ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ (2008 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
The Uninvited
దస్త్రం:Uninvitedposter.jpg
Theatrical release poster
దర్శకత్వం The Guard Brothers
నిర్మాత Michael Grillo
Ivan Reitman
Tom Pollock
Walter F. Parkes
Laurie MacDonald
Riyoko Tanaka
రచన Original screenplay:
Kim Jee-Woon
Screenplay
Craig Rosenberg
Doug Miro
Carlo Bernard
తారాగణం Emily Browning
Arielle Kebbel
Elizabeth Banks
David Strathairn
Maya Massar
సంగీతం Christopher Young
ఛాయాగ్రహణం Daniel Landin
కూర్పు Jim Page
Christian Wagner
పంపిణీదారు DreamWorks
విడుదలైన తేదీ January 30, 2009 (U.S.)[1]March 26, 2009 (Australia)[2]
నిడివి 87 min.
దేశం United States
భాష English
వసూళ్లు $40,563,148

ది అన్ఇన్వైటెడ్ అనే 2009 నాటి అమెరికన్ సినిమా 2003 నాటి దక్షిణ కొరియా హారర్ సినిమా అయిన ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ కు రీమేక్. 1944 లో ఇదే పేరుతో వచ్చిన అమెరికన్ సినిమాకు 2003లో వచ్చిన కొరియన్ హారర్ సినిమాకు ఎంత మాత్రము సంబంధం లేదు.

కథాంశం[మార్చు]

ఒక బోట్ హౌస్ అగ్ని ప్రమాదంలో వ్యాధిగ్రస్తురాలైన తల్లిని పోగొట్టుకున్న అన్నా (ఎమిలి బ్రౌనింగ్) ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని పిచ్చి ఆసుపత్రిలో చేరుతుంది. 10 నెలల తరువాత ఇంటికి బయలు దేరిన ఆమెకు అగ్ని ప్రమాదం గురించి ఎంత మాత్రమూ జ్ఞాపకం ఉండదు. ముగ్గురు వింత పిల్లలు మరియు ఈ సంఘటన ఆమెకు తరచూ కలలోకి వస్తుంటాయి. ఆమె సర్దుకుంటుండగా మరొక పేషెంట్ తన కథ చెప్పి ఆమెను భయపెడుతుంది. దీనితో ఎంతో భయపడిపోయిన అన్నా తన తండ్రి స్టీవెన్ (డేవిడ్ స్త్రాతైరిన్) తో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది.

అన్నా తిరిగి తన సోదరి అలెక్స్ (అరిఏల్లె కేబెల్) తో కలుస్తుంది. వారి తల్లి కి ఇంటి వద్ద నర్స్ గా సేవలందించి ప్రస్తుతం స్టీవెన్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న రాచెల్ (ఎలిజబెత్ బాంక్స్) తో వారిద్దరూ ఎంతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. వారి తల్లి మరణానికి ముందే స్టీవెన్ ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడని భావించిన అలెక్స్ తన తండ్రిని విమర్శించినప్పటికీ అతను దానిని పెద్దగా పట్టించుకోడు. అన్నా తన కలలో కనిపించినవన్నీ మెలుకువగా ఉండగా జరుగుతున్నాయని తన కలలను అలెక్స్ కు వివరిస్తుంది. ఆ అమ్మాయిలిద్దరూ తమ తల్లి తమకేదో సందేశం పంపుతుందని అగ్ని ప్రమాదం హత్యేనని రాచెల్ ఆ పని చేయించిందని బలంగా నమ్ముతారు.

అన్నా తన పాత బాయ్ ఫ్రెండ్ మాట్ (జేస్సే మోస్) అగ్ని ప్రమాద సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా చూస్తుంది. వీరిద్దరూ అతనిని రహస్యంగా కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాదు. తరువాత, అన్నా కు అతను తమ కిటికీ వైపు పాకుకుంటూ వస్తున్నట్లు కల వస్తుంది. అతను ఆమెకు కలలో కనబడి ఆమె నిజం తెలుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తల్లి తనను హెచ్చరించిందని చెబుతాడు. అంతలో అతను కిందపడి అతని వెన్నుముక విరుగుతుంది. అన్నా తన గది లోపలి నుండి బయటకు పరిగెడితే తెల్లవారిపోయి ఉంటుంది. అక్కడ నీటిలో పడి ఉన్న మాట్ యొక్క శవాన్ని బయటకు తీస్తుండగా ఆమె కలలో కనబడినట్లు అతని వెన్నుముక విరిగి పోయి ఉంటుంది.

