ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
HP Enterprise Services
రకం Division of HP
Founded Incorporated June 27, 1962
as Electronic Data Systems
వ్యవస్థాపకు(లు) H. Ross Perot
ప్రధానకార్యాలయం Plano, Texas, USA
కీలక వ్యక్తులు Tom Iannotti, Senior Vice President
పరిశ్రమ Information technology services
ఉత్పత్తులు Computer Services
ఆదాయం $22.1 billion USD (2007)
ఉద్యోగులు 136,000
ఆదాయం Hewlett-Packard
వెబ్‌సైటు HP Enterprise Services

అంతర్జాతీయ వ్యాపార మరియు సాంకేతిక సేవల కంపెనీ HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌ ను గతంలో ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్ (EDS)గా పిలిచేవారు, దీని ప్రధాన కార్యాలయం టెక్సాస్‌లోని ప్లేనోలో ఉంది, అవుట్‌సోర్సింగ్ వ్యాపారం కోసం 1962లో H. రాస్ పెరోట్ దీనిని ప్రారంభించారు. 1984లో జనరల్ మోటార్స్ ఈ కంపెనీని కొనుగోలు చేసింది, అయితే 1996లో ఇది మళ్లీ ఒక స్వతంత్ర సంస్థగా అవతరించడంతోపాటు EDSకు జనరల్ మోటార్స్ ఒక సేవాగ్రహీతగా మారింది.

మే 13, 2008న $13.9 బిలియన్లతో ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు Hewlett-Packard Co. ప్రకటించింది.[1] ఈ ఒప్పందం ఆగస్టు 26, 2008న ఖరారైంది. దీంతో EDS ఒక HP వ్యాపార విభాగంగా మారింది, దీని పేరును "EDS, an HP company"గా మార్చారు. ఆ తరువాత కూడా రొనాల్డ్ A. రిటెన్‌మెయెర్ యాజమాన్యంలో కొనసాగారు, పదవీ విరమణ వరకు ఆన్ లివర్‌మోర్‌కు ఆయన నివేదించారు.

సెప్టెంబరు 23, 2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది,' EDS కొనుగోలును HP ప్రకటించిన ఒక ఏడాది తరువాత ఈ పేరు మార్పు తెరపైకి వచ్చింది, HPలోకి EDS విలీనంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.[2]

2008నాటికి, 64 దేశాల్లో EDSలో 139,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం మరియు UKలో దీనిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఫార్చూన్ 500 జాబితాలో 2000 మంది సేవాగ్రహీతలతో ఇది అతిపెద్ద సేవా కంపెనీల్లో ఒకటిగా ఉంది.

కంపెనీ నిర్మాణం[మార్చు]

టెక్సాస్‌లోని ప్లేనోలో HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం.
డెట్రాయిట్‌లోని రీనాయిసాన్స్ సెంటర్‌కు అనుసంధానం చేయబడిన టవర్ 500 మరియు టవర్ 600లో HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.


2006లో, EDS తన యొక్క మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ అనుబంధ కంపెనీ A.T. కీర్నేను ఒక యాజమాన్య కొనుగోలులో విక్రయించింది, అయితే ఐదు[citation needed] అనుబంధ కంపెనీల్లో తన వాటాలను నిలుపుకుంది:

 • మానవ వనరుల అవుట్‌సోర్సింగ్ సేవలు అందించే ExcellerateHRO కంపెనీలో దీనికి టవర్స్ పెరిన్‌తోపాటు యాజమాన్య భాగస్వామ్యం ఉంది.
 • EDS మరియు అబుదాబికి చెందిన ముబాడాలా డెవెలప్‌మెంట్ కంపెనీ మధ్య ఇంజజాత్ డేటా సిస్టమ్స్ ఒక ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమన్ దేశాల్లో ప్రభుత్వానికి, చమురు మరియు సహజవాయువు, ఆర్థిక సేవలు, రవాణా, టెలికాం మరియు ఆరోగ్యసంరక్షణ రంగాలకు IT మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) సేవలు అందించేందుకు ఉద్దేశించి దీనిని స్థాపించారు
 • SOLCORP, ఇది జీవిత బీమా మరియు సంపద నిర్వహణ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్ సేవలు మరియు సంప్రదింపు సేవలు అందిస్తుంది
 • EDS కన్స్యూమర్ లోన్ సర్వీసెస్ (వెండ్‌ఓవర్‌గా కూడా దీనిని గుర్తిస్తారు), ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వినియోగదారు రుణాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంది
 • MphasiS, An HP company, ఇది భారతదేశంలోని బెంగళూరు కేంద్రంగా నిర్వహించబడుతుంది, ఇది ఒక ప్రధాన అప్లికేషన్ డెవెలప్‌మెంట్ మరియు బిజినెస్ ప్రాసెసింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌సోర్సింగ్ కంపెనీగా సేవలు అందిస్తోంది. MphasiS తరువాత EDS ఇండియా విభాగంతో విలీనమై MphasiS, an HP Companyగా అవతరించింది, ఈ కంపెనీలో మొత్తం 33000+ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. MphasiS ఒక స్వతంత్ర HP అనుబంధ సంస్థగా నిర్వహించబడుతుంది, దీనికి ఒక సొంత బోర్డు ఉండటంతోపాటు, భారతీయ మార్కెట్‌లలో ఇది MphasiS లిమిటెడ్‌గా నమోదయివుంది.

