ఎస్వీ.కృష్ణజయంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్వీ.కృష్ణజయంతి
ఎస్వీ.కృష్ణజయంతి
వృత్తికవయిత్రి, రచయిత్రి, సాహితీ పరిశోధకురాలు
ప్రసిద్ధికథా రచయిత్రి, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తయస్వీకృష్ణ
పిల్లలుకృష్ణసంహిత,కృష్ణ అద్వైత
తండ్రిబిళ్లా రామారావు
తల్లినాగేంద్రమ్మ

ఎస్వీ.కృష్ణజయంతి ప్రఖ్యాతి చెందిన రచయిత్రి. ఈమె కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు పలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఈమె 1979, జనవరి 6న బిళ్లా రామారావు, నాగేంద్రమ్మ దంపతులకు గుంటూరు లో జన్మించింది.[1] ఈమె ప్రస్తుతం హైదరాబాదు లో స్థిరపడింది. ఈమె భర్త యస్వీకృష్ణ కూడా ప్రఖ్యాతి చెందిన రచయిత, ప్రముఖ ప్రచురణ కర్త. ఈమె తెలుగుసాహిత్యంలో ఎం.ఏ. పూర్తిచేసింది. ఈమె రచించిన అనేక కథలు బహుమతులు గెలుచుకున్నాయి. ఈమె రచించిన "దృష్టి" కథాసంపుటిపై నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. స్థాయి పరిశోధన జరిగింది. ఈమెకు తెలుగు సాహిత్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారి ఫెలోషిప్ లభించింది.

రచనలు

  1. 50వసంతాల తెలుగు కవిత... వస్తువు-రూపం-శిల్పం (విమర్శ)
  2. దృష్టి (కథాసంపుటి)
  3. అభిమాని (నవల)
  4. వ్యూహం (నవల)
  5. మరీచిక (కవితాసంపుటి)
  6. పడమటిసూర్యోదయం (కథాసంపుటి) (అముద్రితం)

70 వరకు కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కొన్ని కథలు కన్నడ భాష లోనికి అనువాదమయ్యాయి.

పురస్కారాలు, సత్కారాలు

  1. "విందైనవంటకం" కథకు "ఆంధ్రప్రదేశ్" మాసపత్రిక నిర్వ్హహించిన దీపావళి హాస్యకథలపోటీలో ప్రథమ బహుమతి[2]
  2. "పెళ్లికానుక" కథకు "నది" మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి
  3. "రెండో శనివారం" కథకు "స్వాతి" మాసపత్రిక కథల పోటీలో ప్రథమ బహుమతి
  4. "గుణ" కథకు "ఆంధ్రప్రభ", అ.జో.వి.భొ.ఫౌండేషన్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి
  5. "వంశ చరిత్ర"కథకు "నది" మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలో ద్వితీయ బహుమతి
  6. "దృష్టి" కథకు "లాయర్" వారపతిక కథల పోటీలో 3వ బహుమతి
  7. "తొలగిన తెర" కథకు "సోమేపల్లి సాహితీ పురస్కారం"
  8. "తూర్పు సింధూరం" కథకు "మల్లెతీగ" మాసపత్రిక కథలపోటీలో కన్సొలేషన్ బహుమతి
  9. "గెలుపు" కథకు "జాగృతి" వారపత్రిక దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి
  10. "నిర్ణయం" కథకు "విశాలాక్షి" పత్రిక కథల పోటీలో ప్రత్యేక బహుమతి
  11. "స్త్రీవాద సాహిత్యం" వ్యాసానికి "ఆంధ్రప్రదేశ్"మాసపత్రిక పోటీలలో మూడవ బహుమతి
  12. "స్త్రీచైతన్య కవిత్వం" వ్యాసానికి "భావ తరంగిణి" నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి
  13. "నీకోసం" రచనకు "ఆంధ్రభూమి" నిర్వహించిన ప్రేమలేఖల పోటీలో ప్రథమ బహుమతి
  14. "బెజవాడ యువకలాలు" సంస్థచే ఉత్తమకవయిత్రి పురస్కారం
  15. "ఉత్తరాంధ్ర కళాకేంద్రం" (శ్రీకాకుళం) వారిచే యువకవయిత్రి పురస్కారం

మూలాలు

  1. వెలువోలు, నాగరాజ్యలక్ష్మి (20 March 2017). "గుంటూరు మహిళలు - కవయిత్రి పరిశోధకురాలు కృష్ణజయంతి". ఆంధ్రజ్యోతి. Archived from the original on 22 మార్చి 2017. Retrieved 23 March 2017.
  2. సంపాదకుడు. "దీపావళి హాస్యకథల పోటీ". ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక.