ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి

వికీపీడియా నుండి

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి ఒక సుప్రసిద్ధ తత్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు.

ఆయన జులై 9, 1918 న కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నం లో జన్మించాడు. గుడివాడ లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీ కూడా టీనేజీ లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.