స్టేట్ నర్సింగ్ అసోసియేషన్ లో రాచెల్ యొక్క పేరు ఈ అక్కచెల్లెళ్ళకు కనిపించదు. తరువాత ఆమె పేరు మిల్డ్రెడ్ కేంప్ అనీ, ఒక భార్యను కోల్పోయిన భర్త తన ముగ్గురు పిల్లలను చూసుకోవడానికి ఈమెను నియమించగా అన్నా కలలో కనిపించిన ఆ పిల్లలను కూడా ఆమె చమినట్లు తెలుసుకుంటారు. వారు స్టీవెన్ హెచ్చరించడానికి పూనుకోగా అతను బాధపడి బయటకు వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయిలు ఆధారాలు సంపాదించడానికి పూనుకోగా రాచెల్ వారిని ఎదుర్కొని అలెక్స్ కు మత్తుమందు ఇస్తుంది. అన్నా తప్పించుకుని పోలీసులను చేరుతుంది. ఆమెను అనుమానించిన పోలీసులు రాచెల్ ను పిలిచి ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకు వెళ్ళమంటారు.

రాచెల్ అన్నా ను మంచం దగ్గరకు తీసుకువెళుతుంది. అలెక్స్ ఒక కత్తి పట్టుకుని తలుపు పక్క నుండి వెళుతుండగా అన్నా చూస్తుంది. తరువాత, అన్నా మేల్కొనే సరికి ఒక దగ్గర రక్తం చారికలు కట్టి ఉండడంతో దాని వెంట వెళ్ళిన అన్నా కు పాత సామానుల మధ్య రాచెల్ శవం కనిపిస్తుంది. అలెక్స్ అక్కడే కత్తి పట్టుకుని ఉంటుంది. ఆ అమ్మాయిలు ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటుండగా స్టీవెన్ అక్కడకు వస్తాడు. రాచెల్ తనపై దాడి చేయబోగా అలెక్స్ తనను రక్షించినట్టు చెబుతుంది అన్నా. అయోమయంలో పడిన స్టీవెన్ అలెక్స్ అగ్ని ప్రమాదంలో మరణించినట్లు చెబుతాడు. అప్పుడు గమనించిన అన్నాకు తాను అనుకుంటున్నట్లు తాను అలెక్స్ చేయి పట్టుకుని లేనని కత్తి పట్టుకుని ఉన్నానని అర్ధం అవుతుంది.

అన్నా కు చివరికి అగ్ని ప్రమాదం గుర్తుకు వస్తుంది. ఆమె తండ్రికి మరియు రాచెల్ కు ఉన్న సంబంధాన్ని చూసి భరించలేకపోయిన అన్నా బోట్ హౌస్ లోని గాసోలిన్ టాంక్ లో ఉన్న పెద్ద వాటరింగ్ కాన్ ను తగలబెట్టేయ్యాలని ఇంటి వరకు మోసుకుని వస్తుంది. కాండిల్ తో దానిని కాల్చే ప్రయత్నం చేసి వదిలిపెట్టేయగా అప్పుడు జరిగిన పేలుడులో ఆమె తల్లి మరియు అలెక్స్ మరణిస్తారు. మాట్ ను ప్రణాళిక ప్రకారం తానే కలుసుకుని చంపినట్లుగా గుర్తుకు వస్తుంది. స్టీవెన్ అలెక్స్ ను నిర్లక్ష్యం చేసినట్లు తాను అనుకుంటూ వచ్చాననీ, నిజానికి అక్కడ అలెక్స్ లేనే లేదనీ ఆమెకు అర్ధం అవుతుంది. రాచెల్ తానే ఆ కత్తితో చంపినట్లుగా ఆమెకు గుర్తుకు వస్తుంది.

ఒక పాత బాయ్ ఫ్రెండ్ నుండి తప్పించుకునేందుకే రాచెల్ తన పేరు మార్చుకుందని స్టీవెన్ పోలీసులకు తెలియ చేయగా వారు అన్నా ను అరెస్ట్ చేసి తిరిగి పిచ్చి ఆసుపత్రికి తీసుకు వెళతారు. అన్నా మిల్డ్రెడ్ కథను ఎందుకు అల్లిందని పోలీసులు అడుగగా స్టీవెన్ సమాధానం చెప్పలేకపోతాడు. అన్నా ను పిచ్చి ఆసుపత్రిలో అంతకు ముందు భయట్టిన పేషెంట్ తిరిగి ఆహ్వానిస్తుంది. ఆమె తలుపు పక్కన నేమ్ ప్లేట్ మీద "మిల్డ్రెడ్ కేంప్" అని రాసి ఉంటుంది.

