ఉప్పు
ఉప్పు (Salt) భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు.
విషయ సూచిక |
రకాలు [మార్చు]
- గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు
- అయోడిన్ ఉప్పు
- రాతి ఉప్పు (Rock salt)
- నల్ల ఉప్పు (Black salt)
ఆరోగ్యం [మార్చు]
- ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపు పోటు వచ్చే అవకాశం ఎక్కువ.
- జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పారిశ్రామిక ఉత్పత్తి [మార్చు]
ఉప్పు ముఖ్యంగా సముద్రపు నీటి నుండి తయారుచేయబడుతుంది. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), మరియు కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది.
50 శాతం తగ్గిన ఉప్పు ఉత్పత్తి [మార్చు]
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడాదికి ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవసరంకాగా, వాతావరణ్ పరిస్థితులు అనుకూలించక పోవడం వలన అందులో 50% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అని మద్రాసు సాల్ట్ కమిషనరు చెప్పారు. ప్రతి సంవత్సరం ఉప్పు పండించే సీజనులో (సమయం) వర్షాలు పడటంవలన, ఉప్పు ఉత్పత్తికి తీవ్రమైన్ అడ్డు కలుగుతుంది. ఉప్పు ఉత్పత్తిలో, మూడవ స్థానంలో ఉన్న, ఆంద్ర్హప్రదేశ్, నేడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయింది. 5 సెప్టెంబరు 1995 మంగళవారం నాడు నౌపడా (శ్రీకాకుళం జిల్లా) లో జరిగిన రాష్ట్ర ప్రాంతీయ ఉప్పు సలహా మండలి సమావేశానికి మద్రాసు సాల్ట్ కమిషనరు అద్యక్షత వహించారు. ఉప్పు భూములలో, రొయ్యల పెంపకం చేపడుతున్నారని, అందువల్ల ఉప్పు ఉత్పత్తి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఉప్పు పండేప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నౌపడాలో 6 పడకల పి.హెచ్.సి. ని 10 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు ఈ సమావేశం ఏకగ్రీవంగా అమోదింఛారు. అసిస్టెంట్ సాల్ట్ కమిషనర్ (కాకినాడ), హైదరాబాద్ (అడిషనల్) ఇండస్ట్రియల్ డైరక్టర్, టెక్కలి సబ్ కలెక్టరు, జిల్లా పౌర సరఫరా అధికారి, విశాఖపట్నం రైల్వే అధికారి, నౌపదా సాల్ట్ సూపరింటెండి, మరియు సాల్ట్ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉప్పు సత్యాగ్రహం [మార్చు]
భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన భాగం మహాత్మా గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం.
ఉప్పు వివరాలు [మార్చు]
|
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఉప్పు అత్యంత ముఖ్యమైనది, అత్యంత విలువైనది, ఆతి సరసమైనది ఆహార పదార్థాలలో ఏదైన వున్నదంటే అది ఉప్పు. మాత్రమె. వంట ఎంత బాగా చేసినా అందు కొంచెం ఉప్పు చేర్చనిదే దాని రుచి రాదు. ఏ కూర లేకున్న అన్నంలో నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకుంటె ఆ పూట గడిపేసె బడుగు జీవులెందరో వున్నారు. షడ్రుచుల్లో ఒక దాని రుచిని నియంత్రించె శక్తి మరొక దానికి లేదు ఒక్క ఉప్పు కు తప్ప. అందుకే ఉప్పు ని రుచుల్లో రారాజు అన్నారు. ఇప్పుడు ఉప్పు విరివిగా దొరకడం వల్ల ఇది చాల చవక. కాని ఒకప్పుడు ఉప్పు ఎంతొ విలువైనది. ఉప్పు ని బంగారం లాగ చూసేవారు. రాజుల కాలంలో ఉప్పు ద్రవ్వంగా వాడ బడి నట్లు తెలుస్తున్నది. ఉప్పు రాజ్యాలని నిర్మించింది అలాగె రాజ్యాలను కూల్చి వేసింది కూడ. అంతటి ఘన చరిత్ర ని గురించి తెలుసుకోవడం ఎంతైనా ఆవసరం:
'ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా".......అని ఉప్పు విలువను గొప్ప గా చెబితే, "వీడు ఉప్పు రాతికి కూడ కొరగాడు" అనే నానుడి ఉప్పు అతి చవక అనే విషయాన్ని తెలియ జేస్తుంది.
