ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.
అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

పదవీ కాలము
జూలై 25, 2002 – జూలై 25, 2007
ముందు కె.ఆర్.నారాయణన్
తరువాత ప్రతిభా పాటిల్

జననం (1931-10-15) అక్టోబరు 15, 1931 (వయస్సు: 83  సంవత్సరాలు)[1]
ధనుష్కోడి, రామేశ్వరం,
తమిళనాడు, భారత దేశము
రాజకీయ పార్టీ ఏ పార్టీకి చెందనివారు
భార్య/భర్త అవివాహితుడు
మతం ఇస్లాం

సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (జననం అక్టోబర్ 15, 1931, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశం), క్రితం భారత రాష్ట్రపతి. అంతే గాక ఆయన భారత దేశపు ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఇంజనీరు కూడా.

జీవితం

చిన్ననాటి విశేషాలు

 • "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి'
 • ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం

తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు3.8.2008)

పుస్తకాలు[మార్చు]

 • ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0-14-027833-8
 • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0-14-302982-7
 • ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 81-7446-350-X
 • ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0-07-053154-4
 • జీవితచరిత్రలు
  • వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 81-7371-146-1
  • సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 81-212-0807-6
  • ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 81-86830-55-3
  • ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 81-261-1344-8
  • ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 81-7648-380-X

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


ఇంతకు ముందు ఉన్నవారు:
కె.ఆర్.నారాయణన్
భారత రాష్ట్రపతి
2002 జూలై 252007 జూలై 25
తరువాత వచ్చినవారు:
ప్రతిభా పాటిల్