తారాగణం[మార్చు]

  • అన్నా గా ఎమిలీ బ్రౌనింగ్
  • అలెక్స్ గా అరిఎల్లె కేబెల్
  • రాచెల్ గా ఎలిజబెత్ బ్యాంక్స్
  • స్టీవెన్ గా డేవిడ్ స్త్రతైర్న్
  • మాట్ గా జేస్సే మోస్
  • అమ్మ గా మాయా మస్స
  • షేరిఫ్ఫ్ ఎమిరి గా కెవిన్ మెక్ నుల్టి
  • ఇరిస్ గా లెక్స్ బరన్ హాం
  • సామ్యుల్ గా డానీ బ్రిస్టల్
  • డేవిడ్ గా మాథ్యు బ్రిస్టల్
  • హేన్సన్ గా డాన్ ఎస్. డావిస్
  • మిల్డ్రెడ్ కేంప్ గా హెతర్ దోఏర్క్సన్
  • డాక్టర్ సిల్బర్లింగ్ గా డీన్ పాల్ గిబ్సన్

s e.sandeep india

అభివృద్ధి[మార్చు]

2002 లో వాల్టర్ ఎఫ్.పార్కర్స్ మరియు లారీ మెక్ డోనాల్డ్ అనే నిర్మాతలు రింగు అనే జపనీస్ సినిమాకు రీమేక్ గా ది రింగ్ అనే హారర్/ థ్రిల్లర్ సినిమాను నిర్మించగా అది ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. 2005 లో దీనికి సీక్వెల్ గా ది రింగ్ టు అనే సినిమా ను కూడా వీరు నిర్మించారు. ఈ ఆసియన్ హారర్ సినిమా సీక్వెల్ ను ప్రారంభించిన నాటి నుండి పార్క్స్ మరియు మెక్ డోనాల్డ్ ది రింగ్ సినిమాకు ధీటుగా నిలబడగలిగే మరొక ప్రాజెక్ట్ కోసం అన్వేషణ చేస్తుండగా ది అన్ఇన్వైటెడ్ కు ఆధారంగా ఉన్న కొరియన్ హిట్ సినిమా ను నిర్మాత రాయ్ లీ వీరి దృష్టికి తీసుకురావడం జరిగింది.

యు.ఎస్ థియేటర్ లలో ఏ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ ప్రదర్శింపబడుతుండగానే టాం మరియు చార్లీ గార్డ్ ఈ సినిమా ఇంగ్లీష్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. నోకియ, యూరో డిస్నీ, ప్లేస్టేషన్ 2 మరియు ఎక్స్ బాక్స్ వంటి షార్ట్ ఫిలిం లు మరియు కమర్షియల్ లకు దర్శకత్వం వహించే ముందు గార్డ్ సోదరులిద్దరూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుకున్నారు. ఈ కొరియన్ రీమేక్ సినిమా నే వీరి మొదటి ఫీచర్ సినిమా. జూన్ 2006 లో ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ కు సంబంధించి యు.ఎస్ వర్షన్ కు గాను డ్రీం వర్క్స్ ఒక డీల్ ను ప్రకటించింది. ఈ కొత్త సినిమా డ్రీం వర్క్స్ మరియు కోల్డ్ స్ప్రింగ్ పిక్చర్స్ సంస్థ (డిస్తార్బియ ) ల ఆధ్వర్యంలో వాల్టర్ ఎఫ్. పార్కర్స్, లారీ మెక్ డోనాల్డ్ (ది రింగ్ , ది రింగ్ టు ) మరియు రాయ్ లీ లు నిర్మించబోతున్నట్లు ప్రకటన సారాశం. దీనికి స్క్రీన్ ప్లే ను క్రేగ్ రోసేన్బర్గ్ (ఆఫ్టర్ ది సన్ సెట్ , లాస్ట్ , డౌగ్ మీరో) మరియు కార్లో బెర్నార్డ్ (ది గ్రేట్ రైడ్ )లు వ్రాయడం జరిగింది.[3]

2008 తొలినాళ్ళలో ఈ సినిమా టైటిల్ ను మార్చాల్సిన అవసరం కలిగింది. దీనికి వర్కింగ్ టైటిల్ గా ఎ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ ను ఖరారు చేయగా దీనికి ది అన్ఇన్వైటెడ్ అనే పేరును ఖరారు చేసినట్లు మార్చ్ లో ప్రకటించడం జరిగింది.[4]

జనవరి 30,2009 న చివరకు ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ అయింది.

