ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ ( 1916 మార్చి 21, - 2006 ఆగస్టు 21, ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. 2001 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్న తో సన్మానించింది - ఈ సన్మానమును పొందిన సాంప్రదాయక సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి.
విషయ సూచిక |
బాల్యం, జీవితం [మార్చు]
బిస్మిల్లాఖాన్ జన్మస్థలం బీహారు లోని డుమ్రాన్ జిల్లాలో, బిరుంగ్ రౌట్ కి గలి అనే ప్రాంతం. ఆయన తండ్రి, పైగంబర్ ఖాన్. ఆయన పూర్వీకులు భోజ్‌పూర్ లోని నక్కర్‌ఖానా లో ఆస్థాన సంగీత విద్వాంసులు. అతని తండ్రి డుమ్రాన్ లోని మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ విద్వాంసుడు. బిస్మిల్లాఖాన్ తన మామయైన కీ.శే. అలీ బక్ష్ విలాయతు వద్ద శిక్షణను తీసుకొన్నాడు. ఆయన వారణాసి విశ్వనాథుని దేవాలయంలో షెహనాయ్ వాయించేవాడు. బిస్మిల్లాఖాన్ సరస్వతీ దేవి భక్తుడు. గంగా తీరాన ఉన్న విశ్వనాథుని దేవాలయంలో ఎక్కువగా షెహనాయ్ వాయించేవాడు.
షెహనాయ్ ప్రస్థానం [మార్చు]
1937 లో కోల్‌కతా భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు, షెహనాయీని ఆయనతో పాటే పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఆయనకు షెహనాయీతో. ఆయన ఇలా అనేవాడు, మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి కులం లేదు, అని.
అతనొక మహా శివరాత్రి [మార్చు]
భగవద్గీత చదవలేదు ఖురాను కంఠస్తం చెయ్యలేదు కానీ అతనొక మహా శివరాత్రి కాశీ విశ్వేశ్వరాలయంపైన నెలవంకను తగిలించాడు
మానస సరోవరాల ఘనీభవనంతెలియదు మనుషులు శిలలుగా మారే వైనం కూడా తెలీదు కాని అతను శిలలను ద్రవీకరించె అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు
గాత్రంతొ గారడీలు చెయ్యలేదు స్తోత్రపారాయణాలూ చెయ్యలేదు కానీ అతను మనుషుల పందిరిమీద సప్తసువాసనల లతనెదో పాకించాడు
నదీ స్నానాలు చెయ్యలేదు కొండలు గుట్టలు ఎక్కలేదు కాని అతను గంగాబాలను తన ముంగాళ్ళమీద సురస్వరాల ఉయ్యాలలూగించాడు
ఏకాంత మానవద్వీపాలు చూడలేదు విచ్ఛిన్న శకలాల గూర్చి వినలేదు కాని అతను ఒకేసారి అరవై మందిని ఉమ్మడి గా వాటేసుకున్నాడు
మహా దార్శనికుడేమీకాడు ప్రవక్త అంతకన్నా కాడు కానీ అతను గుండెనిలువునా తెరిచి తన జాతి ఆత్మను ప్రపంచానికి ప్రదర్శించాడు అతను బిస్మిల్లా ఖాన్ ---------పాపినేని శివశంకర్, ప్రజా సాహితి ,డిశంబర్ 2006
ఎర్రకోటలోవాద్యం [మార్చు]
భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లోఆయన ఢిల్లీ లోని ఎర్రకోట లో వాద్య కచేరీ నిచ్చాడు. జనవరి 26, 1950 భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆయన ఎర్రకోటలో కాఫి రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు.
సినిమాలు [మార్చు]
డా. రాజ్‌కుమార్ నటించిన సనాది అప్పన్న సినిమాలో బిస్మిల్లాఖాన్ షెహనాయి వాయించాడు. గూంజ్ ఉఠీ షెహనాయ్ అనే సినిమాలో షెహనాయి ధ్వనిని అందించాడు. గౌతమ్ ఘోష్ బిస్మిల్లాఖాన్ జీవితంపై ఒక డాక్యుమెంటరీ ని నిర్మించాడు. దాని పేరు సంగె మీల్ సె ములాఖత్.
శిష్యులు [మార్చు]
1. సద్గురు జగ్‌జిత్ సింగ్‌జీ. 2. కృపాల్ సింగ్ 3. గుర్‌బక్ష్ సింగ్ నంధారి
అవార్డులు, పురస్కారాలు [మార్చు]
- భారత రత్న ( 2001 )
- ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమి ( 1994 )
- పద్మ విభూషణ్ ( 1980 )
- పద్మ భూషణ్ ( 1968 )
- పద్మశ్రీ ( 1961 )
- సంగీత నాటక అకాడమి అవార్డు ( 1956 )
- తాన్సేన్ అవార్డు
గౌరవ డాక్టరేట్లు [మార్చు]
- బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
- విశ్వభారతి యునివర్సిటీ నుండి.
- శాంతినికేతన్ నుండి.
ఆల్బంలు [మార్చు]
- మేస్ట్రోస్ ఛాయిస్ ( ఫిబ్రవరి, 1994 )
- మేఘ్ మల్హార్, వాల్యూమ్ 4.
- లైవ్ ఎట్ క్వీన్ ఎలిజబెత్ హాల్ ( సెప్టెంబర్, 2000 )
- లైవ్ ఇన్ లండన్, వాల్యూమ్ 2. ( సెప్టెంబర్, 2000 )
వనరులు [మార్చు]
1. [1] ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ బయోగ్రఫి 2. [2] బి. బి. సి. - ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ 3. [3] బిస్మిల్లాఖాన్ పెర్ఫామ్స్ మ్యూజిక్ ఫర్ గురు మహరాజీ ప్రేమ్ రవట్ - యూట్యూబ్.
బయటి లింకులు [మార్చు]
- ఆఫ్ ఇండియా, బిస్మిల్లా ఖాన్ మృతికి భారతజాతి సంతాపం
- [4]డాక్యుమెంటరీ, బనారస్ - గంగాతీరాన సంగీతం.
- [5]ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ - ఇంటర్నెట్ మూవీ డేటా బేస్.
- ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి చెంబూర్.కామ్ లో