ఇటీవల కొనుగోళ్లు[మార్చు]

(పూర్వ కొనుగోళ్ల జాబితా: HP మరియు EDS కొనుగోళ్లు మరియు విక్రయాలు.)

మే 2008లో, HP మరియు EDS రెండు కంపెనీలు తాము ఒక నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించాయి, ఈ ఒప్పందం కింద HP ప్రతి వాటాకు $25.00 చెల్లించి EDSను కొనుగోలు చేసింది, దీని ప్రకారం EDS మొత్తం విలువ సుమారుగా $13.9 బిలియన్లు ఉంది. ఈ లావాదేవీల నిబంధనలను HP మరియు EDS బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ లావాదేవీలు ఆగస్టు 26, 2008న ముగిశాయి. 2007 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ యొక్క ఉమ్మడి సేవల వ్యాపారాల్లో వార్షిక ఆదాయం $38 బిలియన్ల వద్ద ఉండగా, ఉద్యోగుల సంఖ్య 210,000 వద్ద ఉంది, అంతేకాకుండా 80పైగా కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.

నవంబరు 2007లో, U.S. రాష్ట్ర ప్రభుత్వాలకు సాఫ్ట్‌వేర్ మరియు సేవలు అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన సోబెర్ కార్పొరేషన్‌లో ప్రధాన వాటాదారు Accel-KKRతోపాటు, సుమారుగా 93 శాతం వాటా కొనుగోలు చేసేందుకు తాము అంగీకరించినట్లు EDS ప్రకటించింది, $420 మిలియన్ల డబ్బు చెల్లించి ఈ కొనుగోలు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. EDS రాష్ట్ర మరియు స్థానిక ఆరోగ్యసంరక్షణేతర గ్రూపుల్లో విలీనమైన తరువాత సోబెర్ పేరు సోబెర్ గవర్నమెంట్ సొల్యూషన్స్‌గా మారింది. జనవరి 2009లో దీని పేరును EDS, an HP companyగా మార్చారు.

మార్చి 2007లో, భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన ఒక టెస్టింగ్ కంపెనీ RelQ Ltdను EDS కొనుగోలు చేసింది.

జూన్ 2006లో, భారతదేశంలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రధాన అప్లికేషన్స్ మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) సర్వీసెస్ కంపెనీ అయిన MphasiSలో EDS ఒక ప్రధాన వాటాను కొనుగోలు చేసింది.

ఏప్రిల్ 2008లో, U.K.కు చెందిన ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ మరియు మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ అందించే విస్టోర్మ్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ను EDS కొనుగోలు చేసింది, ఈ కొనుగోలుతో ఇది యూరప్‌లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ అండ్ మేనేజ్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.[citation needed]

సెప్టెంబరు 2009లో, లెక్రోయిక్స్ సిస్టమ్స్‌ను HP కొనుగోలు చేసింది, సంస్థ లోపల మరియు సేవాగ్రహీతల సెక్యూరిటీ అవసరాలకు రెండింటికి ఉపయోగపడే విధంగా దానిని EDSలో విలీనం చేసింది.

ఆదాయ వనరులు[మార్చు]

2006లో కంపెనీకి అమెరికా ఖండాల నుంచి (కెనడా, లాటిన్ అమెరికా, మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు) $9.6 బిలియన్ల ఆదాయం; ఐరోపా, మధ్యప్రాచ్య, మరియు ఆఫ్రికా ప్రాంతాల నుంచి $6.4 బిలియన్లు; ఆసియా-ఫసిఫిక్ ప్రాంతం నుంచి $1.5 ఆదాయం వచ్చింది:[citation needed] సేవల ఆధారిత ఆదాయాన్ని చూస్తే: మౌలిక సదుపాయాల కల్పన ద్వారా $12 బిలియన్లు, అప్లికేషన్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా $5.9 బిలియన్లు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ ద్వారా $3 బిలియన్లు, ఇతర మార్గాల్లో $421 బిలియన్ల ఆదాయం లభించింది.

EDS ఇటీవల SAP కన్సల్టింగ్ ప్రాక్టీస్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సేవాగ్రహీత భాగస్వామ్య శిక్షణ మరియు సాంకేతిక పద్ధతుల కోసం SAPతో చేతులు కలిపింది, దీని వలన సంస్థ యొక్క కన్సల్టింగ్ వ్యాపారంలో దీర్ఘకాలిక వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నారు, EDS తన యొక్క SAP సామర్థ్యాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది, 2008 ప్రారంభానికి మార్కెట్‌లోకి పూర్తిస్థాయి SAP కన్సల్టింగ్ మరియు స్టిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాకుండా EDS మార్కెట్‌లో వ్యాప్తి మరియు విలువ ఆధారిత ఖాతాదారు సేవలను అందించేందుకు SAP యొక్క అంతర్జాతీయ భాగస్వామి మరియు ఎకోసిస్టమ్ గ్రూపుతో కలిసి పనిచేయనుంది.

