ఎం.వి.శ్రీధర్

వికీపీడియా నుండి

ఎం.వి.శ్రీధర్ (Maturi Venkat Sridhar) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1966, ఆగష్టు 2న హైదరాబాదులో జన్మించాడు. 1988-1989 నుంచి 1999-2000 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించి 48.91 సగటుతో 6,701 పరుగులు సాధించాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 366 పరుగులు.