ఎర్ర తల లవ్ బర్డ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఎర్ర తల లవ్ బర్డ్
Male (foreground) and female
పరిరక్షణ స్థితి
జాతి లభ్యత : ఆందోళన అవసరంలేదు.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Psittaciformes
కుటుంబం: Psittacidae
జాతి: Agapornis
ప్రజాతి: A. pullarius
ద్వినామీకరణం
Agapornis pullarius
(Linnaeus, 1758)

ఎర్ర తల లవ్ బర్డ్ (అగాపోర్నిస్ పుల్లారియస్) లేదా ఎర్ర ముఖం లవ్ బర్డ్ అని పిలువ బడే ఈ పక్షి అగాపోర్నిస్ ప్రజాతి కి చెందిన లవ్ బర్డ్ల జాతికి చెందినది. ఇతర లవ్ బర్డ్ లలాగా ఇది ఆఫ్రికాకి చెందినది.

రూప వర్ణన[మార్చు]

ఎర్ర తల లవ్ బర్డ్ షుమారు 15 సెం.మీ. పొడవు ఉంటుంది.దిని రంగు మొత్తంమేద చిలుక పచ్చ.కాని ముక్కు పై భాగం నుండి తల మధ్య దాకా,రెండు చెంపలపై చెవులవరకు, చక్కగా కనిపించేటట్లు ఎర్రని రంగు ఉంటుంది.వీటికి బూడిద రంగు కాళ్ళు ఉంటాయి.రెక్కల లోపలి భాగం లేత చిలకపచ్చ రంగులో ఉంటుంది.ఆడ పక్షికి ఎరుపు కాకుండా మొహంమీద నారింజ రంగు ఉంటుంది.అది కూడా మగ పక్షికి ఉన్నంత స్పష్ఠంగా ఉండదు.పెద్ద మగ పక్షికి ఎరుపు రంగుముక్కు,ఆడ పక్షికి కొంచెం లేతగా ఉండే ఎరుపు రంగు ముక్కు ఉంటుంది. [1]

విస్తరణ మరియు నివాస స్థలాలు[మార్చు]

ఎర్ర తల లవ్ బర్డ్ నివాస స్థానం ఆఫ్రికా ఖండం లోని అనేక దేశాలకు విస్తరించి ఉంది.ఆఫ్రికా లోని అంగోలా,బురుండి,కామెరూన్,చాద్,కాంగో,ఈక్వెటోరియల్ గినియా,ఇథియోపియా,గాబన్,ఘనా,గినియా,కెన్యా,మాలి,నిజర్,రువాండా,సియొర్రాలియోన్,సూడాన్,టాంజానియా,టోగో,ఉగాండా లలో నివశిస్తుంది.అదనంగా లైబీరియాలో కూడా దీనిని ప్రవేశపెట్టారు.[2]

సంతానోత్పత్తి[మార్చు]

ఎర్ర తల లవ్ బర్డ్ దాని గూడు చెట్ల పైన గాని,నేలపైనగానీ చెదల పుట్టల్లో పెడుతుంది.గూటికోసం ఆడ పక్షి లవ్ బర్డ్ ల కాలనీలో చెదల పుట్టలో 30 సెం.మీ. లోతు బొరియని తవ్వి అక్కడ ఇతర లవ్ బర్డ్ లతో కలసి గూటిని పెడుతుంది.[1]

పక్షుల పెంపకం[మార్చు]

వీటిని పంజరాల్లో ఉంచి సంతానోత్పత్తి చేయించటం చాల కష్టం.ఎందుకంటే అవి పిల్లల్ని పెట్టటానికి బొరియలు తవ్వాలి.పైగా ఆ బొరియలోని గూడు 27 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండాలి.అలాంటి ఏర్పాట్లు చేసినా అవి చాలా చికాకుపడే మనస్తత్వంగల జీవులు.

References[మార్చు]

  1. 1.0 1.1 Le Breton, Kenny. Lovebirds...getting started. USA: T.F.H. Publications. పేజీలు. 85–88. ISBN 0866224114. 
  2. మూస:IUCN2006

External links[మార్చు]

మూస:Psittaculiniమూస:Parrot-stub