ప్రదేశాలు[మార్చు]

టెక్సాస్‌లోని ప్లేనోలో ఉన్న HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం

EDS కార్యకలాపాలు 48 దేశాల్లో సాగుతున్నాయి,[3] అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డల్లాస్-ఫోర్ట్ వర్త్; డెట్రాయిట్; డెస్ మోయ్నెస్ మరియు క్లారియాన్, ఐయోవా; సాల్ట్ లేక్ సిటీ; ఇండియానాపోలీస్; వించెస్టెర్, కెంటుకీ; తుల్సా, ఓక్లహోమా; బోయిస్, ఇడాహో; మరియు ఉత్తర వర్జీనియా మహానగర ప్రాంతాల్లో దీని కేంద్రాలు ఉన్నాయి. ఇతర ప్రధాన కేంద్రాలు అర్జెంటీనా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, ఈజిప్టు, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, హంగేరీ, స్పెయిన్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా మరియు ఇటలీ దేశాల్లో ఉన్నాయి.

EDS యొక్క ప్లేనో, టెక్సాస్ క్యాంపస్ డల్లాస్ ప్రధాన పట్టణ ప్రాంతానికి ఉత్తరంగా 20 మైళ్లు (30 కిలోమీటర్లు) దూరంలో ఉంది ( 33°04′27″N 96°48′33″W / 33.0742°N 96.8093°W / 33.0742; -96.8093 ("EDS Plano Campus) ). ఈ క్యాంపస్ 3,521,000 చదరపు అడుగుల (327,000 m²) కార్యాలయం ఉండగా, డేటా సెంటర్ 270 ఎకరాల (1.1 km²) విస్తీర్ణంలో ఉంది. EDS నిర్మించిన 2,665 ఎకరాల (11 km²) లెగసీ ఇన్ ప్లేనో[4] నడిబొడ్డున ఇది ఉంది.

కంపెనీ స్పాన్సర్‌షిప్‌లు[మార్చు]

PGA టూర్ యొక్క EDS బైరోన్ నెల్సన్ ఛాంపియన్‌షిప్‌కు 2003 నుంచి 2008 వరకు EDS టైటిల్ స్పాన్సర్‌గా ఉంది, ఈ ఛాంపియన్‌షిప్ టెక్సాస్‌లోని ఇర్వింగ్ సమీపంలో జరుగుతుంది. 2009లో, ఇది HP బైరోన్ నెల్సన్ ఛాంపియన్‌షిప్‌గా మారింది. టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో ఉన్న యువత మరియు కుటుంబ సేవా కేంద్రాలకు ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్ ద్వారా $6 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుతున్నాయి.

నోబెల్ ప్రైజ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్పాన్సర్ అయ్యేందుకు నోబెల్ మీడియాతో 2007లో EDS ఒక స్పాన్సర్‌షిప్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది, అంతేకాకుండా నోబెల్ వెబ్‌కు అంతర్జాతీయ సాంకేతిక సేవల భాగస్వామిగా ఉండేందుకు కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడేళ్ల ఒప్పందం పరిధిలో EDS తన యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని నోబెల్ ప్రైజ్ సిరీస్‌కు మరియు సంస్థ యొక్క వెబ్ సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు చూస్తుంది, దీనిలో భాగంగా నోబెల్ యొక్క అవార్డ్ విన్నింగ్ వెబ్‌సైట్ nobelprize.org కోసం కంటెంట్ అభివృద్ధి చేస్తుంది.

సేవలు[మార్చు]

EDS మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు (అనువర్తనాలు), బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ అనే మూడు సేవా విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[5] మౌలిక సదుపాయాల సేవల పరిధిలో ఒక సేవాగ్రహీత కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్‌ల యొక్క పూర్తి మౌలిక సదుపాయాలు లేదా వాటికి సంబంధించిన కొంత భాగాన్ని EDS నిర్వహిస్తుంది, నెట్‌వర్క్‌లు, మెయిన్‌ఫ్రేమ్‌లు, మిడ్‌రేంజ్ మరియు వెబ్ సర్వర్‌లు, డెస్క్‌టాప్‌లు మరియు ల్యాప్‌టాప్‌లు మరియు ప్రింటర్లకు సంబంధించిన నిర్వహణా కార్యకలాపాలు వీటిలో భాగంగా ఉంటాయి. సేవాగ్రహీతలకు అప్లికేషన్ల సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సమగ్రపరచడం మరియు/లేదా నిర్వహణ తదితర కార్యకలాపాలు అప్లికేషన్ సేవల్లో భాగంగా ఉంటాయి. సేవాగ్రహీత కోసం ఒక వ్యాపార ప్రక్రియను నిర్వహించడం, అంటే పేరోల్, కాల్ సెంటర్లు, బీమా క్లయిమ్‌ల సంవిధానం తదితరాలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో భాగంగా ఉంటాయి.

