ఎలిఫెంటా గుహలు

వికీపీడియా నుండి

ఎలిఫెంటా గుహలు Elephanta Caves మహారాష్ట్ర లోని 'ఘరాపురి ద్వీపం' లో గలవు. దీనికా పేరు పోర్చుగీసు వారు పెట్టారు. 1987 లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశం గా ప్రకటించారు.

దీనిని దేశవిదేశాల యాత్రికులు సందర్శించారు. ఈ మధ్యకాలంలో యాత్రికులు వీటిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. [1][2] 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీనిలో గల విగ్రహాల ముఖాకృతులను మార్చివేశారు. [3]

9వ శతాబ్దం మరియు 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు దీనిని నిర్మించారు.[ఆధారం కోరబడినది] కొన్ని విగ్రహాలు రాష్టకూటులు నిర్మించారు. 'త్రిమూర్తి' విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంది. నటరాజ మరియు సదాశివుని, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్ట్రకూటుల కళలకు ప్రతీక.[ఆధారం కోరబడినది]

ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం, 60,000 చ.అ. విస్తీర్ణం కల్గివున్నది. దీనియందు ముఖ్యమైన హాలు, 2 ప్రక్క హాళ్ళు, ప్రాంగణం మరియు 2 ఇతర క్షేత్రములు గలవు. ఇందు సుందరమైన శిల్పాలు, శివాలయం వున్నవి. [4] ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి.

[మార్చు] త్రిమూర్తి-సదాశివుని విగ్రహం

పెద్ద హాలు: గుహ 1

ఇందులోని ప్రముఖ విగ్రహం, సదాశివుని విగ్రహం, ఉత్తర దక్షిణ అక్ష్యంలో, 20 అడుగుల ఎత్తులో, త్రిముఖంతో కూడి, పంచముఖ శివునికి పోలి వుంది. [5]

[మార్చు] మూలాలు

ప్రవేశం
  1. Save the Caves. south-asian.com. తీసుకొన్న తేదీ: 2006-10-14.
  2. Elephanta Caves. Bolography. తీసుకొన్న తేదీ: 2006-10-14.
  3. HT Cafe, Mumbai, Monday, June,4,2007 pg.31 - Article 'Lord of the Islands" by Jerry Pinto
  4. Elephanta Caves. Mumbai Net. తీసుకొన్న తేదీ: 2006-10-14.
  5. Duffer's Guide to Elephanta, Mid-Day, Tinaz Nooshan, Feb 22, 2007, pg A14

[మార్చు] బయటి లింకులు

India-Elephanta-Statues.jpg
గుహ బయట


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు