ఎస్.ఎమ్. కృష్ణ

వికీపీడియా నుండి
Somanahalli Mallaiah Krishna
ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ
India-eam-krishna.jpg
Minister of External Affairs
Incumbent
Assumed office
23 May 2009
Prime Minister Manmohan Singh
Deputy Preneet Kaur
Preceded by Pranab Mukherjee
Governor of Maharashtra
In office
12 December 2004 – 5 March 2008
Chief Minister Vilasrao Deshmukh
Preceded by Mohammed Fazal
Succeeded by Sanayangba Chubatoshi Jamir
Chief Minister of Karnataka
In office
11 October 1999 – 28 May 2004
Governor V. S. Ramadevi
Triloki Nath Chaturvedi
Preceded by Jayadevappa Halappa Patel
Succeeded by Dharam Singh
Personal details
Born మే 1 1932 (1932-05-01) (వయసు 81)
Political party UPA-INC
Spouse(s) Prema Krishna
Residence Bangalore, India
Alma mater Maharajas College, Mysore
University Law College, Bangalore
Southern Methodist University
George Washington University
Website Ministry of External Affairs

సాధారణంగా ఎస్.ఎమ్.కృష్ణ గా వ్యవహరించబడే సోమనహల్లి మల్లయ్య కృష్ణ (కన్నడ: ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ), (1932 మే 1న జన్మించారు) విదేశీ వ్యవహారాల మంత్రి మరియు రాజ్యసభలో కర్నాటక నుండి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 1999 నుంచి 2004 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నరుగా వ్యవహరించారు.

విషయ సూచిక

జీవిత సమాచారం [మార్చు]

ఎస్.ఎమ్ కృష్ణ ఎస్.సి మల్లయ్య కుమారుడు, మాండ్య జిల్లాలోని మద్దూర్ తాలూకాలోని సోమనహల్లి అనే చిన్నగ్రామంలో కృష్ణ జన్మించారు. ఇతడు మైసూరు మహారాజా కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు.యూనివర్శిటీ లా కళాశాల నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నారు. అప్పట్లో ఇది బెంగళూరు ప్రభుత్వ లా కాలేజీగా వ్యవహరించబడేది [1]. కృష్ణ యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకున్నారు. టెక్సాస్‌ డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్శిటీ నుంచి, వాషింగ్టన్ డి.సి. లోని ది జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఇక్కడ ఇతడు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌గా ఉండేవాడు. తర్వాత ఇతడు ఫ్యాకల్టీలో చేరి అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే, అతడు కర్నాటక శాసనసభకు 1962లో ఎన్నికయ్యాడు. [2].

1964 ఏప్రిల్ 29న ఇతడు ప్రేమను వివాహమాడాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు. కృష్ణ చక్కటి క్రీడాకారుడు, టెన్నిస్‌ని క్రమం తప్పకుండా ఆడేవాడు.

రాజకీయ జీవితం [మార్చు]

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం వద్ద రిసెప్షన్ సమయంలో యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రథమ మహిళ లేడీ మిచెల్ ఒబామాతో కృష్ణ (మధ్యలో).

అదనంగా, కృష్ణ కర్నాటకలోని మాండ్య నుంచి అనేకసార్లు MPగా సేవలందించాడు. 1968లో మొదలై 4వ, 5వ, 7వ, 8వ లోక్‌సభలో సభ్యుడయ్యాడు. ఇతడు 1983-84 మధ్యన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా, 1984 -85 మధ్యన రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1996 మరియు 2006 సంవత్సరాలలో ఇతడు రాజ్యసభ సభ్యుడుగా ఉండేవాడు. ఇతడు కర్నాటక శాసనసభ సభ్యుడు, మరియు మండలిలో వివిధ కాలాల్లో సభ్యుడుగా ఉండేవాడు. 1989-1992 మధ్యకాలంలో ఇతడు కర్నాటక శాసన సభ స్పీకర్ గాను, కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు

1999లో, కెపీసీసీ అధ్యక్షుడిగా, ఇతడు తన పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో విజయం వైపు నడిపించాడు, మరియు కర్నాటక ముఖ్యమంత్రిగా 2004 వరకు పనిచేశాడు. ఇతడు ESCOMSలో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడంలో విశేష కృషి సల్పాడు. ఇతడు ప్రయివేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాడు, బెంగళూరు అడ్వాన్స్ టాస్క్ ఫోర్స్‌‌ని ఏర్పర్చడంలో అగ్రగామిగా నిలిచాడు. ఇతడు తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌ అయ్యాడు.

2008 మార్చ్ 5న కృష్ణ మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి రాజీనామా చేశాడు కర్నాటకలో క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి రావాలన్న ఉద్దేశంతోటే ఇలా చేశాడు అప్పట్లో నివేదించబడింది.[1] రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇతడి రాజీనామాను మార్చ్ 6న ఆమోదించారు.[2] కృష్ణ రాజ్యసభలో ప్రవేశించారు. తదనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 2009 మే 22న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నిర్వహించిన పదవులు [మార్చు]

  • 2వ కర్నాటక శాసస సభ సభ్యుడు 1962–67
  • కామన్వెల్త్‌కు భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడు
  • పార్లమెంటరీ కాన్ఫరెన్స్, న్యూజీలాండ్, 1965
  • 5వ లోక్‌సభ సభ్యుడు, 1971–1976
  • 7వ లోక్‌సభ సభ్యుడు, 1980–1984
  • కర్నాటక శాసన మండలి సభ్యుడు 1972–1977
  • వాణిజ్యం & పరిశ్రమలు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, కర్నాటక ప్రభుత్వం 1972–77
  • ఐక్యరాజ్యసమితికి భారతీయ ప్రతినిధి బృంద సభ్యుడు, 1982
  • కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి 1983–1984
  • 1984–1985లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి
  • 9వ కర్నాటక శాసన సభ సభ్యుడు 1989–1992
  • స్పీకర్, కర్నాటక శాసన సభ 1989–93
  • 1990 మార్చి నెలలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెస్ట్ మినిస్టర్ వద్ద జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్‌లో ప్రతినిధి
  • కర్నాటక ఉప ముఖ్యమంత్రి, 1992–1994
  • 1996 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు
  • కర్నాటక ముఖ్యమంత్రి అక్టోబర్ 1999–2004
  • కర్నాటక శాసనసభకు తిరిగి ఎన్నిక: 2004
  • గవర్నర్, మహారాష్ట్ర: 2004–2008
  • విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం: 22 మే 2009 నుంచి ఇప్పటిదాకా

సూచనలు [మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

మూస:S-parమూస:S-parమూస:S-off

ముందు
Unknown
Member for Mandya
1968–1989
తరువాత
Unknown
ముందు
Unknown
Member for Mandya
1996–2006
తరువాత
Unknown
ముందు
Jayadevappa Halappa Patel
Chief Minister of Karnataka
1999–2004
తరువాత
Dharam Singh
ముందు
Mohammed Fazal
Governor of Maharashtra
2004–2008
తరువాత
Sanayangba Chubatoshi Jamir
ముందు
Pranab Mukherjee
Minister of External Affairs
2009 – present

మూస:S-inc

మూస:KarnatakaChiefMinisters