ఉప్పు ఎలా తయారు చేస్తారు? [మార్చు]
భూగోళంపై మూడొంతులు నీరె అనే విషయం అందరికి తెలిసినదే. ఆనీరంతా ఉప్పు నీరె అనే సంగతి కూడ అందరికి తెలిసినదే. ఆ ఉప్పు నీటిని మడులలో సూర్య రస్మి తో ఇగర బెట్టి ఉప్పు తయారు చేస్తారు. కాని అన్ని ప్రాంతాలలోని సముద్రం నీరు తో అలా ఉప్పును తయారు చేయలేరు. ఆ నీటిలో ఉప్పు సాంద్రత తగినంత ఉండాలి. భూమిలో గనులనుండి కూడ ఉప్పును త్రవ్వి తీస్తారు. అలా తీసిన ఉప్పును రాతి ఉప్పు లేదా సైందవ లవణం అంటారు. ఆయుర్వేద వైద్యంలో దీని ఉపయోగం ఎక్కువ. కొన్ని ప్రాంతాలలో ఉప్పు నీటిని పాత్రలలో పోసి మరగ బెట్టి ఇగర బెట్టి ఉప్పును తయారు చేస్తారు. సామాన్యంగా డిసెంబరు లో ఉప్పు మడులను తయారు చేస్తారు. మడులను చదునుగా తయారు చేసి గట్టి పరుస్తారు. బాగ ఆరబెట్టిన తరువాత ఉప్పునీటిని మడులలోకి యంత్రాలద్వార మల్లిస్తారు. ఎండకు ఆ మడుల లోని నీరు ఆవిరి అయి ఉప్పు స్పటికాలు గా ఎర్పడు తుంది. వాతావరణం అనుకూలంగా వుంటే సుమారు నలబై రోజులలో ఉప్పు తయారు అవుతుంది. తయారైన ఉప్పును పక్కనే కొంచెం ఎత్తైన ప్రదేశంలో రాసులుగా పోసి పైన కప్పు వేస్తారు. తిరిగి మడులలో ఉప్పు నీటిని నింపుతారు. ఉప్పు మడి తయారు చేసిన తరువాత మొదటి పంట కన్నా రెండో పంట కొంత స్వచ్చంగా ఉంటుంది. మొదటి పంట లో మడిని తయారు చేసి నప్పుడు కొంత మలినాలుండి ఉప్పు కు రంగులో తేడా వుంటుంది.
ఉప్పు ఉపయోగాలు [మార్చు]
ఉప్పు ఉపయోగాలు అనంతం, ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే: గొంతు గరగరకు, ఎడతెరపలేని దగ్గుకు ఉప్పు నీటి వాడకం సార్వత్రికమే. విషాహారం తిన్నవారికి మొదట ఇచ్చేది ఉప్పు నీరె. ఉప్పు మంచి వమన కారి. ఉప్పు కలిపిన పండ్ల పొడి మంచిది. ఇప్పుడు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. శరీరం పై కలిగిగ గాయాలకు ముందు ఉప్పు నీటి తో కడగ మంటారు. కళ్ళు పుసులు కడితే ఉప్పు నీటి తో కడగ మంటారు. ఇది మంచి ప్రాధమిక చికిస్త. ఉప్పు నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తే మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది. మనుషులకే కాదు చెట్లకు కూడ ఉప్పు ఉపయోగముంది. కొబ్బరి చెట్లకు మువ్వ తెగులుకు ఉప్పు వాడతారు. వంగ మొక్కజొన్న వంటి పంటలకు సోడియం క్లోరైడ్ ను ఎరువుగా వాడతారు. జంతువులకు, వివిధ రకాల వనమూలికల తో చేసిన పొడిని ఉప్పు కలిపి తినిపిస్తారు. దాన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది ఆవులకు, గొర్రెలకు చాల దివ్వ ఔషదం. మామూలు కూరల్లోనె కాదు స్వీట్లు, బ్రెడ్, బిస్కట్, పిజ్జాలు, ఐస్క్రీంలు, జంకు వుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, ఇలా అన్నింటిలోను రుచి కొరకు, నిల్వ కొరకు ఎంతో కొంత ఉప్పు వాడాల్సిందె. 