ఎర్రబెల్లి దయాకర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎర్రబెల్లి దయాకర్ రావు

నియోజకవర్గం వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం
పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం

ముద్దు పేరు దయన్న

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-04) 1956 జూలై 4 (వయసు 67)
పర్వతగిరి పర్వతగిరి మండలం వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం

 India ఇండియా పిన్ కోడ్ 506365
సెల్: 98480 12459.

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ గతం, ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఆదిలక్ష్మీ, జగన్నాధరావు
జీవిత భాగస్వామి ఉషారాణి
సంతానం ఒక కుమార్తె { ప్రతిమా రావు, మదన్ మోహన్ రావు ( అల్లుడు ) }, ఒక కుమారుడు { ప్రేమ్ చందర్ రావు, మహతి ( కోడలు ) }
నివాసం వరంగల్
మతం హిందూ మతము

ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.

బాల్యం, కుటుంబం[మార్చు]

ఎర్రబెల్లి దయాకర్ రావు 1956, జూలై 4న ఆదిలక్ష్మీ, జగన్నాధరావు దంపతులకు వరంగల్లు గ్రామీణ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జన్మించాడు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. 1964లో ఇతని తండ్రి సమితి అధ్యక్షుడుగా పనిచేశాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు బంధువు, రాజకీయ శిష్యుడు .

విద్యాభ్యాసం[మార్చు]

ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించి[1], వరంగల్లో తండ్రికి మిత్రుడు కొత్తపల్లి జయశంకర్‌ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఆపి ఎన్.టి.రామారావు అభిమాన సంఘం నాయకుడుగా పనిచేసిన పరిచయంతో, ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి, రాజకీయాలలో ప్రవేశించి, 1982లోనే తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 20 వేల మందితో వరంగల్లో సమావేశం ఏర్పాటు చేసి సభకు అధ్యక్షత వహించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

దయాకర్ రావుకు ఉషారాణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయాడు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షులుగా పనిచేసాడు. 1994లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక 2008 ఉప ఎన్నికలలో కూడా వరంగల్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్ ను ఓడించి, తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించాడు. మొత్తం 3 సార్లు శాసన సభ్యులుగా వర్ధన్నపేట నుండి ఎన్నిక కావడమే కాకుండా, 2009, 2014,[2] 2018లో పాలకుర్తి నుంచి వరసగా 4వ సారి, 6వ సారి డా. నెమురుగోమ్ముల సుధాకర్ రావు సహకారంతో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులైనాడు. 2014లో దుగ్యాల శ్రీనివాస రావు పై,2018లో జంగ రాఘవ రెడ్డి పై 53,009 మెజారిటితో గెలుపొంది పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి 4, 5, 6,వసారి శాసనసభలో ప్రవేశించాడు. డబుల్ హాట్రిక్ ఆరు సార్లు విజయం సాధించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కడు.[3]

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి[మార్చు]

సమైక్యవాది నారా చంద్రబాబునాయుడుతో సహా యనమల రామకృష్ణుడు లాంటి నాయకులను, శాసనసభ సభ్యులను ఒప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు అనుకూలంగా లేఖ ఇప్పించేందుకు కృషి చేసాడు. తెలంగాణ ప్రాంతంలో తెదేపా తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతని దూకుడు స్వభావం వలన మీడియా లోను పేరు పొందాడు.

బాబ్లీ ప్రాజెక్టు[మార్చు]

ప్రాణహిత నదిపై బాబ్లీ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదికి కేవలం 6 నుండి 8 టీ.యం.సి. ల నీరు ఆగుతుంది. జైలుకు సైతం వెళ్లాడు తెలంగాణ ఎడారి అవుతుంది అని బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళి నిరసన చేశాడు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడుతో కలిసి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి వెళ్లాడు. అందరినీ మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి విమానంలో హైదరాబాదుకు పంపారు.

నియోజకవర్గ అభివృద్ధి[మార్చు]

పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టాడు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువను తెచ్చాడు, గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టాడు. చేసిన పనుల వలన డబుల్ హాట్రిక్ ఆరు సార్లు విజయం సాధించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కరుగా రికార్డు ఉంది.

టీఆర్‌ఎస్ లో చేరాడు[మార్చు]

దయాకర్ రావు 2016లో తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (తెరాస) టీఆర్‌ఎస్‌లో చేరాడు. కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాడు.

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్నాడు.[4][5][6]

ఎర్రబెల్లి దయాకర్ రావు  2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[7]

ఆస్తులు-కేసులు[మార్చు]

  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 12,63,33,178 రూపాయలు.[8]
  • ఇతనిపై 3 కేసులు ఉన్నాయి.[8]

మూలాలు[మార్చు]

  1. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  2. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. https://epaper.sakshi.com/1933680/Jangaon-District/12-12-2018#page/2/2[permanent dead link]
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  7. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
  8. 8.0 8.1 "Dayakar Rao Errabelli(BRS):Constituency- PALAKURTHI(JANGAON) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.