ఎం.కరుణానిధి
| తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి | |
|---|---|
| Constituency | చేపాక్ |
| Personal details | |
| Born | జూన్ 3 1924 తిరుక్కువలై, తమిళనాడు |
| Political party | డి.ఎం.కె |
| Children | 4 కొడుకులు, 2 కూతుళ్ళు |
| Residence | చెన్నై |
| As of మే 17, 2011 Source: Government of Tamil Nadu |
|
ఎం.కెగా మరియు డా.కళైనార్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు[1] మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[2] కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.[3] 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.
విషయ సూచిక |
బాల్యం [మార్చు]
ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై ఆయన స్వస్థలం.
రాజకీయాలు [మార్చు]
మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
సాహిత్యం [మార్చు]
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.