భాగస్వాములు[మార్చు]

అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా EDS ఇతర కంపెనీలతో కలిసి అనేక వ్యాపార భాగస్వామ్యాలు[6] ఏర్పాటు చేసింది. కంపెనీకి మూడు రకాల భాగాస్వామ్యాలు ఉన్నాయి: అవి క్రియాశీల భాగస్వామ్యాలు , సేవా భాగస్వామ్యాలు , మరియు సాంకేతిక భాగస్వామ్యాలు .

EDS క్రియాశీల భాగస్వామ్యంలో వివిధ రకాల ప్రాజెక్టులపై పనిచేసింది, ముఖ్యంగా దీని యొక్క క్రియాశీల సంస్థ[7] నిర్మాణం, EDS రాబోయే తరం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఈ భాగాస్వామ్యాలను ఉపయోగించుకుంది, EDS[citation needed] ఇది చవకైన నిర్వహణ మరియు వ్యాపార మార్పుకు మెరుగైన యోగ్యతను అందిస్తుందని భావిస్తుంది. EDS క్రియాశీల భాగస్వామ్యంలో Cisco Systems, EMC Corporation, Microsoft, Oracle Corporation, SAP, Sun Microsystems, Symantec మరియు Xerox తదితర కంపెనీలు భాగంగా ఉన్నాయి.

ప్రధాన సేవాగ్రహీతలు[మార్చు]

EDS స్థాయి ఒక కంపెనీ నుంచి సేవలు అవసరమైన భారీ కంపెనీలు మరియు ప్రభుత్వాలు ఎక్కువగా EDS యొక్క సేవాగ్రహీతల్లో భాగంగా ఉన్నాయి. రోల్స్-రాయస్ plc, జనరల్ మోటార్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆర్కాండర్, క్రాఫ్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాల నావికా దళం, UK రక్షణ మంత్రిత్వ శాఖ మరియు రాయల్ డచ్ షెల్ తదితరాలు EDS యొక్క అతిపెద్ద సేవాగ్రహీతలుగా ఉన్నాయి.

EDS 1996లో నేషనల్ హెరిటేజ్ ఇన్స్యూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. గతంలో హెల్త్ కేర్ ఫైనాన్సింగ్ అడ్మినిస్ట్రేషన్ (HCFA)గా తెలిసిన సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికాయిడ్ సర్వీసెస్ (CMS) తరపున మెడికేర్ పార్ట్ B సేవలను నిర్వహించేందుకు ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. USలోని అనేక రాష్ట్రాల్లో కాల్ సెంటర్, ఫిర్యాదుల సంవిధానం, చెల్లింపులు, మోసాల దర్యాప్తు, వైద్యుల నమోదు తదితర సేవలను NHIC నిర్వహిస్తుంది.

EDS యొక్క మరో అతిపెద్ద సేవాగ్రహీత అమెరికా సంయుక్త రాష్ట్రాల నావికా దళం. 2000లో, నావికా దళం మరియు మెరైన్ కార్ప్స్‌ల మధ్య ఇంట్రానెట్ అనుసంధానాన్ని సృష్టించేందుకు US$9 బిలియన్ల కాంట్రాక్టు కంపెనీకి లభించింది, 2006లో ఈ కాంట్రాక్టు ముగియాల్సి ఉండగా, మార్చి 24, 2006న దీనిని 2010కి పొడిగించారు, ఈ కాంట్రాక్టు విలువ మరో $3 బిలియన్ల మేర పెరిగింది. దీనిని నేవీ మెరైన్ కార్ప్స్ ఇంట్రానెట్ లేదా NMCIగా గుర్తిస్తారు. 2004లో EDS యొక్క ఆదాయంలో NMCI 4% విలువ కలిగివుంది. NMCI ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ నెట్‌వర్క్‌గా గుర్తించబడుతుంది, దీనిలో సుమారుగా 400,000 "సీట్లు" ఉంటాయి. దీనికి సంబంధించిన నెట్‌వర్క్, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్లు, టెలిఫోన్‌లు, వీడియో-కాన్ఫరెన్సింగ్, శాటిలైట్ ట్రాన్సీవర్లు మరియు ఇంట్రానెట్ యొక్క మొత్తం నిర్వహణను EDS సమకూరుస్తుంది.[8]

NMCI మాదిరి సేవలు తరువాత, EDS మార్చి 2005లో UK రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి US$4 బిలియన్ల విలువైన కాంట్రాక్టు పొందింది[9] దీనిలో EDS ఈ శాఖకు చెందిన ఇప్పటికే ఉన్న అసంఖ్యాక సమాచార వ్యవస్థలను కలిపి ఒక రాబోయే తరం మౌలిక సదుపాయంగా మార్చనుంది ... ఈ నెట్‌వర్క్ ప్రధాన కార్యకార్యాలయాలు మరియు యుద్ధరంగ మద్దతు మరియు ముందు వరుస మధ్య నిరంతర సంకర్షణను అందజేస్తుంది, దీనిలో 150,000 డెస్క్‌టాప్ టెర్మినళ్లు మరియు సుమారుగా 2000 ప్రదేశాల్లోని 340,000 మంది యూజర్లను అనుసంధానం చేస్తారు ..."

