ఊడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రిచెట్టు ఊడలు

ఊడ అనగా నేలకు పైభాగాన చెట్టు నుంచి వ్రేళాడుతూ ఉండేటటువంటి వేర్లు. ఊడను ఇంగ్లీషులో ఏరియల్ రూట్ (Aerial root) అంటారు. ఈ ఊడలు అన్ని చెట్లకు రావు, కొన్ని రకాల చెట్లకు మాత్రమే వస్తాయి. ఉదాహరణకు జువ్వి, మర్రి వంటివి. మర్రిచెట్టు ఊడలు బాగా బలంగా, లావుగా, పొడవుగా ఉంటాయి. కొన్ని రకాల చెట్లు మరింత బలాన్ని చేకూర్చుకొనుటకు వెడల్పుగా వ్యాప్తి చెందిన తన చెట్ల కొమ్మల నుంచి వేర్లను పుట్టించి భూమిలోనికి పాతుకొనేందుకు నేల వైపుకి సాగిస్తాయి. ఈ వేర్లను పిల్లలు ఊయల ఊగేందుకు, ముఖ్యంగా మరి చెట్ల ఊడలను ఉపయోగిస్తారు, కనుక వీటికి ఊడ అనే పేరు వచ్చింది. మర్రి చెట్టు ఊడలు పాతుకొని చాలా విశాలంగా తయారవుతాయి, కొన్ని చెట్లు దాదాపు కొన్ని ఎకరాలలో విస్తరిస్తుంది. నేలలోకి పాతుకున్న ఈ ఊడలు కొన్ని సంవత్సరాలకు నేల నుంచి పుట్టిన చెట్ల మాను వలె తయారవుతాయి. మన రాష్ట్రంలో పిల్లల మర్రి, తిమ్మమ్మ మర్రిమాను వాటి ఊడల ద్వారా కొన్ని ఎకరాలకు విస్తరించాయి.

మోత కర్రలు[మార్చు]

బలంగా, లావుగా తయారైన మర్రి ఊడలను మోతకర్రలుగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మర్రి పెద్ద మర్రిచెట్టు, కోల్‌కత

"https://te.wikipedia.org/w/index.php?title=ఊడ&oldid=3031346" నుండి వెలికితీశారు