ఏనుకూరు

వికీపీడియా నుండి
(ఏన్కూరు నుండి దారిమార్పు చెందింది)
  ?ఏనుకూరు మండలం
ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్
ఖమ్మం జిల్లా పటములో ఏనుకూరు మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో ఏనుకూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఏనుకూరు
జిల్లా(లు) ఖమ్మం
గ్రామాలు 11
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
33,151 (2001)
• 17103
• 16047
• 51.33
• 62.29
• 39.62



ఏనుకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. దీనిని ఆంగ్లములో Enkoor అనిగానీ Enkur అనిగానీ వ్రాస్తుంటారు. ఇది సుజాతనగర్‌ నియోజకవర్గములో ఉన్నది. ఈ గ్రామము ఒక సాధారణమైనటువంటి గ్రామమే అయినప్పటికీ దీనికి కొన్ని ప్రత్యేకథలు ఉన్నాయి.

  • ఇది ఖమ్మం నుండి కొత్తగూడెం (లేదా భధ్రాచలం, మణుగూరు, రాజమండ్రి) వెళ్ళు మర్గములో హైవేపై తల్లాడ దాటిన తరువాత పన్నెండు కిలోమీటర్లకు వస్తుంది.
  • అలాగే దీనిని చేరుకోవడానికి ఖమ్మం నుండి పండితాపురం, ముచ్చర్ల, తిమ్మారావుపేట గ్రామాల ద్వార ఇంకో మార్గము ఉన్నది.
  • దీని చుట్టు పక్కన చాలా గ్రామాలు ఉండుటం వల్ల ఒక ప్రధాన వ్యాపార కూడలిగా రూపాంతరము చెందినది.
  • ముఖ్యముగా వ్యవసాయానికి కావలసిన పరికరములూ, విత్తనములు, పురుగుమందుల కోసం ఇక్కడకి చాలామంది చుట్టు పక్కగ్రామాల నుండి వస్తూ ఉంటారు.
  • ఇక్కడ ఆంధ్ర ప్రదేశు గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్తు పాఠశాలు, upper primary schoolలు, డిగ్రీ కళాశాల ఉండుతం వల్ల ఇది ఒక విధ్యా కేంద్రముగా వెలుగొందుతున్నది.
  • ఏనుకూరు ఏజన్సీ ప్రాంతము క్రిందకు వస్తుంది. బహుశా ఖమ్మం నుండి వస్తుంటే ఏజన్సీ ప్రాంతానికి ఇదే ఆరంభం అనుకుంటాను.
  • ఈ గ్రామములో నూతనముగా నిర్మించిన రామాలయము, సాయిబాబా గుడులతో పాటు, దీనికి దగ్గరలోని గ్రామాలలో గార్ల ఒడ్డు నందు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, నాచారం నందు ఉన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానములు చాలా ప్రసిద్ది.
  • ఈ గ్రామము ద్వారా నాగార్జున సాగరు ఎడమ కాలువ పోతూ సస్యస్యామలం చేస్తుంది, అలాగే దగ్గరలోని గ్రామాలకు ఇక్కడ ఓ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ఉన్నది.

ఇంకా ఓ పశువైధ్యశాల, పోష్టాఫీసు, రెండు మూడు ప్రైవేటు ఆసుపత్రులూ, ఓ గవర్నమెంటు ఆసుపత్రి(?) ఉన్నాయి.

కాకపోతే దీనికి ఇంతవరకూ ఓ మంచి బస్టాండు లేకపోవడము ఓ పెద్ద లోటు.

మండలంలోని గ్రామాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఏనుకూరు&oldid=531398" నుండి వెలికితీశారు