షూటింగ్ లొకేషన్[మార్చు]

ఈ సినిమా బ్రిటిష్ కొలంబియా లోని వాంకోవర్ లో షూటింగ్ జరుపుకుంది. చాలా వరకు సినిమా ఒకే లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంది. అది బ్రిటిష్ కొలంబియ లోని బోవెన్ ఐలాండ్ మరియు మెయిన్ లాండ్ వాంకోవర్ కు పశ్చిమాన ఉన్న చిన్న ఫెర్రీ రైడ్ ప్రాంతము. సినిమాలో 80 శాతం ఒక ఇంటి లోనే జరుగుతుంది కాబట్టి ఒక సరైన ఇల్లు లేకుండా ఈ సినిమా నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నాము అని వాల్టర్ ఎఫ్. పార్కర్ అన్నారు. అది అంత ముఖ్యమైనది కాకపోవొచ్చు. అందంగాను మరియు కొంచెం భయపెట్టేదిగాను ఉన్న ప్రాంతం కోసం లూసియాన అంతా తిరిగాము. చాలా రాజీ పది రెండు ఇల్లు అనుకున్నప్పటికీ అవి రెండూ వీలు పడలేదు. కథ కు తగినట్లుగా ఉంటూ అన్ని సౌకర్యాలూ కలిగిన ఇంటి కోసం మేము ఎంతో కష్టపడ్డాము.

చివరకు కెనడాలో మా సినిమా కోసమే కట్టినట్లు ఉన్న ఇల్లు దొరకడం ఎంతో అదృష్టంగా భావించాము అని ఆయన అన్నారు. కొంచెం అందరినీ ఆహ్వానిస్తున్నట్లు గాను మరి కొంత రహస్యంగాను ఉండేట్లు కనపడే ఒక కుటుంబం యొక్క ఇంటికి ఆ ఇల్లు ఖచ్చితంగా సరిపోయింది. ఇది వాంకోవర్ కు కేవలం 30 మైళ్ళ దూరంలో ఉండడం కూడా కలిసి వచ్చింది. అందరినీ షూటింగ్ కు బోట్ లు, వాటర్ టాక్సీలు మరియు ఫెర్రీలలో అక్కడికి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి, ఈ లొకేషన్ లో గడిపిన దానికన్నా సంతోషంగా నేను ఎక్కడా గడిపినట్లు లేను. బోట్ లోకి ఎక్కి ఒక కప్పు కాఫీ తాగి మేము కట్టిన మెట్ల పై నుండి పైకి వెళితే దృష్టి అంతా దాని మీదనే ఉండేది. మా మనసులలో ఈ సినిమా నిర్మాణం తప్ప వేరే ఏ ఆలోచనా లేదు. ఇది ఎంతో గొప్ప విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.[5][6]అయితే ఈ సినిమా లొకేషన్ మైనే లో ఏర్పాటు చేయబడింది.

ఈ సినిమా కోసం నిర్మించిన రెండు అంతస్తుల బోట్ హౌస్ మీద దృష్టి ఎక్కువై చాలా సీన్ లలో నీటి మీద దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. చల్లని నీళ్ళు ఎంతో కటినంగా ఉండి ఆకుపచ్చని-బూడిద రంగులో ఉండి ఆకట్టుకునేలా లేవనీ, ఈతకు ఎంత మాత్రం ఆసక్తి కలగదనీ అందరూ అభిప్రాయపడ్డారు.[7]

బోవెన్ ఐలాండ్ లోని 48 ఈగల్ ట్రీ రోడ్ లో చాలా వరకు షూటింగ్ జరిగింది.[8] ప్రస్తుతం ఈ ఇల్లు $8,400,000కు అమ్మకానికి పెట్టబడింది.[9]

తారాగణం[మార్చు]