1675 లో బ్రిటిష్ లో ఉప్పు పై అధిక పన్నుకు ప్రతి కూలంగా ప్రజా పొరాటం జరిగింది. బ్రిటిష్ పాలకులు ఉప్పు తయారి పై సుంకం విధించి నందున దానికి వ్యతిరేకంగా మహాత్మ గాంధి నడిపించిన "ఉప్పు సత్యాగ్రహం" స్వాతంత్రోద్యమంలో ఎంతో ప్రధాన ఘట్టమనే సంగతి తెలియని వారుండరు. కొన్ని ప్రాంతాలలో శవాలను ఖననం చేసేటపుడు తప్పని సరిగా ఉప్పును కూడ వేస్తారు. మన దేశంలో ఉప్పును అప్పుగా ఇవ్వకూడదనె నియమంకూడ వున్నది. ఉప్పును చేతికి ఇవ్వరు ......... తీసుకోరు, (నూనెలకు కూడ ఈ నియమం ఉన్నది) ఉప్పును దొంగలించరు. ఇలా ఉప్పుకు సంబందించిన కొన్ని ఆచారాలున్నాయి.
ఉప్పు వల్ల ఉపయోగాలేమంటే ఉప్పు వేసిన వంటలు త్వరగా ఉడుకుతాయి. దానివలన ఇందనం, సమయం ఆదా. ఉప్పు నీరు వంద డిగ్రీల వద్ద మరిగి ఆవిరై పోదు. సున్న డిగ్రీల వద్ద గడ్డ కట్టి పోదు. ఒకరి మీద కృతజ్ఞత చెప్ప డానికి "మీ ఉప్పు తిన్న వాడిని" అంటారు గాని "మీ తిండి తిన్న వాణ్ణి" అనరు. అదే ఉప్పు ఘనత. ఉప్పు ఘనత కారణంగా కొన్ని నగరాలు వెలిశాయి. బ్రిటన్ లోని లివర్ పూల్నిన్న నగరం. ఉప్పు ఎగుమతితో అనారం చిన్న స్థాయి నుండి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. ఆస్ట్రియా లోని శాల్జ్ బర్గ్ నగరాన్ని ది సిటి ఆఫ్ సాల్ట్ అని పిలుస్తారు, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు ఉప్పును జీతంగా ఎచ్చేవారు. ఇంకొన్ని ప్రాంతాలలో ఉప్పును మారకద్రవ్యంగా వాడారు. ఆ హార పదార్థాల నిల్వకు అతి సులువైన మార్గం ఉప్పులో ఊర వేయటం. ఊరగాయలు, చేపలు, మాంసం మొదలగునవి ఉప్పులొ నిల్వ తో ఎగుమతిలో జరిగే జాప్యాన్ని తట్టు కుంటాయి. ఉప్పుని పారిశ్రామిక ఉత్పత్తుల్లొ ఎక్కువ గా వాడతారు. ఎన్నో పార్మాసూటికల్స్ తయారికి ఉప్పే ముఖ్యమైన ముడి సరుకు. కీలక రసాయానాలను తయారు చేయడానికి ఉప్పే ముడి సరుకు. వాటితో ఫార్మాసూటి కల్ మందులు, మైక్రో చిప్ లు, ఆప్టికల్ ఫైబర్లు, కేబుల్సు, ప్లాస్టిక్ పైపులు మొదలగు వేల రకాల వస్తువుల తయారికి ఉప్పు అత్యవసరం. దృవ ప్రాంతాల దేశాలలో కొన్ని సీజన్లలో మంచు దారాపాతంగ కురుస్తుంది. నేలంతా గడ్డ కట్టిన మంచుతో పేరుక పోతుంది. రోడ్లపై అతుక్కు పోయిన మంచును పెకలించి తొలిగించడం