ఎంట్రిసిటబిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:516px-Emtricitabine3.png

Emtricitabine, ఎంట్రిసిటబిన్ ( 4-amino-5-fluoro-1-[ (2S, 5R) -2- (hydroxymethyl) -1, 3-oxathiolan-5-yl]-1, 2-dihydropyrimidin-2-one, FTC, brand name Emtriva®) అనేది HIV-1, hepatitis B చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు FTC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 02-Jul-2003 [1] రోజున అమోదించబడింది. ఈ మందును Gilead Sciences అనే సంస్థచే కనిపెట్టబడింది.

మోతాదు ( Dosage )[మార్చు]

ఎయిడ్స్
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

Emtricitabine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.HIV తొ ఉన్న పెద్దలకు డొస్ పెద్దలకు డొస్ 200 mg రోజుకు ఒకసారి ప్రతిరోజు వేసుకొవాలి.

దుష్ప్రబావాలు (Side Effects )[మార్చు]

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటే ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి) . చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడే రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  2. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తే వెంబడే మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
  3. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఎదలో కాలటం (Heartburn) . ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.
  4. hepatitis B ఉన్న వాళ్ళు ఈ మందును ఉన్న పళంగా ఆపితే లివర్ డామెజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది హెపటైటిస్ బి virus ను ఇది తగ్గిస్తుంది. అందుకే ఈ మందును అపవలసి వస్తే మీ డాక్టరును సంప్రందించాలి

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?[మార్చు]

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటే Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, .వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?[మార్చు]

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-08.
  2. http://www.aidsmeds.com/archive/Emtriva_1578.shtml