ఎక్స్-రే
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఎక్స్-రే లేదా ఎక్స్ కిరణాలు (X-rays) ఒక విధమైన రేడియోధార్మికత కలిగిన విద్యుదయస్కాంత కిరణాలు. వీటి తరంగదైర్ఘ్యం 10 నుండి 0.01 నానోమీటర్లు. ఇవి అతినీలలోహత కిరణాల కంటె తక్కువ తరంగదైర్ఘ్యం కలవి. వీటిని 'రాంట్జన్ కిరణాలు' అని కూడా పిలుస్తారు. వీటిని మొదటగా విల్హీమ్ కాన్రాడ్ రాంట్జన్ (Wilhelm Conrad Röntgen) కనుగొన్నాడు. వీటిని X-కిరణాలు అనగా అంతవరకు తెలియని కిరణాలు అని అర్ధం.[3]
కనుగొన్న అనతికాలంలోనే వీటిని వివిధ రకాలైన రేడియాలజీ పరీక్షలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
[మార్చు] అత్యుత్తమ ఆవిష్కరణ
వైద్యశాస్త్రాన్ని ఓ మలుపు తిప్పిన ఎక్స్‌రే యంత్రాన్ని అత్యుత్తమ శాస్త్రీయ ఆవిష్కారంగా ఎన్నికైంది. ఈ మేరకు నిర్వహించిన పోలింగ్‌లో మిగతా యంత్రాలను తోసిరాజని మొదటిస్థానానికి ఎగబాకింది. మొత్తం 50వేల మంది ఈ పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్స్‌రే యంత్రాన్ని అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కారంగా పేర్కొన్నారు(ఈనాడు7.11.2009)
[మార్చు] మూలాలు
- ↑ Kevles, Bettyann Holtzmann (1996). Naked to the Bone Medical Imaging in the Twentieth Century. Camden, NJ: Rutgers University Press, pp19–22. ISBN 0813523583.
- ↑ Sample, Sharron (2007-03-27). X-Rays. The Electromagnetic Spectrum. NASA. తీసుకొన్న తేదీ: 2007-12-03.
- ↑ Novelline, Robert. Squire's Fundamentals of Radiology. Harvard University Press. 5th edition. 1997. ISBN 0-674-83339-2.