస్ రాజు
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| ఉప్పలపాటి ప్రభాస్ రాజు | |
| జన్మనామం | ఉప్పలపాటి ప్రభాస్ రాజు |
|---|---|
| పుట్టినతేదీ | అక్టోబర్ 23 1979 (వయసు 32) |
| జన్మస్థలం | మద్రాసు, తమిళనాడు, భారతదేశం |
| నివాసం | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ |
| ఇతర పేర్లు | డార్లింగ్ |
| వృత్తి | నటుడు |
| ఎత్తు | 6'2 |
| వెబ్‌సైటు | http://www.darlingprabhas.com |
ఉప్పలపాటి ప్రభాస్ రాజు.ఇతడు ప్రభాస్ గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఇతను తెలుగు సినీ నటులలో ఒకడైన పొడుగువానిగా చెప్పుకోవచ్చు.
[మార్చు] నటించిన చిత్రాలు
- ఈశ్వర్
- రాఘవేంద్ర
- వర్షం
- అడవి రాముడు
- చక్రం
- ఛత్రపతి
- పౌర్ణమి
- బుజ్జిగాడు
- బిల్లా
- ఏక్ నిరంజన్
- డార్లింగ్
- మిస్టర్ పర్‌ఫెక్ట్
- రెబెల్
[మార్చు] వ్యక్తిగత జీవితం
ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు అక్టోబర్ 23, 1979 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అక్టోబర్ 23, 1979 న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ దక్షిణ స్టార్ మరియు రాజకీయవేత్త కృష్ణంరాజు ఉప్పలపాటి గారి తమ్ముడి సుపుత్రుడు.
[మార్చు] జీవన ప్రగతి
ప్రభాస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి 2001లో ఈశ్వర్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టాడు. 2003లో రాఘవేంద్ర అనే చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ ని ప్రముఖ తారాగణం లో ఒకడిగా నిలబెట్టాయి. ప్రభాస్ 2004లో ఎమ్.ఎస్.రాజు యొక్క వర్షం అనే చిత్రంలో త్రిష సరసన నటించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.