ఫిబ్రవరి 2008లో EDS సింగపూర్‌కు చెందిన ఇన్ఫోకామ్ డెవెలప్‌మెంట్ అథారిటీతో ఆసియాలో అతిపెద్ద IT ప్రాజెక్టుల్లో ఒకదాని కోసం US$1.3 బిలియన్ల కాంట్రాక్టుపై సంతకం చేసింది. 2010 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ప్రభుత్వ రంగంలో ఒక ప్రామాణిక డెస్క్‌టాప్, నెట్‌వర్క్ మరియు సందేశ ప్రసార/భాగస్వామ్య వాతావరణాన్ని సాధించేందుకు ఈ ఒప్పందం సింగపూర్ ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది.[10]

అక్టోబరు 2008లో, U.S. డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏజెన్సీ (DISA) EDSతో US$111 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం పరిధిలో EDS: ప్రపంచవ్యాప్త భద్రతా సమీక్షలు నిర్వహించడంతోపాటు, ధ్రువీకరణ మరియు ప్రాతినిధ్య మద్దతు ఇవ్వడం, అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణ శాఖ భద్రతా విధానాల స్వతంత్ర మదింపు అందజేయడం, DOD నిర్వహణ వ్యవస్థలు, అనువర్తనాలు, డేటాబేస్‌లు మరియు నెట్‌వర్క్‌లపై భద్రతా అంచనాలను నిర్వహించడం చేస్తుంది. DISA I-అస్యూర్ అండ్ ఎంకోర్ కాంట్రాక్టు వెహికల్స్ ద్వారా విస్తృతమైన మౌలిక సదుపాయ సేవలు, హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను DISAకు అందించడంలో DOD మరియు EDS మధ్య 13 ఏళ్ల అనుబంధం ఉంది.[11]

ఇరాన్ షా పతనానికి కొంతకాలం ముందు ఇరానియన్ సోషల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన IT కంపెనీగా EDS చారిత్రక ప్రాధాన్యత కలిగివుంది. 1979లో ఇరాన్‌లో షా పాలన పతనం సందర్భంగా, అనేక మంది EDS ఉద్యోగులను ఇరాన్ తాత్కాలిక ప్రభుత్వం నిర్బంధించింది, ఈ ఉద్యోగులను ఇరాన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు H.రాస్ పెరోట్ అసాధారణ రహస్య చర్యలు చేపట్టారు.[12] ఈ సంఘటలు కెన్ ఫోలెట్ యొక్క ఆన్ వింగ్స్ ఆఫ్ ఈగిల్స్ పుస్తకంలో చెప్పబడ్డాయి.

సేవాగ్రహీత ఒప్పంద వివాదాలు[మార్చు]

