ఎం. ఎస్. నారాయణ
వికీపీడియా నుండి
| ఎమ్. ఎస్. నారాయణ | |
![]() |
|
| జన్మ నామం | మైలవరపు సూర్యనారాయణ |
| జననం | మే 09 1950 (వయసు 63) |
| ప్రముఖ పాత్రలు | ఆనందం నువ్వు నాకు నచ్చావ్ శివమణి ఇడియట్ అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి యమదొంగ దేశముదురు |
ఎమ్. ఎస్. నారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 500[ఆధారం కోరబడినది] చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
విషయ సూచిక |
నేపధ్యము[మార్చు]
గతంలో ఈయన భీమవరం లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
వ్యక్తిగత జీవితము[మార్చు]
వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు.వీరిది కులాంతరు ప్రేమ వివాహము. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
పేరు పడ్డ సంభాషణలు[మార్చు]
- షేక్ ఇమామ్ (శివమణి)
- సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)
- ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)
చలన చిత్ర ప్రస్థానము[మార్చు]
నటించిన చిత్రాలు[మార్చు]
| సంవత్సరం | పేరు | పాత్ర | ఇతరత్రా విశేషాలు | |
|---|---|---|---|---|
| 2013 | మిస్టర్ పెళ్ళికొడుకు | |||
| షాడో (2013 సినిమా) | dhookudu (2013 సినిమా) | |||
| 2011 | తెలుగమ్మాయి | |||
| 2010 | తిమ్మరాజు | |||
| నాగవల్లి (2010 సినిమా) | పాములు పట్టే వ్యక్తి | |||
| మనసారా | ||||
| ఏమైంది ఈవేళ | ||||
| సరదాగా కాసేపు | ||||
| తకిట తకిట | ||||
| 2008 | భజంత్రీలు | దర్శకుడు | ||
| యమదొంగ | అతిధి పాత్ర | |||
| 2006 | భాగ్యలక్ష్మి బంపర్ డ్రా | ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము. | ||
| 2005 | ఎవడి గోల వాడిది | పూర్తి హాస్య చిత్రం | ||
| 2003 | అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి | |||
| శివమణి | అతిధి పాత్ర | |||
| మిస్సమ్మ (2003 సినిమా) | ||||
| 2002 | ఇడియట్ | అధ్యాపకుడు | ||
| 2001 | నువ్వు నాకు నచ్చావ్ |
