ఏకవీర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన నవల.

కథాసంగ్రహం[మార్చు]

ఏకవీర' నవలలో ధర్మానికి ప్రతీకగా 'అమృతం ' అనే బాలిక పాత్రను సృష్టించి, ఆమె చేత ఏకవీరకు 'ఆరంజే విరుంబు' (ధర్మం చెయ్యి) అని హెచ్చరిస్తూ ఉంటాడు.

నవల చివరలో ఊహించని పరిస్థితుల్లో పూర్వప్రేమికులైన ఏకవీర, వీరభూపతి ఒకరికొకరు ఎదురై, ధర్మం తప్పి, తమను మరచి ఆలింగనం చేసుకుంటారు. ఆ విధంగా పరాయి వాళ్ళని కౌగిలించుకోవడం ఇద్దరికీ అధర్మమే. కానీ విశ్వనాథ వారు స్త్రీయైన ఏకవీరకు ఒకరకమైన శిక్ష, పురుషుడైన వీరభూపతికొక రకమైన శిక్ష విధించారు.

ఏకవీర చేత వెనుదిరిగి సరిదిద్దుకోలేని విధంగా వైగై నదిలో ఆత్మాహుతి చేయిస్తారు. వీర భూపతిని సర్వసంగ పరిత్యాగిగా చేసి సంఘ బహిష్కరణ చేస్తారు. ఇక, ఏకవీర ననుసరిస్తూ కుట్టాన్‌ కూడ వైగై నదిలో మరణించాడు.

మీనాక్షి, కుట్టాన్‌లలో -కుట్టాన్‌ మరణంతో మీనాక్షికి పూర్వ ప్రేమికుడైన కుట్టాన్‌, భర్త అయిన వీరభూపతి ఇద్దరూ దూరమై పోతారు.

తెలుగు సినిమా[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఏకవీర&oldid=1337680" నుండి వెలికితీశారు