 • నవంబరు 2001లో, UK రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన £300 మిలియన్ల విలువైన PFI (ప్రైవేట్ ఫైనాన్స్ ఇన్షియేటివ్) ప్రాజెక్టులో ఒక పేరోల్ వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి, దీని వలన 30,000 సిబ్బందికి వేతన చెల్లింపులు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. EDS ఈ వ్యవస్థను అందజేయలేకపోవడంతో, ప్రభుత్వం సాయం అందించినట్లు తెలుస్తోంది.[13]
 • డిసెంబరు 2003లో, EDS పదేళ్ల నిడివి గల £3 బిలియన్ల ఒప్పందాన్ని EDS కోల్పోయింది, ట్యాక్స్ క్రెడిట్‍‌ల చెల్లింపులో వరుసగా తీవ్ర జాప్యాలు జరగడంతో ఇన్‌ల్యాండ్ రెవెన్యూ IT సేవలు నిర్వహించేందుకు సంబంధించిన ఈ ఒప్పందం క్యాప్ జెమినీకి వెళ్లిపోయింది. 1994 నుంచి ఇన్‌ల్యాండ్ రెవెన్యూ కోసం EDS వ్యవస్థలను నిర్వహిస్తుంది, అయితే ఈ వ్యవస్థ యొక్క ప్రదర్శన తక్కువ స్థాయిలో ఉండేది, దీని వలన లక్షలాది మంది పౌరుల నుంచి ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు ఆలస్యంగా వచ్చేవి.[14][15]
 • 2004లో, UK యొక్క చైల్డ్ సపోర్ట్ ఏజెన్సీకి EDS అందించిన IT వ్యవస్థలను UKకు చెందిన నేషనల్ ఆడిట్ ఆఫీస్ తీవ్రంగా విమర్శించింది, వీటి నిర్వహణ బడ్జెట్‌ను మించిపోతుండటంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి, చివరకు ఈ పరిణామాలు CSA అధిపతి డగ్ స్మిత్ 2004-11-27న రాజీనామా చేసేందుకు దారితీశాయి. వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడంలో రెండేళ్లు జాప్యం జరిగింది, మార్చి 2003లో ఇవి అందుబాటులోకి వచ్చిన తరువాత CSA క్లయిమ్స్‌లో £1 బిలియన్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇదిలా ఉంటే అనాథ బాలల మద్దతు చెల్లింపుల్లో £750 మిలియన్లు సేకరించకుండానే మిగిలిపోయాయి. CSA యొక్క వ్యవస్థ పేలవంగా రూపొందించబడిందని, సరిగా పరీక్షించలేదని, అధ్వాన్నంగా అమలు చేయబడిందని అంగీకరించే EDS అంతర్గత మోమో ఒకటి బయటకు వచ్చింది. UK MPలు దీనిని ప్రజా ధనాన్ని దుర్వినియోగపరచడంగా వర్ణించారు, దీనిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.[16]
 • 2006లో, RAF కోసం EDS రూపొందించిన జాయింట్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ (JPA) వ్యవస్థ ప్రాసెసింగ్ దోషాపు కారణంగా వేలాది మంది సిబ్బందికి సరైన వేతనం అందకుండా చేయడానికి కారణమైంది. EDS మరియు MoD సిబ్బంది ఈ దోషాలకు సంబంధించి ఎటువంటి నిశ్చయాత్మక వివరణలు లేవని పేర్కొన్నారు.[17][18]
 • సెప్టెంబరు 2007లో 2001-2003 మధ్యకాలంలో తన ఆదాయాలను ఎక్కువ చూపించిందనే అభియోగాలకు సంబంధించి EDS U.S. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తీసుకున్న చర్యను పరిష్కరించుకునేందుకు $500,000 చెల్లించింది. ఆదాయాలు ఎక్కువ చేసి చూపించడంతో, 2002లో వాటా ధరలు తగ్గిపోవడంతో, US వాటాదారుల సంఘాలు EDSపై న్యాయపరమైన చర్యలు చేపట్టాయి.[19][20]
 • 2007-10-16న, EDS నుంచి బ్రిటీష్ TV కంపెనీ BSkyB £709 మిలియన్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేసింది, ఒప్పందంలో అంగీకరించిన సేవా ప్రమాణాలు అందించలేకపోవడం, అసమర్థతతోపాటు, మోసం మరియు వంచన ద్వారా ఈ కాంట్రాక్టును పొందిందని ఆరోపించింది.[20]
 • 2008-02-04న, IT సేవలను సకాలంలో అందించడంలో విఫలమైన తరువాత కుదిరిన రాజీలో EDS నుంచి రావాల్సిన నష్టపరిహారం కోసం హర్ మేజెస్టీస్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ ఇప్పటికీ ఎదురుచూస్తుంది.[21]
 • BSkyB కేసు సందర్భంగా, మేనేజింగ్ డైరెక్టర్ ఒకరికి ఇంటర్నెట్‌లో ఒక డిగ్రీ ఉన్నట్లు చూపించారు. అతని నైపుణ్యం మరియు సమగ్రతపై విచారిస్తున్న సందర్భంగా డిగ్రీని ఇచ్చేందుకు ఉపయోగించే ప్రక్రియలో ఒక కుక్కకు కూడా డిగ్రీని ఇవ్వడానికి వీలు పడుతుందని స్కై తరపు న్యాయవాదులు వాదించి నెగ్గగలిగారు, కుక్క పొందిన డిగ్రీ HP ఉద్యోగి కంటే ఎక్కువ స్థాయిలో ఉండటం గమనార్హం. HP చివరకు ఈ కేసులో పరాజయం చవిచూసింది, ప్రాథమికంగా £200 మిలియన్లు చెల్లించాలని ఆదేశించారు, అయితే కేసులో £ 700 మిలియన్లు చెల్లించాలని స్కై డిమాండ్ చేసింది.[22]
 • 2008-10-10న 100,000 మంది ఆర్మీ సిబ్బంది వివరాలు కలిగిన ఒక రక్షణ మంత్రిత్వ శాఖ హార్డ్‌డ్రైవ్‌ను EDS గుర్తించలేకపోయినట్లు వెల్లడైంది.[23]

ఉద్యోగుల వేతన కోత వివాదాలు[మార్చు]

