ఉమ్రాహ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాబా చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న ముస్లిం తీర్థయాత్రికులు.

ఉమ్రాహ్ లేదా ఉమ్రా (అరబ్బీ: عمرة ) సంవత్సరకాలంలో ముస్లింలు ఎపుడైననూ మక్కా తీర్థయాత్రచేస్తే దానిని ఉమ్రా అంటారు. అరబ్బీ భాషలో ఉమ్రా అనగా పవిత్ర స్థల సందర్శన. షరియా ప్రకారం ఉమ్రా అనగా ఇహ్రాం ధరించి కాబా చుట్టూ తవాఫ్ చేయడం, అల్-సఫా, మర్వాహ్ మధ్య సయీ చేయడం. వేరేవిధంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న తీర్థయాత్ర, హజ్ అనునది పెద్ద తీర్థయాత్ర. ఇస్లామీయ సిధ్ధాంతాల ప్రకారం 'ఉమ్రా' అత్యవసరం కానప్పటికీ, పుణ్యకార్యమే.

ఉమ్రా సాంప్రదాయాలు[మార్చు]

ఈ తీర్థయాత్ర (ఉమ్రా) చేయువానికి "ముతమిర్" అంటారు. హజ్ యాత్ర చేయువానికి "హాజీ" అంటారు. ఉమ్రా సాంప్రదాయం ఇబ్రాహీం ప్రవక్త, అతని భార్య 'హాజిరా' వారిది. ఈ సాంప్రదాయంవల్ల ముస్లిం సముదాయాలలో ప్రేమాభిమానాలు కలుగుతాయని నమ్మకం. సాంప్రదాయక నమ్మకాలు:

  • కాబా చుట్టూ ఏడు సార్లు తవాఫ్ (ప్రదక్షిణలు ) గడియారపు ముల్లు వ్యతిరేక దిశలో చేయాలి. మూడు ప్రదక్షిణలు త్వరత్వరగానూ, మిగతా నాలుగు ప్రదక్షిణలు నెమ్మదిగానూ చేయాలి.[1]
  • అల్-సఫా, మర్వాహ్ ల మధ్య "సయీ" అనగా సఫా మర్వా పర్వతాల మధ్య ఏడు సార్లు త్వరితగతిన రాకపోకలు చేయాలి. ఇబ్రాహీం ప్రవక్త పత్నియైన 'హాజిరా' సాంప్రదాయంగా దీన్ని ఆచరిస్తారు. 'హాజిరా' పై అల్లాహ్ జమ్ జమ్ బావిని ప్రకటించాడు.
  • హల్ఖ్ లేదా 'తఖ్సీర్' చేయాలి, అర్థం తలనీలాలు విసర్జించాలి. హల్ఖ్ అనగా పూర్తిగా తలనీలాల విసర్జన (తల గుండు చేసుకోవడం), తఖ్సీర్ అనగా తలనీలాలు చిన్నవ చేసుకోవడం.

ఈ సంప్రదాయాలతో ఉమ్రాహ్ తీర్థయాత్ర ముగుస్తుంది. ఉమ్రాను సుమారు ఒక గంటలో పూర్తిచేసుకోవాలి. ముఖ్యమైన పర్వాలైన హజ్, రంజాన్ లలో ఉమ్రా చేయువారు ఎక్కువగా వస్తుంటారు.

ఉమ్రా రకాలు[మార్చు]

ఉమ్రా రెండు రకాలు, అవి

  • అల్-ఉమ్రతుల్-ముఫ్రదా అనగా కేవలం ఉమ్రా మాత్రమే చేయుట.
  • ఉమ్రతుల్ తమ్మతు అనగా ఉమ్రా, హజ్ రెండూ కలిపి చేయుట. (ఉమ్రా మొదట చేసి తరువాత హజ్ చేస్తారు)

ఇవీ చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. Mohamed, Mamdouh N. (1996). Hajj to Umrah: From A to Z. Amana Publications. ISBN 0-915957-54-X.

మూలాలు[మార్చు]

  • The Hajj According to the Five Schools of Islamic Fiqh (Part 1), by 'Allamah Muhammad Jawad Mughniyyah (translated from Arabic by Ali Quri Qara'i), al-Tawhid, Vol. II, No.4,

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉమ్రాహ్&oldid=3121071" నుండి వెలికితీశారు