అన్నా ఇవర్స్ పాత్ర కు గాను ఎమిలి బ్రౌనింగ్ ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈమెను నిజానికి అలెక్స్ పాత్రకు గాను ఆడిషన్ కు పిలవడం జరిగింది. ఈ సినిమా PG-13 రేటింగ్ ను పొందడమే కాక ఒరిజినల్ సినిమా కన్నా ఎక్కువ భయానకం గా ఉన్నట్లు గుర్తింపు పొందింది.[7] ఎలిజబెత్ బాంక్స్ రాచెల్ అనే కొత్త పాత్ర ను ధరించింది.[10] ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రాడిల్ లో రెబెక్క డి మోర్నే పోషించిన పాత్ర ఆధారంగా బాంక్స్ తన రాచెల్ పాత్రను మలుచుకుంది.[11] "ఈ సినిమాలో నేను మాట్లాడే ప్రతి మాటకు రెండు అర్ధాలు ధ్వనించేలా మాట్లాడడం ఎంతో ముఖ్యం" అని తన పాత్ర గురించి చెపుతూ బాంక్స్ అన్నారు, "కాబట్టి మీరు వెళ్లి ఇప్పుడు సినిమా చూస్తే దానిని గమనించవచ్చు". అంటుంది ఆమె.[12] ఇద్దరు అమ్మాయిలకు బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో డేవిడ్ స్త్రాతైరాన్ కనిపిస్తారు.[13] అన్నా సోదరి అయిన అలెక్స్ ఇవర్స్ పాత్రలో అరిఎల్లి కేబెల్ కనిపిస్తుంది.[14]

సంగీతం[మార్చు]

ఈ సినిమా ఒరిజినల్ సంగీతం క్రిస్టోఫర్ యంగ్ కంపోజ్ చేసాడు. ఇతడు దీనిని 78 పీస్ ల ఆర్కెస్ట్రా తో మరియు 20 మంది కోరస్ తో రూపొందించాడు. [15] గ్లాస్ హార్మోనిక మరియు యేల్ వుమెన్ స్లేవిక్ కోరస్ ల లక్షణాలు ఇతని సంగీతంలో ఉంటాయి.[15]

గృహ ప్రసారమాధ్యమాలు[మార్చు]

యునైటెడ్ స్టేట్స్ లో ఏప్రిల్ 28,2009న ఈ సినిమా యొక్క డివిడి లు మరియు బ్లూ-రేలు విడుదల కాగా జూలై 23,2009న ఆస్ట్రేలియాలో విడుదల అయ్యాయి.

ఆదరణ[మార్చు]

విమర్శ[మార్చు]

ఈ సినిమాకు మిశ్రమ మరియు వ్యతిరేక విమర్శలు ఎక్కువగా వచ్చాయి. 4.6/10 స్కోర్ తో 36 శాతం (72 మందిలో 26 మంది)ఈ సినిమాను ప్రశంసిస్తూ రివ్యూలు వ్రాసినట్లు రాటెన్ టొమాటోస్ తెలియ చేసింది.[16] 22 రివ్యు ల నుండి 44/100 స్కోర్ తో మెటా క్రిటిక్ మిశ్రమ లేక యావరేజ్ సినిమాగా తేల్చింది.[17] బ్లడీ డిజ్గస్టింగ్ ఈ సినిమాకు 6/10 స్కోర్ ఇవ్వగా[18], 11 రివ్యులను ఒక దగ్గరకు చేర్చి యాహూ మూవీస్ క్రిటికల్ రెస్పాన్స్ ఆవరేజ్ రేటింగ్ అయిన C ను ఇచ్చింది.[19]

బాక్సాఫీసు పనితీరు[మార్చు]

సినిమా విడుదల రోజునే $4,335,000 వసూలు చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు చరిత్రలో రెండవ స్థానాన్ని పొందింది.[20] విడుదలైన 2,344 థియేటర్ లలో సగటున థియేటర్ కు $4,485 వసూలు చేయడమే కాక విడుదలైన మొదటి వారంలో $10,512,000 వసూలు చేసి ఇది మూడవ స్థానంలో నిలిచింది.[21] యు.ఎస్ లోని థియేటర్ లలో 9 వారాల పాటు ప్రదర్శింపబడిన ఈ సినిమా మొత్తం $28,596,818 వసూలు చేసింది. యు.ఎస్ లో హారర్ సినిమాలకు ఉన్న మార్కెట్ తో పోలిస్తే ఈ సినిమా బాగా ఆడినట్లుగా చెప్పాలి.[22] ఆస్ట్రేలియా లో మార్చ్ 26 , 2009 న విడుదల అయిన ఈ సినిమా మొత్తం 121 సెంటర్ లలో సగటున $3,998 చొప్పున మొత్తం $483,714 ఆస్త్రేలియన్ డాలర్లు వసూలు చేసి అక్కడ మొదట ఐదవ స్థానంలో నిలిచింది. రెండవ వారంలో ఇది 29 శాతానికి పడిపోయింది.[23]