 • 2009-02-19న, ఉద్యోగులందరికీ మార్చి 16 నుంచి జీతాల్లో కోత విధిస్తున్నట్లు HP ప్రకటించింది. CEO మార్క్ హుర్డ్‌కు మూల వేతనంలో 20% కోత విధించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని వారికి 15%, మేనేజర్లకు 10%, వేతన ఉద్యోగులకు 5%, గంటల ఆధారిత ఉద్యోగులకు 2.5% జీతాల్లో కోత పెట్టారు. ఈ విధానపరమైన మార్పును త్రైమాసిక ఆదాయ స్టేట్‌మెంట్ ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. అనేక మంది ఉద్యోగులకు ఈ విధాన మార్పు మరియు అది తెలియజేయబడిన పద్ధతి ఆగ్రహం తెప్పించింది. మార్క్ హుర్డ్ యొక్క వేతనంలో 20% కోత ఆయన $1.45 మిలియన్ల మూల వేతనంలో చాలా తక్కువగా ఉంటుంది, ఆయనకు ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే $42.5 మిలియన్లలో 20% కోత చాలా తక్కువ ప్రభావం మాత్రమే చూపిస్తుందని ఎక్కువ మంది ఉద్యోగులు భావించారు.[24][25]
 • 2009-03-13న, US- మరియు ఫ్యూర్టోరికో-లకు చెందిన EDS ఉద్యోగులకు ఏప్రిల్ 2009 వేతన చెల్లింపుల సందర్భంగా వారి జీతాలను మరో 10% తగ్గిస్తున్నట్లు సమాచారం అందింది, ఏడాదికి $40,000 కంటే తక్కువ స్థాయిలో ఉన్న వేతన వర్గానికి ఎటువంటి తగ్గింపు ఉండదని తెలియజేశారు. ఫిబ్రవరి 19న ప్రకటించిన 5% కోతకు ఇది అదనంగా చేర్చబడింది, అప్పటి కోతను HP ఉద్యోగులందరికీ కాకుండా EDS ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. EDS ఉద్యోగులకు మాత్రమే ఈ కోతను ఎందుకు వర్తింపజేశారనేదానిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు- (దీనిపై మీడియాకు లేదా అంతర్గత ప్రకటన ఏదీ వెలువడలేదు). ఈ అదనపు వేతన తగ్గింపును కూడా ఇమెయిల్ ద్వారానే ప్రకటించారు, EDS సీనియర్ లీడర్‌షిప్ బృందం సంతకంతో శుక్రవారం సాయంత్రం 5pm EDTకి ఈ ఇమెయిల్ వచ్చింది. మొత్తంమీద ఆర్థికపరమైన కారణాలు దీనికి దారితీశాయని చెప్పారు, మరింత మూల వేతన కోతలు పెట్టే ఆలోచనలేవీ లేవని ఈ సందర్భంగా ప్రకటించారు, వ్యాపార ప్రదర్శనను నిశితంగా పర్యవేక్షించడం కొనసాగిస్తామని, రాబోయే నెలల్లో మరింత సర్దుబాట్లు చేస్తామని చెప్పారు. మే 2009లో ఫిబ్రవరి 19 వేతన-కోత స్థాయిలకు వేతనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటన వెలువడింది (మేనేజ్‌మెంట్‌కు 10%, వేతన ఉద్యోగులకు 5%, గంటల కార్మికులకు 2.5%).[26][27][28]
 • జులై 2009లో, HP వేతనాలకు సమాన స్థాయిలోకి EDS సిబ్బంది వేతనాలను తీసుకొచ్చే చర్యల్లో భాగంగా కొనుగోలు చేసిన EDSలోని సిబ్బందికి HP మరిన్ని వేతన సర్దుబాట్లు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దాదాపుగా అన్ని సందర్భాల్లో, బాధిత ఉద్యోగులకు వారి జీతాలను వచ్చే 1–2 సంవత్సరాల్లో తగ్గిస్తామని, కొన్నిసార్లు 30% అంతకంటే ఎక్కువ తగ్గింపును అమలు చేస్తామని, సమాచారం ఇవ్వబడింది. ఈ సర్దుబాట్లు సహజంగా శాశ్వతంగా ఉంటాయి. HP ఈ కోతలను ధ్రువీకరించింది, మొత్తం 20% మంది ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారని తెలియజేసింది.[29][30]
 • ఆగస్టు 13, 2009న, డల్లాస్ NBC అనుబంధ సంస్థ EDS ఉద్యోగులను టౌన్‌హాల్ మీటింగ్‌లో వేతన కోతలపై మీడియాతో మాట్లాడవద్దని బెదిరించినట్లు వెల్లడించింది. ఈ ప్రకటనలు EDS అమెరికా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ మేట్స్ చేసినట్లు ఒక వార్తా నివేదికగా ప్రసారం చేయబడింది. ఉద్యోగులు కంపెనీ వ్యవహారాలను వార్తలుగా బయటకు తెలియజేస్తున్నారని మేట్స్ పేర్కొన్నారు. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయాలు మన మధ్య మాత్రమే ఉండేలా చూడమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం మనలో ఈ విషయాలను ఉంచుకుంటే, మనం దీని గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. మీరు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని రేపు వచ్చే పత్రికల్లో చూసుకోవాలనుకుంటే, మీకు ఇక్కడ కంటితుడుపు ప్రకటనలు వింటారు." అయితే, ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉద్యోగులు తమకు ఇస్తున్న సమాచారం కేవలం కంటితుడుపు చర్యల్లో భాగమేనని పేర్కొన్నారు, వినియోగదారులకు మరియు సంభావ్య ఖాతాదారులకు కూడా అవి ఇటువంటి ప్రకటనలేనని చెప్పారు. ప్రసార మాధ్యమాలతో మాట్లాడకుండా చేసిన హెచ్చరిక కేవలం సమస్యలను దాచిపెట్టేందుకు మరియు ఖాతాదారులపై ప్రభావం చూపకుండా చేసేందుకు మాత్రమే ఉద్దేశించిందని వారు తెలిపారు. పాడ్‌కాస్ట్‌లో మేట్స్ ప్రకటనలపై మాట్లాడేందుకు HP ప్రతినిధి నిరాకరించారు.[31]
 • డిసెంబరు 2009లో HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ ఉద్యోగులకు జులై 2009లో ప్రకటించిన వేతన కోతకు సమానమైన పరిమాణంలో ఏక-కాలిక బోనస్ పొందుతారని ప్రకటన వెలువడింది.[citation needed]
 • ఫిబ్రవరి 2010లో, 2010 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి తరువాత ఈ త్రైమాసిక కాలంలో ఉద్యోగుల యొక్క 401(k) ఖాతాలకు 100% చందాలు ఇస్తుందని HP ప్రకటించింది.[citation needed]