చాల కష్టం. దాంతో రోడ్ల పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోతాయి. ఆమంచును తొలగించడానికి ఉప్పే శరణ్యం. ఎలాగంటే మామూలు నీటి లాగ ఉప్పు నీరు సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టదు. కనుక రోడ్డుపై ఉప్పు నీరు చల్లితే కురిసిన మంచు గడ్డ కట్టినా రోడ్డుకు అతుక్కొనదు. మంచుకు, రోడ్డుకు మద్యన ఉప్పు నీటి పొర వున్నందున మంచు రోడ్డు కు అతుక్కోదు. అంచేత దాన్ని తొలిగించడము చాల సులబం. అటు వంటి దేశాలలో ఉప్పును ఎక్కువగా వాడేది రోడ్లపై నున్న మంచును తొలగించడానికే. అందుకని రహదారుల వెంబడి పెద్ద పెద్ద ఉప్పు నిల్వ ఉన్న గిడ్డంగులుంటాయి. మంటలను ఆర్పడానికి కూడ ఉప్పును వినియోగిస్తారు. మంటలలోని వేడిని ఉప్పు గ్రహిస్తుంది. అది ఆక్సిజన్ తో సంయోగం చెంది ఆప్రదేశంలో ఆక్సిజన్ తగ్గి మంటలను ఆర్పడానికి దోహద పడుతుంది. అగ్గికి విరొది నీరే కాదు ఉప్పు కూడా. అందుకే ఉప్పు---నిప్పు అంటారు. " వారిద్దరు ఉప్పు నిప్పు" అనే సామెత అందుకే వచ్చంది.
ఉప్పు వల్ల అన్నీ ఉపయోగాలేనా అంటే అదేంకాదు. ఉప్పు అధికమైతే అరోగ్య పరంగా అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అధిక రక్త పోటుకు మోతాదు మించిన ఉప్పే కారణమని వైద్యులు అంటున్నారు. తద్వార వచ్చె అనేక గుండె జబ్బులకు పరోక్షంగా ఉప్పే కారణం అని వైద్యులు తేల్చి చెప్పుతున్నారు. ఆమద్యన న్యూయార్కులో నగర పాలకులు హోటళ్లలో ఏ వంటలోను వుప్పు వేయ కూడదని అలా వేస్తే జరిమానా విధిస్తామని ఉత్తర్వులిచ్చారు. తినేవారు తమకు కావలసిన ఉప్పును వారె వేసుకుంటారని . ఇదంతా ప్రజారోగ్య పరి రక్షణకె నని వారి వాదన.
ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఉప్పు గురించి అన్ని విషయాలు వివరంగా అందించడానికి ప్రముఖ ఉప్పు తయారీ దారులంతా కలిసి "సాల్ట్ ఇన్ స్టిస్ట్యూట్ ను నెలకొల్పారు. ఇది అమెరికాలోని అలెగ్జాండ్రియాలో వున్నది. ఇన్ని ఉపయోగాలున్న ఉప్పు గురించి పాఠశాల విధ్యార్తులకు చెప్పితే చిన్నప్పుడే వారికి ఉప్పు విలువ తెలుస్తుందని ....ఉప్పు ఉపయోగాల గురించి పాఠ్య ప్రణాళిక తయారు చేసి ఉపాద్యాయులకు ఉచితంగా ఇస్తున్నారు. .. (మూలం,,, 14 ఆగస్టు...2011 ఆంధ్ర జ్యోతి.)
మూలాలు [మార్చు]
- ↑ Susan R. Feldman. Sodium chloride. Kirk-Othmer Encyclopedia of Chemical Technology. John Wiley & Sons, Inc. Published online 2005. doi:10.1002/0471238961.1915040902051820.a01.pub2
|
|||||