సూచనలు[మార్చు]

  1. "Announcement of release date". Bloody-Disgusting. 
  2. http://www.uninvitedmovie.com/intl/au/ "The Uninvited" official Australian website
  3. స్సిఫిక్ జపాన్(డిసెంబర్ 26, 2007). "టు బ్రదర్స్ రీమేక్ టు సిస్టర్స్." స్సిఫిక్ జపాన్ .కామ్. జనవరి 25, 2009న సేకరించబడింది.
  4. "Announcement of title change". Fangoria.com. 
  5. స్సిఫిక్ జపాన్ (డిసెంబర్ 26, 2008). "ది పెర్ఫెక్ట్ హౌస్." స్సిఫిక్ జపాన్ . జనవరి 25, 2009న సేకరించబడింది.
  6. స్సిఫిక్ జపాన్ (డిసెంబర్ 26, 2008). "ది పెర్ఫెక్ట్ హౌస్." స్సిఫిక్ జపాన్ . జనవరి 25, 2009న సేకరించబడింది.
  7. 7.0 7.1 హైడి మార్తినుజ్జి (జనవరి 05, 2009). "యాన్ ఇన్విటేషన్ టు ద సెట్ ఆఫ్ ది అన్ఇన్వైటెడ్." shocktillyoudrop.com. జనవరి 25, 2009న సేకరించబడింది.
  8. http://www.bimbc.ca/files/embedded/070618SpC8-2.pdf]
  9. http://www.bowenrealty.ca/ShowListing.php?listing_id=57
  10. హైడి సాం బాల్త్రుసిసి(జనవరి 11, 2009). "ఎలిజబెత్ బాంక్స్ గెట్స్ వికెడ్ ఇన్ ది అన్ఇన్వైటెడ్." లోడ్ గన్ బోస్టన్. జనవరి 25, 2009న సేకరించబడింది.
  11. "Elizabeth Banks: The Uninvited". SuicideGirls.com. 30 January 2009. Retrieved 2009-01-30. .
  12. "Elizabeth Banks: The Uninvited". SuicideGirls.com. 30 January 2009. Retrieved 2009-01-30. .
  13. మిస్టర్ డిస్గాస్టింగ్ జూన్ 18, 2007 "డేవిడ్ స్త్రతైర్న్ స్టార్స్ ఆపొసిట్ బ్యాంక్స్ ఇన్ 'టు సిస్టర్స్' రీమేక్ ." బ్లడీ డిస్గస్టింగ్ జనవరి 25, 2009న సేకరించబడింది.
  14. అరిఎన్న షువెబార్ డిసెంబర్ 11, 2008 "అరిఎల్లి కేబెల్ ఇన్ “ది అన్ఇన్వైటెడ్”." గిల్ మోర్ గర్ల్ న్యూస్. జనవరి 25, 2009న సేకరించబడింది.
  15. 15.0 15.1 Dan Goldwasser (2008-06-03). "Christopher Young scores the horror film The Uninvited". ScoringSessions.com. Retrieved 2008-06-03. 
  16. "The Uninvited (2009) Movie Reviews, Pictures - Rotten Tomatoes". Rotten Tomatoes. Retrieved 2009-02-02. 
  17. "Uninvited, The DreamWorks Pictures (Paramount): Reviews". Metacritic. Retrieved 2009-02-02. 
  18. "The Uninvited (A Tale of Two Sisters remake): Review". Bloody Disgusting. Retrieved 2009-02-02. 
  19. "The Uninvited (2009): Reviews". Yahoo! Movies. Retrieved 2009-02-02. 
  20. "THE UNINVITED - Daily Box Office Result". Box Office Mojo. Retrieved 2009-02-02. 
  21. "Weekend Box Office Results from January 30–February 1, 2009". Box Office Mojo. 2009-02-02. Retrieved 2009-02-02. 
  22. http://boxofficemojo.com/movies/?page=daily&id=uninvited.htm "The Uninvited" US Gross
  23. http://urbancinefile.com.au/home/boxoffice.asp

బాహ్య లింకులు[మార్చు]