సూచనలు[మార్చు]

 1. Paul, Franklin (2008-05-13). "HP to buy EDS for $12.6 bln in challenge to IBM". Reuters. పేజీ. 4. సంగ్రహించిన తేదీ 2008-05-13. 
 2. "EDS, an HP Company, Becoming HP Enterprise Services". సంగ్రహించిన తేదీ 2009-09-23. 
 3. లొకేషన్స్ , EDS వెబ్‌సైట్
 4. లెగసీ ఇన్ ప్లేనో
 5. సర్వీసెస్ , EDS వెబ్‌సైట్
 6. అలయన్సెస్ , EDS వెబ్‌సైట్
 7. ఎజైల్ ఎంటర్‌ప్రైజ్ , EDS వెబ్‌సైట్
 8. NMCI ఓవర్‌వ్యూ , EDS వెబ్‌సైట్
 9. EDS-వెడ్ కన్సార్టియం సైన్స్ కాంట్రాక్ట్ విత్ U.K. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ , EDS వెబ్‌సైట్
 10. http://www.eds.com/news/releases/4364/
 11. http://www.tmcnet.com/usubmit/2008/12/17/3861775.htm
 12. ఆపరేషన్ HOTFOOT , medicaid.state.ar.us
 13. "Business targets defence contracts". BBC News. 2001-12-03. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 14. "Inland Revenue dumps IT provider". BBC News. 2003-12-11. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 15. "EDS rallies troops over tax credits fiasco". The Register. 2003-12-10. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 16. McCue, Andy (2004-11-18). "EDS under fire over £456m child support IT fiasco". Silicon.com. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 17. "Payroll Alliance". LexisNexis. 2006-08-03. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 18. "EDS's RAF pay system struggles to take off". The Register. 2006-05-09. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 19. Faragher, Jo. "EDS under investigation for accounting practices". Information Age. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 20. 20.0 20.1 Shipman, Alan (2007-10-17). "Sky falls on EDS with biggest outsource compensation case". Finance Week. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 21. "HRSM still waiting for EDS cash". The Register. 2008-02-05. సంగ్రహించిన తేదీ 2008-02-05. 
 22. http://www.itnews.com.au/News/165888,key-eds-witness-bought-internet-degree.aspx
 23. "MoD computer hard drive missing". BBC News. 2008-10-10. సంగ్రహించిన తేదీ 2008-10-10. 
 24. "HP staff voice their discontent over pay cut plan". Vnunet.com. 2009-02-27. Archived from the original on 2009-03-02. సంగ్రహించిన తేదీ 2009-03-14. 
 25. "HP cuts pay of global workforce". Computerweekly. 2009-02-19. సంగ్రహించిన తేదీ 2009-03-14. 
 26. "EDS pay cuts strike deep". Dallasnews.com. 2009-03-16. సంగ్రహించిన తేదీ 2009-03-16. 
 27. "HP skims another 10% off some EDS workers' pay packets". The Register. 2009-03-16. సంగ్రహించిన తేదీ 2009-03-16. 
 28. "HP imposes more salary cuts for EDS employees". ZDNet. 2009-03-16. సంగ్రహించిన తేదీ 2009-03-16. 
 29. "HP Warns Worried EDS Workers: Don't Go to Media". Dallas Morning News. 2009-08-06. సంగ్రహించిన తేదీ 2009-08-14. 
 30. "HP Warns Worried EDS Workers: Don't Go to Media". Dallas Morning News. 2009-08-05. సంగ్రహించిన తేదీ 2009-08-14. 
 31. "HP Warns Worried EDS Workers: Don't Go to Media". KXAS. 2009-08-13. సంగ్రహించిన తేదీ 2009-08-14. 

బాహ్య లింక్‌లు[మార్చు]