ఎల్.వి.ప్రసాద్

వికీపీడియా నుండి
అక్కినేని లక్ష్మీవరప్రసాద్
TeluguFilmPersonality LV Prasad.jpg
అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు
జననం జనవరి 17,1908
ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామము
మరణం జూన్ 22 1994
ప్రాముఖ్యత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
వృత్తి తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు
భార్య/భర్త సౌందర్య మనోహరమ్మ
తండ్రి అక్కినేని శ్రీరాములు
తల్లి బసవమ్మ

ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత . ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.

విషయ సూచిక

బాల్యం [మార్చు]

రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.

17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నాడు. వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టుంది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశాడు. ఇదే సమయంలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళాడు.

సినిమాలు [మార్చు]

నటునిగా [మార్చు]

దర్శకునిగా [మార్చు]

పురస్కారాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]