ఎన్.టి.ఆర్. (తారక్)
| నందమూరి తారక రామారావు | |
| జన్మ నామం | నందమూరి తారక రామారావు |
|---|---|
| జననం | మే 20 1983 |
| స్వస్థలం | హైదరాబాదు |
| నివాసం | హైదరాబాదు,ఆంధ్రప్రదేశ్ |
| ఇతర పేర్లు | జూనియర్ ఎన్టీఆర్ |
| వృత్తి | సినిమా నటుడు |
| తండ్రి | నందమూరి హరికృష్ణ |
| తల్లి | షాలిని |
తారక్ లేదా ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినీమా నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు మనుమడు. ఇతడు మే 20, 1983న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని.
చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా యిచ్చాడు. తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను "తారక్" లేదా "ఎన్.టి.ఆర్." గా పిలువబడాలని కోరుకుంటాడు. మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.
విషయ సూచిక |
చిత్ర రంగంలో [మార్చు]
ఇతని తాతగారు, తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.
ఐతే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగానే ఆడాయి. బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదు అనిపించాయి. రాఖీ చిత్రం ఒకమాదిరిగా ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది. ఇలా నాలుగు సంవత్సరాలు అతను విజయం కోసం అలమటించాడు.
2007 లో గత చిత్రాలు "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి"ల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రల లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సన్నబడి, లావవుతున్నాడన్న విమర్శలను తిప్పి కొట్టాడు.
2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" అనే చిత్రం పరాజయం పొందింది.
2010 లో "వి.వి.వినాయక్" దర్శకత్వంలో వచ్చిన "అదుర్స్" మంచి విజయాన్ని సాధించింది. అదే సంవత్సరం "వంశీ పైడిపల్లి" దర్శకత్వంలో వచ్చిన "బృందావనం" ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని "దిల్ రాజు" నిర్మించాడు.
2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో "శక్తి" చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్నా, సినిమా పరాజయం పాలైంది. 2011, అక్టోబర్ 6న "సురేందర్ రెడ్డి" దర్శకత్వంలో విడుదలైన "ఊసరవెల్లి" మొదటివారం 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి "బోయపాటి శీను" దర్శకత్వంలో వచ్చిన "దమ్ము" చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల మరియు అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో "బాద్ షా" చిత్రం
సినీ జాబితా [మార్చు]
| సంవత్సరం | చిత్రం పేరు | పాత్ర | బహుమతులు |
|---|---|---|---|
| 2013 | బాద్‍షా | "'ఎన్.టి.ఆర్ | |
| 2012 | దమ్ము | రాజా వాసి రెడ్డి విజయ ధ్వజశ్రీ సింహ | |
| 2011 | ఊసరవెల్లి | టోని | |
| 2011 | శక్తి | శక్తి స్వరూప్, రుద్ర | |
| 2010 | బృందావనం | కృష్ణ (క్రిష్) | ఫిలింఫేర్ అవార్డులలో తారక్ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు |
| 2010 | అదుర్స్ | నరసింహాచారి, నరసింహ | ఫిలింఫేర్ అవార్డులలో తారక్ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు |
| 2008 | కంత్రి | క్రాంతి | ఫిలింఫేర్ అవార్డులలో తారక్ "ఉత్తమ కథానాయకుడు" అవార్డుకు ఎంపిక చేయపడ్డాడు |
| 2007 | యమదొంగ | రాజా | సిని"మా" అవార్డులలోను, ఫిలిమ్ ఫేర్ అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కధానాయకుడు" అవార్డు లభించింది |
| 2006 | రాఖీ | రామకృష్ణ / రాఖీ | |
| 2006 | అశోక్ | అశోక్ | |
| 2005 | నరసింహుడు | నరసింహుడు | |
| 2005 | నా అల్లుడు | కార్తీక్, మురుగన్ | |
| 2004 | సాంబ | సాంబ శివనాయుడు | |
| 2004 | ఆంధ్రావాలా | శంకర్ పహిల్వాన్, మున్న | |
| 2003 | సింహాద్రి | సింహాద్రి | సిని"మా" అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కధానాయకుడు" అవార్డు లభించింది |
| 2003 | నాగ | నాగ | |
| 2002 | అల్లరి రాముడు | రామకృష్ణ | |
| 2001 | ఆది | ఆది కేశవ రెడ్డి | నంది అవార్డులలో తారక్‌కు "నంది స్పెషల్ జ్యూరీ అవార్డు" లభించింది |
| 2001 | సుబ్బు | బాలసుబ్రహ్మణ్యం | |
| 2001 | స్టూడెంట్ నెం.1 | ఆదిత్య | |
| 2001 | నిన్ను చూడాలని | వేణు | |
| 1996 | బాల రామాయణము | రాముడు | నంది అవార్డులలో తారక్‌కు "నంది స్పెషల్ జ్యూరీ అవార్డు" లభించింది |
| 1991 | బ్రహ్మర్షి విశ్వామిత్ర | బాలనటుడు(భరతుడు) |